రివ్యూ

ఆడేసుకున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు ** అర్జున్ రెడ్డి

తారాగణం: విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్, గోపీనాధ్ భట్, కాంచన, జియాశర్మ, కమల్ కామరాజు, ప్రియదర్శి
ఛాయాగ్రహణం: రాజు తోట
సంగీతం: రధన్
నిర్మాత: ప్రణయ్‌రెడ్డి వంగ
రచన, దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ

అర్జున్ రెడ్డి సినిమా గురించి స్ట్రెయట్ పాయంట్ చెప్పేసుకుంటే -అది రొటీన్‌కు భిన్నం. కాకపోతే చూపించిన ‘వైవిధ్యం’లో కొన్నిచోట్ల వాస్తవపు అంచుల్ని అమాంతం మింగేసింది. ఇక వివరాల్లోకి వెళితే...
మంగళూరు వైద్య కళాశాలలో చదువుతున్న హౌస్ సర్జన్ అర్జున్‌రెడ్డి (విజయ్ దేవరకొండ). ఫస్టియర్ మెడికో ప్రీతి (షాలినీ పాండే)తో లవ్‌లో పడతాడు. ఎంతగా అంటే -దాదాపు ‘లివింగ్ రిలేషన్’ అంత. కులభేదాలవల్ల వారి పెళ్లికి ప్రీతి తండ్రి అంగీకరించడు. ప్రీతి పెళ్లి వేరేవాళ్లతో అయిపోతుంది. దాంతో మద్యపానం, మాదకద్రవ్యాలకీ దాసుడైపోతాడు అర్జున్. ఆధునిక దేవదాసుగా మారిన అర్జున్ జీవితం చివరకు ఎలా మలుపు తిరిగింది అన్న సమాధానంతో చిత్రం ముగుస్తుంది. రొటీన్ సినిమా ప్రేమ కథలకు కాస్త వైవిధ్యం ఈ అర్జున్‌రెడ్డి. అయితే అంత తొందరగా మింగుడుపదు. ఉదాహరణకు అర్జున్, ప్రీతి చాలా ఇంటిమేట్‌గా అమ్మాయి ఇంట్లోనే (పెళ్లికాకముందే) వుండడాన్ని చూసి ఆమె తండ్రి అతన్ని వెళ్లగొడతాడు. అప్పుడు అర్జున్, ప్రీతి తండ్రితో ‘మా రిలేషన్ రిజిష్టర్ (పెళ్లి) కాలేదని మమ్మల్ని తప్పుగా భావించద్దు అంకుల్’ అంటాడు. మరి సంఘానికున్న కట్టుబాట్లవల్ల జరిగిన సంఘటన పట్ల ప్రీతి తండ్రి అలా ఊహించడం వద్దని వారించడం తప్పదు. ఎందుకంటే దేశంలో అందరూ అన్నమాటను నిలబెట్టుకునే లేదా తమ చర్యల్ని చట్టబద్ధం చేసే దృఢ దక్షతగల అర్జున్ లాంటి వాళ్లే కాదు, అమ్మాయిల్ని ఆట వస్తువుల్లా వాడి వదిలేసిన వారూ ఉంటారు. కనుక ఎవరి హద్దుల్లో వారు పరిస్థితుల పరంగా ఉండాలన్నదే పెద్దల లక్ష్యం. అదీకాకుండా అనే్నళ్లు అమ్మాయి ఎలా ఉందో, ఎలాంటి నడవడికతో కదుల్తోందో అన్నది కట్టుబాట్లుకల కుటుంబంమని చెప్పుకునే మంజునాథ (ప్రీతి తండ్రి) తనిఖీ చేసుకోడా? అన్నది దర్శకుడు పూర్తిగా విస్మరించేశాడు. అలాగే వ్యక్తి ఎంతగా చెయ్యితిరిగిన శస్తచ్రికిత్సా నిపుణుడైనా, ఈ సినిమాలోలా విపరీతంగా మద్యం సేవించి ఆపరేషన్లు చేయడమన్నది కుదరని పని. కానీ ‘నేను చేసినవన్నీ అలా చేశాను. అవి ఏవీ గురి తప్పలేదు. పేషెంట్‌కి ప్రమాదం లేదు’ అని చెప్పడం విపరీతమైన అంశం. అయితే తాను చేసింది తప్పేనని కోర్టువాదనల్లో అర్జున్ అంగీకరించడం హుందాగావుంది. అదేవిధంగా ‘ఏంగర్ మేనేజ్‌మెంట్’ తెలియని వ్యక్తిగా నాయకుణ్ణి అభివర్ణించారిందులో. ఆ లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని అతను అనేక స్థాయిల్లో చేయడానికి అవకాశమున్నా చేసినట్లు చూపకపోవడం, సినిమాను ఇలాగే తీసేయాలన్న మొండి దృక్పథమే కావచ్చు. కానీ ప్రీతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి (అప్పటికి ఆ బిడ్డకు తండ్రి తనేనని నాయిక ఇంకా చెప్పదు) నేనే అవుతానని చెప్పడం అతని విశాల మనస్తత్వానికీ అద్దం పట్టింది. కానీ మన పెళ్లి జరగకపోవడానికి నీ తొందరపాటుతనమేనంటూ హీరోయిన్ చెప్పిన కారణమూ కన్విన్సింగ్‌గా ఉంది. కథ ఎలా తిరిగినా, చివరకు నాయికా నాయకులిద్దరి జీవితం వివాహం చేసుకోవడంతోనే ముగింపునకు రావడం దర్శకుడు తీసుకున్న పెద్ద ఉపశమన చర్య. ‘అర్జున్‌రెడ్డి’ అనగానే ఈమధ్యకాలంలో ‘లిప్‌లాక్ సీన్స్’కి తెలుగులో బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లే ఇవి చిత్రంలో డజనుకుపైగా ఉన్నాయి. అయితే వీటివల్ల సినిమాకు ఆరంభ వసూళ్లు విపరీతంగా వచ్చిన మాట వాస్తవమే. కానీ వీటి సంఖ్య ఎక్కువకావడంతో ఈ ముద్దులపట్ల ప్రేక్షకులకు మొహం మొత్తేలా అయిపోయింది. సినిమాను ఏ విధంగా చూసినా విజయ్ దేవరకొండ అర్జున్‌గా దాదాపు ఒంటిచేత్తో మోసేశాడని చెప్పచ్చు. అదే రీతిలో నాయకుని స్నేహితుడు శివ పాత్రలో రాహుల్ రామకృష్ణ కూడా ఎన్నదగిన నటన కనపర్చాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో చూపిన ఈజ్ ఆకర్షించింది. చాలాకాలానికి పాతతరం నటి కాంచన ఇందులో హీరో నాయనమ్మగా కనిపించి అలరించారు. నాయకుని అన్న పాత్రలో కమల్ కామరాజు, హీరోయిన్ ఫాదర్‌గా గోపీనాథ్ భట్ నటించారు. ప్రీతి పాత్రలో షాలినీ పాండేకి పరిధి తక్కువైనా చాలావరకూ రోల్‌ని అర్థం చేసుకుని నటించింది. కథా విధానం ఎంత వైవిధ్యంగా వుండాలని అనుకున్నాడో డైరెక్టర్ డైలాగ్స్ ఆ రకంగానే ఉండాలని భావించి ఉంటాడు. మరి ఆ వాస్తవం పాళ్లు మరీ ఎక్కువ కావడంతో చాలాచోట్ల సెన్సారు కత్తెరకు లోనయ్యాయి. అయినా ఇంకా కొన్నిటిని సెన్సారు ఉదారంగా వదిలేసిందనే అనిపించింది. దాంటోపాటు మెచ్చుకోతగ్గ సంభాషణలూ ఇందులో ఉన్నాయి. ‘నాలో నీకు ఏం ఇష్టం?’ అని నాయిక అడిగితే హీరో దానికి సమాధానంగా ‘నీవు గాలి పీల్చుకునే స్టైల్ నాకు ఇష్టం’ అంటాడు. అలాగే నాయమ్మ పాత్రధారిణి ఓ సందర్భంలో ‘బాధ వ్యక్తిగతం, ఎవరికివారు పడాలి, ఎవరూ దాన్ని సరిదిద్దలేరు..’ అంటుంది. కానీ సంభాషణలన్నీ ఇంగ్లీషులోనే చాలాచోట్ల నడవడం కొంత అసౌకర్యంగా ఉంది. పైన ఉదహరించిన సంభాషణా ఆంగ్లంలోనే సాగింది. రథన్ రిథిమ్స్‌లో ‘మధురమే ఈ క్షణమే ఓ చెలీ’ అన్నది బావుంది. సన్నివేశాలకు తగిన బిజి అందించటంలో రథన్ సక్సెస్ అయ్యాడు. సాహిత్యపరంగానూ ‘కాలం పరుగులు ఆపి వీక్షిద్దాం అంది’ వంటి వాక్యాలతో అలరించింది. మరో పాటలో ‘నీ పంతం విశ్వమంత’ పద ప్రయోగం కథా సూత్రానికి చక్కగా సరిపోయింది. శశాంక్ (ఎడిటర్) చిత్రం నిడివి విషయంలో నిష్కర్షంగా ఉండి రెండు గంటల కాలానికి కుదించి ఉంటే ప్రేక్షకులకు ఎంతో మేలుచేసిన వారయ్యేవారు. ఎందుకంటే సినిమా కానె్సప్టుని ఆ వ్యవధిలో చక్కగా చెప్పే అవకాశముంది కనుక. దానివల్ల పునరుక్తి సీన్లూ, లాగుడు సన్నివేశాల బాధ తప్పేది.

-అనే్వషి