Others

బోధించేది నేర్చుకో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది జ్ఞానం గురుశిష్యుల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. జ్ఞానమనేది వౌలిక సౌకర్యాల కల్పన వల్ల రాదు. మనిషి మెదడులోని ఆలోచనల పరంపర నుంచి రావాల్సిందే. జ్ఞానాన్ని పెంచే ఉపాధ్యాయుల పద్ధతులే తరగతి గది ప్రమాణానికి మూలమవుతాయి. దీన్ని గతంలో టీచర్ ఎడ్యుకేషన్ అనేవారు. నేడు దీనే్న ‘ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్స్’ అంటున్నారు. జ్ఞానాన్ని ఏ విధంగా బోధిస్తే విద్యార్థి నేర్చుకుంటాడో ఉపాధ్యాయుడు ఆ మార్గాన్ని అవలంబిస్తాడు. దీనే్న ‘టీచింగ్ ఆఫ్ సైన్స్’ అంటారు. గురువులను ఉద్యోగులుగా పరిగణించకూడదు. వారిని నైపుణ్యదారులుగా భావించాలి. బోధన ఒక ప్రొఫెషనలిజంగా, నిపుణతతో జరగాలి. విద్యారంగంలో ఏ సంస్కరణలొచ్చినా భవనాలు నిర్మించటం, ఉపాధ్యాయుల, సిబ్బంది జీతాలు పెంచటం జరుగుతుంది కానీ టీచింగ్‌లో సంస్కరణలు జరగటం లేదు. ఏవిధంగా బోధిస్తే విద్యార్థులు నేర్చుకుంటారో అన్నది కొత్తగా ఆలోచించాలి. అది నిరంతర ప్రక్రియ. గురువుల మధ్య చర్చ జరుగుతుండాలి. అందుకే మా సీనియర్ మ్యాథ్స్ టీచర్ తెలిదేవర వెంకట్రావు నేను తరగతి గదికి రాగానే- ‘ఇవాళ ఏం చదువు చెప్పినావు’ అని స్ట్ఫారూమ్‌కు వెళ్లగానే అడిగేవారు.
‘పుస్తకంలో వున్న క్రమంలోనే బోధన చేశానని’ చెప్పాను.
‘పాఠ్యాంశం అన్నది రచయిత క్రమం కావొచ్చును. ఈ రచయిత క్రమాన్ని మాత్రమే ఎలా చెప్పావని’ తెలిదేవర ఎదురు ప్రశ్న వేశారు.
ఆయన వేసిన ఈ ప్రశ్నతో నేను కాస్త చికాకు పడేవాణ్ణి.
‘‘పుస్తకంలో ఉన్నట్టే చెబితే- నువ్వెందుకయ్యా’’ అని తెలిదేవర నాతో అనేవారు.
‘‘మరి ఎట్లా చెప్పాలో చెప్పండి. మీరు అనుభవజ్ఞులు కదా’’ అని నేను అమాయకంగా అడిగాను.
ఆయన ఈసారి కోపంగా- ‘నీ భార్యతో నువ్వెలా మాట్లాడాలో నేను చెబుతానా? సమయస్ఫూర్తిగా ఎదుటివారి మానసిక స్థితి, నేపధ్యాన్ని బట్టి బోధించాలే కానీ, తరగతి బైట వున్న నన్ను అడిగితే చెప్పగలనా?’ అని బోధనా తాత్త్వికతతో అన్నారు. అందుకే నేడు బోధనను ‘ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్’ అంటున్నారు. ఆ బోధనను తరగతి గదే నేర్పుతుంది. పిల్లలూ కొన్ని సంగతులు నేర్పుతారు. తరగతి గది సామూసిక ప్రక్రియ. బోధన ఎలా చేయాలో పిల్లల ద్వారా తరగతి గదే నేర్పుతుంది.
మొదటి వాక్యం చెప్పినప్పుడు- ఆ తెల్లమొఖాలను చూస్తే.. వారికి ఎలా బోధించాలో టీచర్‌కు అర్థమవుతుంది. బోధన చేసే గురువు దీక్ష కలిగి ఉండాలి. పిల్లలకు పాఠం అర్థమైందో లేదో టీచర్ గుర్తించలేడా? పిల్లలకు అర్థం కాకపోతే ఆ రోజు గురువు నిద్రపోతాడా? ఆ రోజంతా ఉపాధ్యాయుడు ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచించటానే్న ‘‘ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్స్’’ అంటారు. ఇది బాహ్యశక్తులతో వచ్చేది కాదు. అదే ఉపాధ్యాయులకు బోధనా శక్తిని కల్పిస్తుంది. ఉపాధ్యాయులుగా వున్న వారు రాజకీయాల గురించి, ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ‘‘ఈ పాఠం పిల్లలకు ఎలా బోధించాలో ఆలోచించ’’మని తెలిదేవర వెంకట్రావు నాకు బోధనా పాఠం చెప్పారు. ‘‘పిల్లలను ప్రేమించగలిగినప్పుడే బోధన వస్తుంది’’ అని తెలిదేవర నన్ను వెన్నుతట్టేవారు.

- చుక్కా రామయ్య