రాష్ట్రీయం

ఎపిలో 4 జిల్లాల్లో ఫైలేరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నివారణకు ప్రత్యేక ప్రణాళిక
డిసెంబర్ 14న మందుల పంపిణీ: కామినేని

హైదరాబాద్, నవంబర్ 26 : ఎపిలోని నాలుగు జిల్లాల్లో (విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, గుంటూరు) బోధకాలు (లింఫెటిక్ ఫైలేరియా) ఎక్కువగా ఉండటంతో, దీన్ని నిర్మూలించేందుకు ఒకే పర్యాయం మందు ఇచ్చేందుకు (మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో గురువారం వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ, 2015 డిసెంబర్ 14 న ఫైలేరియా బాధిత నాలుగు జిల్లాల్లో మందుల పంపిణీ ఒకే పర్యాయం చేస్తామన్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని పది జిల్లాల్లో బోధకాలు ఎక్కువగా ఉండేదని, 2004 నుండి నిర్ణీత కాలంలో ప్రజలకు మందులు ఇవ్వడం వల్ల ఆరు జిల్లాల్లో ఇది తగ్గిందన్నారు.
జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు రాష్ట్రంలో నిర్ధిష్టంగా మరో ప్రణాళికను రూపొందించామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిఇసి ట్యాబ్‌లెట్లతో పాటు అల్‌బెండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ చేస్తామన్నారు. వయస్సును అనుసరించి ఎన్ని ట్యాబ్లెట్లు ఇవ్వాలో, ఎంత డోస్ ఇవ్వాల్లో నిర్ణయించామన్నారు. అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, గ్రామీణ, పట్టణ గృహసముదాయాల్లో మందుల పంపిణీ చేసేందుకు వివిధ శాఖల సహాయం తీసుకుంటున్నామన్నారు. అధికారులతో పాటు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఈ బృహత్ ప్రణాళికలో భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చామన్నారు. మందు ఇచ్చే ముందు, మందు ఇచ్చే రోజు, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో వైద్య సిబ్బందికి, ఈ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని మంత్రి కామినేని వివరించారు.
ఈ ప్రణాళిక విజయవంతం చేసేందుకు స్టేట్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) ఏర్పాటు చేశారు. మంత్రి కామినేని శ్రీనివాస్ దీనికి చైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్-చైర్మన్‌గా ఉంటారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు/ప్రిన్సిపాల్ సెక్రటరీలు సభ్యులుగా ఉండే ఈ కమిటీకి ఫైలేరియా విభాగం అడిషనల్ డైరెక్టర్ మెంబర్ సెక్రటరీగా ఉంటారని వివరించారు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చేపట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని, కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.