దక్షిన తెలంగాణ

మనసును ప్రకృతితో సమన్వయ పరిచిన ‘తుమ్మల’! (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజు సాహితీ మినీ కవితా వినీలాకాశంలో.. అనేక ప్రక్రియలు చుక్కల్లా ప్రకాశిస్తున్నాయి. ఈ క్రమంలో హైకూలూ ఓ వెలుగు వెలుగుతున్నాయి! అందమైన భావాలను ఆవిష్కరించడానికి ఎంతో అనుకూలంగా వుండే హైకూ ప్రక్రియలో మూడు పాదాల్లో ముచ్చటైన అంశాలను ప్రస్తావించవచ్చు! మార్మికతకు తాత్వికత తోడైతే.. ఇంకేముంది? చక్కని కవిత్వాన్ని హైకూల్లో బంధించవచ్చు.. ఈ విషయానే్న నిజం చేస్తూ కవి తుమ్మల దేవరాజ్ ‘గడ్డిపూలు’ పేరుతో ఒక గ్రంథాన్ని ప్రకటించి మనసును ప్రకృతితో సమన్వయపరుస్తూ హైకూలకు జీవం పోశారు. వస్తు, స్థల, కాలాలను మేళవిస్తూ.. ప్రకృతి సంలీనతకు పెద్దపీట వేస్తూ కవి యొక్క అనుభూతులకు అక్షర రూపమిచ్చారు. ఇందలి హైకూల్లోని పదాలు నిశ్శబ్దంగా వున్నప్పటికీ.. గంభీరమైన భావాలను మోసుకొచ్చాయి! అంతేగాక.. అప్పుడే విరబూసిన సుమాలను తలపించేలా కొలువుదీరడం విశేషం! కవి యొక్క భావుకత, ప్రకృతి దర్శనం, స్వీయానుభూతి ముప్పేట అల్లుకుపోయిన ఇందలి హైకూలు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి!
‘పక్షుల కచేరికి / ముఖ్య అతిథులు
చెట్లు పిల్లగాలి’ అంటూ మొదటి హైకూలోనే కవి తన కవితాపటిమను ప్రదర్శించారు.
‘పక్షుల ప్రభాత గీతం
వెలుగును మేల్కొలుపుతు
చీకట్లను తరుముతూ’ అంటూ శుభోదయ వేళను చక్కగా ఆవిష్కరించారు.
‘మట్టి గుండెకు / పూచిన మొదటి పూవు
కవిత! అని భావించే కవి దేవరావ్.. ‘అతిథిలా వచ్చిన..వర్షానికి..వంగి నమస్కరిస్తున్న గడ్డిపూలు’ అంటూ ఈ గ్రంథంలో అందంగా ఆవిష్కరించారు.
‘పల్లె తల్లికి/పచ్చబొట్లు.. పంట పొలాలని’ ప్రకటించే కవి..ఈ గ్రంథంలో ‘నీటిపూల నవ్వులు.. వెండి ముత్యాలను కలబోసి పాఠకులను అలరింప యత్నించడం ప్రశంసనీయం!
వర్షం ధారలు.. భూమిని కప్పేయాలని తెగిపడిన జ్ఞాపకాలను అక్షరాల్లో అందంగా చిత్రించారు. ఇంకా ఇందలి హైకూల్లో.. ఎండి ఏడుస్తున్న చెట్టుకు.. పాలు పడుతున్న వానను చూడగలం! మంచు ముత్యం.. సూర్యున్ని పొట్టలో దాచేసుకున్న సుందర దృశ్యాన్ని వీక్షించగలం! జీవితమంటే.. గాయాల్ని మాన్పుకుంటూ గేయంగా మారాలన్న సంగతిని గుర్తిస్తాం.. ఇలా చిక్కని కవిత్వంతో రూపుదిద్దుకున్న హైకూలెన్నో ఉదహరించడానికి ఈ గ్రంథంలో ఉన్నాయి!
పేజీలు: 60, వెల : 45/-
ప్రతులకు:
శ్రీమతి సుజాత
గ్రామం: ఓల
మండలం: కుంటాల
జిల్లా నిర్మల్-504109
సెల్.నం.9440387566

- సాన్వి, సెల్.నం.9440525544