ఉత్తర తెలంగాణ

ఆంక్షల సంకెళ్లు తెగితేనే వచన కవిత్వానికి స్వేచ్ఛ (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విస్తృతమైన అధ్యయనమే తనలో

రచయితను మేల్కొల్పిందని సవినయంగా

ప్రకటించుకునే ప్రముఖ యువ కవి, సినీ

గేయరచయిత వౌనశ్రీ మల్లిక్ వరంగల్ జిల్లా

వర్ధన్నపేట మండల కేంద్రానికి

చెందినవారు.. తెలుగు విశ్వవిద్యాలయంలో

ఎంసిజె పూర్తి చేశారు. జీవితంలోని

అనుభవాలు ఆయనలో నిదురిస్తున్న

తాత్త్వికతను నిద్రలేపాయని చెప్పే ఆయన..

ఇంతవరకు ‘దిగంబర’, ‘గరళమ్’,

‘సమున్నత శిఖరం’, ‘తప్తస్పృహ’ వంటి

వచన కవితా సంపుటాలను వెలువరించి..

ఓ కవిగా అందరి మన్ననలు

పొందుతున్నారు. ‘కడప జిల్లా

చైతన్యమూర్తులు’, పిరమిడ్ల వ్యాస

సంపుటాలు, యంత్రాల కథలు మొదలగు

గ్రంథాలను ప్రకటించి రచయితగా

పేరొందారు. ఆయన కలం నుండి

జాలువారిన ‘దిగంబర’కు ఉత్తమ కవితా

సంపుటిగా పది పురస్కారాలను తెచ్చి

పెట్టింది. ‘గరళమ్’కు ఐదు, ‘తప్తస్పృహ’కు

మూడు అవార్డులు వచ్చాయి. వీటితో

పాటు రజనీ కుందుర్తి అత్యుత్తమ కవితా

పురస్కారం, యువ సాహితీ పురస్కారం,

రాధేయ కవితాపురస్కారంతో పాటు

ముప్పది పురస్కారాలను

అందుకున్నారు. సుమారు వందకుపైగా

గ్రంథ సమీక్షలు చేసిన అనుభవం

ఆయనకు ఉంది. రెండు వందల గ్రంథాలకు

పైగా ‘పీఠికలు’ రాశారు. ఇప్పుడు సినీగేయ

రచయితగా యాభై వరకు సినిమా పాటలు

రాశారు. ఓ వంద వరకు ప్రైవేటు గీతాలు,

సీరియళ్లకు పాటలు రాశారు. ఆంక్షల

సంకెళ్లు తెంచుకొని స్వేచ్ఛగా ఎగిరే

విహంగం వచన కవిత్వమని భావించే

యువ కవి వౌనశ్రీ మల్లిక్‌తో మెరుపు

ముచ్చటించింది. ఆ వివరాలు ఆయన

మాటల్లోనే..
ఆ రచనా వ్యాసంగాన్ని ఎన్నో ఏట

ప్రారంభించారు?
నా ఇరవై ఐదవ ఏట నుండి రాస్తున్నారు.

మొదటి కవిత ‘అమ్మా? అమెరికా డాలరా?’

కవిత ఆంధ్రప్రభ-జీవిఆర్ ఆరాధన కవితల

పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది.

అలా రాయడం పట్ల ఆసక్తి ఏర్పడింది.
ఆ రచనల పట్ల మీకు ప్రేరణ

కలిగించిందెవరు?
విస్తృతమైన అధ్యయనమే నాలో

రచయితను మేల్కొల్పింది. జీవితంలోని

అనుభవాలు లోన నిద్రిస్తున్న తాత్వికతను

నిద్రలేపాయి.
ఆ మీ దృష్టిలో వచన కవిత్వం అంటే

ఏమిటి?
ఆంక్షల సంకెళ్లు తెంచుకొని స్వేచ్ఛగా ఎగిరే

విహంగం వచన కవిత్వం ఇంకా

చెప్పాలంటే ఇదొక సంస్కారవంతమైన

తాత్వికభాష, అన్ని సాహిత్య ప్రక్రియల

కంటే వచన కవిత్వం రాయడమే చాలా

కష్టం. కృషి చేస్తే అదే సులువు.
ఆ ఇప్పుడొస్తున్న వచన కవిత్వంపై మీ

అభిప్రాయం?
వచన కవిత్వం వైపు యువత అడుగులు

వేయడం మంచి పరిణామం. కాని

వారినుండి తక్కువ శాతం ఉత్తమ శ్రేణి

కవిత్వం రావడం దురదృష్టకరం.

అధ్యయనం లేకపోవడం వల్లనే ఇలా

జరుగుతుంది. కొందరు మాత్రం వయసుకు

మించిన పరిణతితో కవిత్వం రాస్తున్నారు.
ఆ సినీ గేయ రచనవైపు మీ దృష్టి ఎలా

మళ్లింది?
మాది వరంగల్ రూరల్ జిల్లాలోని

వర్ధన్నపేట మండల కేంద్రం. అప్పట్లో మా

ఊరిలో ఒక టూరింగ్ టాకీస్ ఉండేది.

అందులో ప్రతి రోజు వేసే పాటలు,

రేడియోలో వచ్చే పాటలు నన్ను

విపరీతంగా ఆకట్టుకునేవి. అలా నాకు

వందలాది పాటలు కంఠస్థంగా వచ్చేవి.

హైదరాబాద్‌లోని తెలుగు

విశ్వవిద్యాలయంలో ఎంసిజె

చదువుతున్న రోజుల్లో సినిమాలకు

పాటలు రాయాలనే ఆలోచన కలిగింది.

మిత్రుల సహకారంతో 2010లో వచ్చిన

‘చేతిలో చెయ్యేసి’ చిత్రంలో మూడు పాటలు

రాసి సినీ గేయ రచయితగా తెరంగేట్రం

చేశాను.
ఆ మిమ్మల్ని ప్రభావితం చేసిన గ్రంథం?
‘సత్యశోధన’ గాంధి జీవిత చరిత్ర.

ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదు. ఇప్పటికీ

గాంధి గురించి ఏ చిన్న వార్త కనిపించినా

చదువుతాను. అందుకే నా ‘గరళం’

పుస్తకంపై గాంధీ ముఖచిత్రం వేశాను.
ఆ మీకు నచ్చిన కవులు, రచయితలు?
కవుల్లో సినారె, ఎన్.గోపి, కె.శివారెడ్డి,

అద్దేపల్లి, ఎస్వీ సత్యనారాయణ, ఆశీరాజు

కవిత్వం ఇష్టం. రచయితల్లో అంపశయ్య

నవీన్, మల్లాది యండమూరి రచనలు

ఇష్టం. గీత రచయితల్లో సినారె, వేటూరి,

సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ శైలిని

ఇష్టపడతాను.
ఆ ఇప్పటివరకు ఎన్ని పాటలు రాశారు?
సినిమాల్లో సుమారు 50 పాటలు రాశాను.

వందకు పైగా ప్రైవేటు గీతాలు రాశాను.

పలు సీరియళ్లకు రాస్తున్నాను.
ఆ సినీ గాయని గీతామాధురికి నంది

అవార్డు వచ్చిన మీ పాట గురించి రెండు

మాటలు చెబుతారా?
ఒక యువతి ప్రేమలో పడినపుడు ఆమెలో

కలిగే లలితమైన అనుభూతులను

గేయంగా మలచమని దర్శకుడు మురళీ

గంధర్వ కోరారు. నేను రాసిన పాటను

ఒక్క మార్పు లేకుండా రికార్డు చేశారు.

సంగీత దర్శకుడు రవికల్యాణ్ ఈ పాటను

చక్కగా స్వరపరిచారు. రమణ తోట

ఫోటోగ్రఫి అద్భుతంగా ఉంటుంది.

ఎప్పటిలాగే గీతామాధురి చాలా బాగా

పాడారు!
ఆ కోయిలమ్మ సీరియల్లో చాలా పాటలు

రాశారు కదా..
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు

ఏమన్నారు?
నిజానికి నాకిది మంచి గుర్తింపునిచ్చిన

సీరియల్. చాలా సినిమాలకు రాసినా రాని

పేరు, కోయిలమ్మ పాటల రచయితగా

వచ్చింది. దర్శకేంద్రులు కె.రాఘవేంద్రరావు

కొన్ని పాటలను పరిశీలించి నన్ను

మెచ్చుకున్న సందర్భాలున్నాయి.

ఆయన ప్రశంసను ఎప్పుడు మరిచిపోను!

కోయిలమ్మ సీరియల్లో ఇప్పటివరకు 70

పాటలు రాశాను. సంగీతదర్శకుడు సాయి

మధుకర్ ప్రోత్సాహం ఎంతో ఉంది. నేను

కె.రాఘవేంద్ర రావు దగ్గరికెళ్లడానికి కారణం

మేనేజర్ యాదాగౌడ్.
ఆ ప్రస్తుతం మీరు రాస్తున్న సినిమా

పాటల గురించి తెలియజేస్తారా?
శివనాగు దర్శకత్వంలో వస్తున్న

జయమాలిని, శివనాగేశ్వర రావు

దర్శకత్వంలో వస్తున్న ‘ఓవర్ యాక్షన్’,

నంది నరసింహారెడ్డి దర్శకత్వంలో వస్తున్న

‘ఉత్పలమాల ఉత్తరం రాసింది’,

ఎం.ఎస్.క్రియేషన్స్ బ్యానర్‌లో వస్తున్న

సినిమా, విజయ్ కూరాకుల సంగీత

దర్శకత్వంలో వస్తున్న 3 సినిమాలు

ప్రద్యోతన్ సంగీత దర్శకత్వంలో వస్తున్న

సినిమా... ఇలా మరో పది సినిమాలకు

పాటలు రాస్తున్నాను.
ఆ తెలంగాణ ఉద్యమకాలంలో కవిగా మీ

పాత్ర ఏమిటి?
ఉద్యమంలో నేను క్రియాశీలకంగా

పాల్గొన్నాను. కవిగా నా కర్తవ్యాన్ని

నిర్వర్తించాను. అనేక ఉద్యమ కవితలు

రాశాను. పలు సంకలనాల్లో వాటికి స్థానం

దక్కింది. గీత రచయితగా.. శ్రీకాంతాచారి

మరణించినపుడు ‘అమరుడవై పోయావా

తెలంగాణ వీరుడా’ అనే గీతాన్ని రాశాను.

అలాగే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత

‘పాడెద నేను తెలంగాణ గీతం’ పేరుతో పది

నిమిషాల నిడివిగల గీతాన్ని రచించాను.
ఆ మరుగునపడ్డ తెలంగాణ సాహిత్యాన్ని

వెలుగులోకి తీసుకురావాలంటే...?
ఇప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ

నెలకొల్పబడింది. అధ్యక్షుడు డాక్టర్ నందిని

సిధారెడ్డి సాహితీవేత్త మాత్రమే కాదు.

ఇక్కడి జీవభాషను ప్రేమించే మనిషి

కూడా. ఈ విషయమై ఏం చేయాలో

తెలిసిన దార్శనికుడు. ముఖ్యంగా

మరుగునపడ్డ సాహిత్యం వెలుగులోకి

రావాలంటే పరిశోధకులను ప్రోత్సహించాలి.
ఆ కొత్త కవులకు మీరిచ్చే సందేశం

ఏమిటి?
ఎవరు ఏ రంగంలోనైనా అద్భుతాలు

చేయవచ్చు. కాని సాధన లేకుండా,

కష్టపడకుండా పేరు రావాలనుకోవడం

మంచిది కాదు. అలా వచ్చిన పేరు కూడా

నిలవదు. కవిత్వంలో రాణించాలంటే ఆ

రంగంలో ముందు తరం చేసిన కృషిని

పరిశోధించాలి.
వౌనశ్రీ మల్లిక్
18-1-101/3/4
ఉప్పుగూడ జెండా
హైదరాబాద్-500053
సెల్.నం.9394881004

- దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544