ఉత్తర తెలంగాణ

స్వేచ్ఛా వాయువుల కోసం.. (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకచ్ఛత్రాధిపత్యం
ప్రపంచ పోలీసు పాత్ర
క్రమక్రమంగా సడలి
బిగుసుకపోయే
రోజులు దాపురిస్తున్నవి
కనుచూపు మేరలో..
ప్రపంచం మా కనుసన్నల్లో ఉంది
మేం చెప్పిందే వేదం
చేసిందే శాసనం ఇంకా
వాదోపవాదాలకు లేదు తావు అని
దబాయించే రోజులు
జరిగిపోయే కాలం కూడా
మనం చరిత్రలో చూస్తాం
అదెంతో దూరంలో లేదు మరి..
భూ మండలం మీద
ఏదో ఒక మూల
ఏదో ఒక హింస నిత్యకృత్యమై
మానవాళి ఆత్మని నెడుతున్నాయి
సంక్షోభ వలయాల్లోకి..
వేన వేల ఏండ్లుగా
తత్వవేత్తలు శోధించి సాధించిన
మానవ ప్రగతి ఫలాలు
అందరికీ అందడం లేదు
పైగా ఒక మనిషిని మరో మనిషిని
దోచుకునే సంస్కృతి పెచ్చరిల్లుతోంది..
ఏ రకమైన వివక్షనైనా
మానసిక హింసనైనా
సభ్య ప్రపంచంలో కొనసాగనిస్తే
సమాజాన్ని గాయపరుస్తున్నట్టే
రాగ ద్వేషాలు కొన్ని వేళల్లో
మానవ సహజమైనప్పటికీ
వాటిని అదుపు చేయాలి చట్టాల పగ్గాల్తో!
అపుడే అందమైన ఆరోగ్యకరమైన
సమాజానికి ఆహ్వానం పలికినట్టు!
మానవ నవ సమాజం
ఆనందోత్సాహాల్లో
స్వేచ్ఛా వాయువులు తనివితీరా
పీల్చేది ఆ మధుర క్షణాల్లోనే!!
- డాక్టర్ దామెర రాములు
నిర్మల్
సెల్.నం.9866422494

నిశ్శబ్ద కొలిమి

ఆమె మనసులో
చిగురించిన చిరుకోరికలు
పురుడుపోసుకున్న స్వప్నాలు
ఊసులాడిన ఆశల ఊయలలు
ప్రభవించిన విన్నూత్న ఆశయాలు
ఉదయించిన తొలిప్రేమ నిట్టూర్పులు
ఇంకా సజీవ ఆకృతి దాల్చకముందే
కాస్త స్వేచ్ఛగా రెక్కలార్చకముందే..
పరిస్థితుల వడగాల్పులకు తట్టుకోలేక
కుటుంబ శ్రేయస్సు కొరకు..
తనవారి అభీష్టం మేరకు
క్రమక్రమంగా దగ్ధమై..
కాలక్రమంలో ఆవిరై..
ఆమె మదిని
ఒక నిశ్శబ్ద కొలిమిగా మార్చేసాయి
దరి చేరలేని ఉష్ణాన్ని ప్రసరించాయి
- గంజాం భ్రమరాంబ
సెల్.నం.9949932918

అనుసంధానం

నేలను స్నానం చేయించె
వాన చినుకును
ఆపక సముద్రానికి జారవిడిస్తే
నీటి లోటు పోటు
గురిపెట్టక మానదు!
తన్నుకొచ్చె దుఃఖాన్నణచుకుంటే
గుండె చెరువై
స్వారీ చేయక మానదు!
అనుకూలించని దుష్ప్రభావాలను
చాకచక్యంతో తరిమేస్తేనే అవి
తోక ముడిచి పలాయనం
చిత్తగించేది!
చంద్రకాంతిని స్వాగతిస్తూ
అస్వాదిస్తేనే
చల్లదనం మంటలనార్పి ఓదార్చి
ప్రశాంతతను చేరదీసేది!
సృజనాత్మకత ఆవరించి
మెరుపులతో ఎగిసిపడుతుంటేనే
మనోల్లాసాల ఆవిష్కరణలకు
తావేర్పడి లోకానికి చాటి చెప్పేది!
వస్తువుకు శిల్పానికి కల్యాణ
మధురానుబంధం కుదిరి పెనవేస్తేనే
సాహిత్య శుభ పరిణామంతో
పాఠకులు ఆహ్లాదంగా తేలియాడేది!
- తోట సదానందం
మంచిర్యాల
సెల్.నం.9908594669

లుప్త గంధాలు

సానురాగపు పలకరింపుల
సదనమున కేతెంచి పలికిన
మనసు నింపే కుశలవచనం
వినగరాదేమి?
దారిలో కనబడిన వేళల
ఆగిపోవుచు దరికి జేరుచు
హితము తోడుగ ముచ్చటించే
వేళరాదేమి?
గృహముకేగుచు అతిథివోలిక
సాంత్వనమ్ముల పలుకు వేళలు
ఏటికొకసారైనగానీ
ఎదురుకాలేమి?
నేస్తములనే మరచిపోవుచు
గత మధురిమలను పాతిపెట్టుచు
ఆగమాగపు జీవనాలకు
అలుపురాదేమి?
కష్టసుఖముల ఇష్ట్ఫలముల
కలిసి పంచుకు తినుట మరచుచు
ఒంటరిగ జీవించు మనిషకి
విసుగు రాదేమి?
సుప్తమైపోయేనా బంధం?
లుప్తమైపోయెనా గంధం?
నాటి వేళలు మరలరావా?
నేటి రోజులలో?
- డా. అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి
సెల్.నం.9440468557

వృద్ధాశ్రమాలు!

దాతల ఉదారం ప్రభుత్వ అండతో
ఊరూరికి వృద్ధాశ్రమాలు
పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి
లక్షణంగా బంధువులున్నా లక్షలు

వెచ్చించి
పెట్టే బెడా సర్ది ఆశ్రమాల్లో దింపేస్తున్నారు
పుట్టినవాళ్లు-పెద్దలకు పెట్టనివాళ్లు
ఈ నా భారతీయ సంస్కృతిలో
నీతులు వల్లించే పెద్దలూ, నాయకులూ
వయసు మల్లిన వారి అగచాట్లు ఆపలేరా?
మానవ సంబంధాలు మంటగలిసి
అన్నీ ఉండి అందరూ ఉండి
కాటికి వెళ్లే వాళ్లంతా కూటికోసం
వృద్ధాశ్రమాల్లోకి వరసకడుతున్నారు
కన్నవాళ్లే కట్టడి చేసి
ఆశ్రమాలకు అన్నంత రొక్కం పోసి
పీడ ఒదిలిందని చేతులు
దులుపుకుంటున్నారు
ప్రభుత్వాలెన్నొచ్చినా వీళ్ల గురించి
ఆలోచించి న్యాయం చేసేదెందరు?
ఒక్క క్షణం ఆలోచించండి!
మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారు
ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్నారు
ఈ దారుణ ఆశ్రమాల గోల ఇకనైనా ఆపండి
కన్నవాళ్లకే బాధ్యతల్నిచ్చి
ఆలనా పాలనకు బాధ్యుల్ని చేయండి
- బోనగిరి రాజారెడ్డి
మంచిర్యాల
సెల్.నం.9701381944

త్యాగం!

పరిమళం అందించే పుష్పం
పరిమళాన్ని ఆస్వాదించునా?
అన్నం వార్చే కడవ
ఆకలి ఎరుగునా?
సవ్వడితో తాళం వేసే మువ్వ
నాట్యం నాదంటుందా?
మంచు బిందువులను
సేకరించే గాలులు
చలికి వణికి చతికిలపడునా?
ఉప్పొంగే సముద్రపు కెరటాలు
దరి దారిని కాజేయునా?
ఎండల్లో నీడనిచ్చే వృక్షం
సూర్యుని తాపం నాకేల అనునా?
జీవం పోసి జన్మనిచ్చే తల్లి
జన్మ రహస్య మెరిగి జడిసి..
జాగు చేయునా?
కన్నీటి వేదనల్లో శుభ్రపడే కళ్లు
ఆవేదనలు ఘడియలకు..
కోరబోవునా?
మూలానికి మూల్యం త్యాగం!
- దాస్యం మాధవి
హైదరాబాద్
సెల్.నం.7396396773

నీ ఆరాధనలో..

వేదనా సంద్రం ఉప్పొంగిన వేళ
వెతుకుతున్నవి నీ కోసం
నా వేయికళ్లు
నీ ఆరాధనలో,
సాహితీ సమారాధనలో
నిత్య సాధకునిలా విడవకుండా
నీ నామ జపం చేస్తు
అక్షరాలు పోగేద్దామని యత్నిస్తుంటే
కనులు తెరిస్తే నవ్వుతున్న పూవులా
కనులు మూస్తే చీకటిలో
వెలిగిపోతున్న తారలా
కనిపిస్తూ కవ్విస్తూ
కమనీయ కళల రూపాకృతితో
నిలుచున్న ‘కవితా’
వలపుతో నాపై వర్ధిల్లు!
కలకాలము,
చిరకాలముండాలె మన చెలిమి
- కూర్మాచలం వెంకటేశ్వర్లు
కరీంనగర్
సెల్.నం.7702261031