రాజమండ్రి

స్వేచ్ఛా వాయువుల కోసం.. (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకచ్ఛత్రాధిపత్యం
ప్రపంచ పోలీసు పాత్ర
క్రమక్రమంగా సడలి
బిగుసుకపోయే
రోజులు దాపురిస్తున్నవి
కనుచూపు మేరలో..
ప్రపంచం మా కనుసన్నల్లో ఉంది
మేం చెప్పిందే వేదం
చేసిందే శాసనం ఇంకా
వాదోపవాదాలకు లేదు తావు అని
దబాయించే రోజులు
జరిగిపోయే కాలం కూడా
మనం చరిత్రలో చూస్తాం
అదెంతో దూరంలో లేదు మరి..
భూ మండలం మీద
ఏదో ఒక మూల
ఏదో ఒక హింస నిత్యకృత్యమై
మానవాళి ఆత్మని నెడుతున్నాయి
సంక్షోభ వలయాల్లోకి..
వేన వేల ఏండ్లుగా
తత్వవేత్తలు శోధించి సాధించిన
మానవ ప్రగతి ఫలాలు
అందరికీ అందడం లేదు
పైగా ఒక మనిషిని మరో మనిషిని
దోచుకునే సంస్కృతి పెచ్చరిల్లుతోంది..
ఏ రకమైన వివక్షనైనా
మానసిక హింసనైనా
సభ్య ప్రపంచంలో కొనసాగనిస్తే
సమాజాన్ని గాయపరుస్తున్నట్టే
రాగ ద్వేషాలు కొన్ని వేళల్లో
మానవ సహజమైనప్పటికీ
వాటిని అదుపు చేయాలి
చట్టాల పగ్గాల్తో!
అపుడే అందమైన ఆరోగ్యకరమైన
సమాజానికి ఆహ్వానం పలికినట్టు!
మానవ నవ సమాజం
ఆనందోత్సాహాల్లో
స్వేచ్ఛా వాయువులు తనివితీరా
పీల్చేది ఆ మధుర క్షణాల్లోనే!!
- డాక్టర్ దామెర రాములు
సెల్.నం.9866422494

నేటి బంధాలు
రక్త సంబంధాలు భారంగానూ
బాధగానూ పరిణమించాయి నేడు
అల్లుకున్న స్నేహాలే
మమతానురాగాలయ్యాయి ఈనాడు..

ఎటు చూసినా యే దారికేగినా
కరెన్సీతోనే ముడి ధనవంతుడైతేనే సరి
ఆడపడుచులు - అత్త - కోడళ్ల బంధాలు
వేధింపులు - రోదనలతో సాగుతున్నాయి

స్థాయికొచ్చి గత స్థాయి మరచి
వేర్పాటువాదులకంటే
తీవ్రంగా సల్పే పోరులో
అనుబంధాల హోరు బేజారుతున్నాయి

కుటుంబ నేపధ్యం
రాను రాను నైతికతను కోల్పోతుంటే
పురిటిబిడ్డ సైతం
స్వార్థాన్ని కౌగలించుకుంటోంది

అనైతికంగా ఎదిగిన
వారసుల తీరుతో
ముదుసళ్లకు ఇంటిలో చోటులేదిక
నేటి ఈ దుస్థితికి వారు చూపిన దారే కదా!

పేట్రేగే అరాచకాల నడుమ
ఎదుగుతున్న నేర సామ్రాజ్య
పునాదుల నెలవు ఇవికావూ..
ప్రాయశ్చిత్తం లేని మనుషుల మధ్య
రాజీలేని బతకులతో
సమాజం తల్లడిల్లుతోంది ఈనాడు..
- దాస్ ఇంజేటి, 90002 66106

వృద్ధాశ్రమాలు!

దాతల ఉదారం ప్రభుత్వ అండతో
ఊరూరికి వృద్ధాశ్రమాలు
పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి
లక్షణంగా బంధువులున్నా లక్షలు వెచ్చించి
పెట్టే బెడా సర్ది ఆశ్రమాల్లో దింపేస్తున్నారు
పుట్టినవాళ్లు-పెద్దలకు పెట్టనివాళ్లు
ఈ నా భారతీయ సంస్కృతిలో
నీతులు వల్లించే పెద్దలూ, నాయకులూ
వయసు మళ్లిన వారి అగచాట్లు ఆపలేరా?
మానవ సంబంధాలు మంటగలిసి
అన్నీ ఉండి అందరూ ఉండి
కాటికి వెళ్లే వాళ్లంతా కూటికోసం
వృద్ధాశ్రమాల్లోకి వరసకడుతున్నారు
కన్నవాళ్లే కట్టడి చేసి
ఆశ్రమాలకు అన్నంత రొక్కం పోసి
పీడ ఒదిలిందని చేతులు
దులుపుకుంటున్నారు
ప్రభుత్వాలెన్నొచ్చినా వీళ్ల గురించి
ఆలోచించి న్యాయం చేసేదెందరు?
ఒక్క క్షణం ఆలోచించండి!
మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారు
ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్నారు
ఈ దారుణ ఆశ్రమాల గోల ఇకనైనా ఆపండి
కన్నవాళ్లకే బాధ్యతల్నిచ్చి
ఆలనా పాలనకు బాధ్యుల్ని చేయండి
- బోనగిరి రాజారెడ్డి
సెల్.నం.9701381944

జాగ్రత్త జాగ్రత్త
భూమి తల్లి మనల్ని పాలించడానికి
పగలు రాత్రి తిరుగుతూనే ఉంది
అన్నిటికీ ఆధారం తనే
అయినా తనను తాను తగ్గించుకుని
మూడువాటాలు సముద్రుడికే ఇచ్చేసింది
ఎంతైనా సహనమూర్తి కదా
ఎంతైనా ఇచ్చేయగల ఆ తల్లి
మనకి ఇవ్వనిదేది
మనవాళ్లు అది చేసాం ఇది చేసాం అంటూ
గోతులు, రాళ్లు, స్తంభాలు, సొరంగాలు
గనులు అవీ ఇవీ ఎన్ని తవ్వినా
భూమి తను తిరుగుతూనే ఉంది
మనం తిని తిరుగాడాలి కదా
ఎంత పెట్టినా ఏం చేసినా తనేమీ ఆశించదు
మన పురోభివృద్ధి తప్ప
తన ప్రతి ఖండానికి
స్వభావాన్ని మార్చుకుంటూ
పంటల్లో, పక్షుల్లో, జంతువుల్లో
వైవిధ్యాన్ని, సమతౌల్యంగా
సాగింపజేస్తోంది
జీవ వైవిధ్యానికి విపరీతార్థం
తీసుకున్న పుత్రరత్నాలు
జాతి భిన్నత్వం, శత్రుత్వం,
కలహ కుతూహల తత్వాలతో
భూమాత ఊపిరిని బంధిస్తున్నారు
తన నుండే ఉద్బవించిన
ప్రాణవాయువుని
దాని దయతో బతుకుతున్న నరుడు
భూమాత నుండి వేరు చేయడమా!
పచ్చని లోగిళ్లలో పుట్టి పెరిగిన
ప్రాణ వాయు గొంతును నులిమితే
పచ్చదనం పొగచూరి విషవలయమై
మానవ జాతినే కబళించేయగలదు
- చావలి శేషాద్రి సోమయాజులు,
విజయనగరం జిల్లా.