విజయవాడ

ఖనిజాలు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి
ఎప్పుడూ బలవంతుడే
మనసు
ఆధీనంలో ఉన్నప్పుడే

పర్వతం ఎత్తు చూసి
జంకితే కిందనే
సాహసించి అడుగు వేస్తే
శిఖరాగ్రం మీదనే

ఆత్మజ్ఞానం పెరిగితే
మాలిన్యం తొలగుతుంది
ఆవేశం అణిగితే
కాఠిన్యం కరుగుతుంది

ఆకాశంలో
నక్షత్రాలను లెక్కపెట్టలేం
సముద్రంలో కెరటాలను
ఒడిసి పట్టలేం

వెదురుబొంగుకు కూడా
ఒక రోజొస్తుంది
జెండా కర్రగ మారి
జేజేలందుకుంటుంది

మంచు కరిగితే
నీరు
మనసు కరిగితే
కన్నీరు

నీటిలో
పడవుంటే ప్రయాణం
పడవలో
నీరుంటే ప్రమాదం

యువతరం
గుమ్మానికి తోరణాలు కావాలి
మానవతకు
మహోత్సవం తేవాలి

జీవితం
కరిగిపోయే మంచు
ఉన్నంతలో
నలుగురికీ పంచు

మెడకు చుట్టుకున్న
అనకొండలా కులం
విసిరివేయాలంటే
చాలటం లేదు నా బలం
- పివి రమణకుమార్,
చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 9494495062

కోరేది వరమా..
శాపమా?
సంతానం కోసం తపం
తపం ఫలిస్తే కొంగజపం
గర్భానికి లింగ నిర్ధారణ పరీక్షలు
పరీక్షా ఫలితాల కోసం ప్రతీక్షణలు
ఫలితం మగబిడ్డయితే సంతోషాలు
ఆడబిడ్డయితే సంతాపాలు!
మరోబిడ్డ కోసం ఎదురుచూపులు
అత్త కోరిక వారసుడు
మామ కోరిక మనవడు
తండ్రి కోరిక తనయుడు
తల్లి కోరిక కుమారుడు
ప్రాణికి ప్రాణం పోయగలిగే
చిట్టితల్లిని కోరేదెవరు?
మాతృ గర్భాన జనియించి
మాతృ గర్భాన్ని శోధించి
ఆడ శిశువుల్ని అంతమొందించి
సాధించాలని చూస్తున్నారు
పురుషాధిక్యతని!
పుత్రోత్సాహమే గాని
పుత్రికోత్సాహం వద్దని
స్ర్తిమూర్తి రూపం
ఆడపిల్ల అని తెలిసీ
కడుపులోనే కర్కశంగా
భూమీదికి రానీయకుండా
అంతమొందించాలని చూస్తున్నారు
ఎంత దారుణం
మానవ మనుగడకేదీ
భవితవ్యం?
- తిరుమలశెట్టి లక్ష్మీకాంతం,
విజయవాడ.
చరవాణి : 8790601353

వర్షోల్లాసం ..
మిణుగురుల వెలుతురుతో
మనసంతా నిండినట్లు..
తల్లి పాల ధార చిమ్మి
బిడ్డ మొహం తడిచినట్లు..
ఇంద్రధనస్సు కింది సగం
కనుల ముందు మెరిసినట్లు..
నా మోమున నవ్వు చూసి
అతని మొహం వెలిగినట్లు..
ఆ వెనె్నల వెలుగంతా
నాపైనే ఒలికినట్లు
ఈ వర్షం..
నాలో రేపెను
హర్షం!
- గుడిపూడి రాధికారాణి, మచిలీపట్నం. చరవాణి: 9494942583