విశాఖపట్నం

పర్యావరణ స్పృహను కలిగించే చిట్టి నవల బెలగాం భీమేశ్వరరావు వృక్షపురాణం (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల సాహిత్యంలో కథదే అగ్రతాంబూలం. ఆసక్తి, కుతూహలం కలిగించేవి కొన్ని, యుక్తి, తీర్పులను పుణికి పుచ్చుకున్నవి కొన్ని. హాస్య రసస్పోరకాలు కొన్ని. అద్భుత రస ప్రతిపాదితాలు కొన్ని. విజ్ఞాన శాస్త్ర విషయాలను నేరుగా కథాలోకంలో, చిన్నారుల హృదయ లోగిలలో మసలుతున్న వారిలో బెలగాం భీమేశ్వరరావు ఒకరు.
పర్యావరణ అసమతౌల్యతను, వృక్షాల ప్రాధాన్యతను తెలియజెప్పే వృక్ష పురాణం. మురళి అనే విద్యార్థి మరో లెక ప్రయాణంతో ముడిపెట్టి ఫిక్షన్ పద్ధతిని ఈ చిన్న నవలలో ఆవిష్కరించారు భీమేశ్వరరావు. గతంలో చెట్లొస్తున్నాయి జాగ్రత్త నవల రాసిన ఈ బాల సాహివేత్త భాష, విషయం రెంటినీ నల్లేరుపై నడకలా కొనసాగించి మంచి నవలగా చిత్రీకరించారు. శ్రీవాణి పలుకులో ముద్రితమైన ఈ ధారావాహికకు బి ఎస్ రాజు వేసిన చిత్రాలు వనె్న తెచ్చాయి. చెట్లు తిరుగుబాటు చేస్త ఎలా ఉంటుంది? అవి మనుషులను లొంగదీసుకుంటే పరిస్థితులెలా ఉంటాయి, మరో లోకంలో చెట్లకున్న ప్రత్యేకత ఏమిటి, ఆ లోకానికి తీసుకుపోయిందెవరు వంటి అంశాలతో నవల ఆసక్తికరంగా సాగుతుంది. ఆనందంతో పిల్లలు చదవగల శైలిని సాధించిన భీమేశ్వరరావు ఈ నవలకు వృక్ష పురాణం అని పెట్టడం సముచితం. పురాణాలు మిత్ర సమ్మతాలని సాహితీ సిద్ధాంతాలు చెబుతున్నాయి. వృక్షాలు మనిషికి నిజమైన మిత్రులు, ఆప్తులు, ఇంకా చెప్పాలంటే మరో మాతృమూర్తి పాత్రను పోషించగల శక్తి గలవి.
హరిత గ్రహ వింతలతో సాంతం నడిచే ఈ నవల పిల్లలకు గ్రంథాలయ పఠన గ్రంథంగా, ఉండదగ్గ పుస్తకం. గతంలో వీరు రాసిన వజ్రాల గుహ, స్వతంత్ర భారతం, పనసపళ్లు, చుక్‌చుక్ రైలు, తీనె చిను, కొంగల తెలివి వంటి సంపుటాలు మిక్కిలి ఆదరణ పొందాయి. పలు అవార్డులను తెచ్చి పెట్టాయి.
ఉపాధ్యాయ వృత్తి నుండి విరమణ పొందినప్పటికీ కథా వ్రతాన్ని అనునిత్యం చేపడుతున్న భీమేశ్వరరావు ధన్యులు. వారి రచనలు పిల్లల మనోరథాన్ని మంచి మార్గానికి నడిపించగలవు.

- కిలపర్తి దాలినాయుడు, సెల్ : 9491763261.