విశాఖపట్నం

అక్షరాలు ఏకమై నడుస్తున్నాయి (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పడగ విప్పి బుసలు కొడుతున్న స్వార్ధం సాక్షిగా
అవినీతిలో అన్యాయం జత కట్టి ఆడుకుంటోంది
మండే సూర్యుడికి ముసుగు వేస్తూనే
విపరీత ధోరణులను ప్రశ్నిస్తున్నామంటున్నారు
ఎవరి చావులు మరెవరికో ఊతకర్రలుగా చేసుకుని
వీధి నాటకాల్లో జీవిస్తున్నారు
ముత్తాతల ముత్తాతలకి ముందు మునుపెన్నడో
రాసిన మనుశాస్త్రాన్ని తగులబెట్టి
రచ్చ చేయడం వల్ల నేడు ఏమిటి ప్రయోజనం?
కాస్త అటు చూడు కళ్లు తెరచి ఓసారి
కులకాకుల గోలలో వినపడకుండా పోతున్న
మరణ మృదంగాలు ఆలానే ఉన్నాయి
అస్తిత్వాల దండలు ధరించి
ఒకరితో ఒకరు పోటీ పడి కుల మత విద్వేషాలను
రెచ్చగొట్టే మేకవనె్న పులులు నీ పక్కనే ఉండి
నీ వారినే నేడు బలి చేస్తున్నారు
పనికి మాలిన పెద్దరికపు కండువా వేసుకుని
శాంతిని వెదజల్లే భారతావనిని స్మశాన వాటికగా మారుస్తూ
విద్యార్థుల బంగారు భవిష్యత్తు పాడు చేయటం
వారికో వినోదంగా ఉంది కదా
పండు వెనె్నలలో వీచే చల్లని గాలులను వడగాడ్పులుగా మార్చి
అమానవీయ కిరణాలు ప్రసరించేలా చేస్తూ ఉంటే
ఎన్నాళ్లు సహిస్తూ కూర్చుంటావు
ఒదగడం నేర్చిన నీకు విజృంభించడం ఓ లెక్క అనుకోకు
మోడు వారిన చెట్లనే చిగురించేలా చేసే అక్షరాలు
నేడు ఏకమై నీ వెనక అడుగులు వేస్తున్నాయి
మనసుల మధ్య ఏర్పడిన లోయలపై వంతెనలను
పట్టుదలతో నిర్మించాలన్న పెద్ద లక్ష్యంతో
అసమ్మతో సమ్మతో ఇంకా సందేహ డోలలో ఊగడం భావ్యం కాదు
నేను సైతం అని అడుగు ముందుకు వేయకపోతే
ఏదో ఒకనాడు మూల్యం చెల్లించక తప్పదు
ముళ్లబాటలో రాలిపోతున్న ప్రేమ కుసుమాలకు
ఊపిరి పోసి ఆసరాగా నిలుద్దాం
- సి.హెచ్.వి. లక్ష్మి,
శ్రీకాకుళం. సెల్ : 9493435649.

అక్షరం
బడిసెల, ఎగిసే అల, విసిరే వల
ఉరికే జలపాతం, ఉరిమే విద్యుత్ ఘాతం
మండే అగ్నిపర్వతం, మరలని పాశుపతం
విప్లవానికి బాట, అరాచకాలకు బీట,
అమాయకత్వానికి మాట, ఆనందానికి కోట
జీవన గమన వికాస సూత్రం, చింత నిర్మూలన మంత్రం
పౌరుల్ని రామ సోదరుల్లా కలుపుతుంది, నిలుపుతుంది
అక్షరం కవి దివ్యాత్మ, జనచైతన్య సృష్టికే బ్రహ్మ
దైవానికి దశ అవతారాలే అక్షరాని కెన్నో
మిత్రమా అక్షరం జీవన సర్వస్వం
- డాక్టర్ పి.వి. ఎన్. సుబ్బారావు,
లంక వీధి, విజయనగరం-535002. సెల్ : 9441058797.

జాగ్రత్త జాగ్రత్త
భూమి తల్లి మనల్ని పాలించడానికి
పగలు రాత్రి తిరుగుతూనే ఉంది
అన్నిటికీ ఆధారం తనే
అయినా తనను తాను తగ్గించుకుని
మూడువాటాలు సముద్రుడికే ఇచ్చేసింది
ఎంతైనా సహనమూర్తి కదా
ఎంతైనా ఇచ్చేయగల ఆ తల్లి
మనకి ఇవ్వనిదేది
మనవాళ్లు అది చేసాం ఇది చేసాం అంటూ
గోతులు, రాళ్లు, స్తంభాలు, సొరంగాలు
గనులు అవీ ఇవీ ఎన్ని తవ్వినా
భూమి తను తిరుగుతూనే ఉంది
మనం తిని తిరుగాడాలి కదా
ఎంత పెట్టినా ఏం చేసినా తనేమీ ఆశించదు
మన పురోభివృద్ధి తప్ప
తన ప్రతి ఖండానికి
స్వభావాన్ని మార్చుకుంటూ
పంటల్లో, పక్షుల్లో, జంతువుల్లో
వైవిధ్యాన్ని, సమతౌల్యంగా
సాగింపజేస్తోంది
జీవ వైవిధ్యానికి విపరీతార్థం
తీసుకున్న పుత్రరత్నాలు
జాతి భిన్నత్వం, శత్రుత్వం,
కలహ కుతూహల తత్వాలతో
భూమాత ఊపిరిని బంధిస్తున్నారు
తన నుండే ఉద్బవించిన
ప్రాణవాయువుని
దాని దయతో బతుకుతున్న నరుడు
భూమాత నుండి వేరు చేయడమా!
పచ్చని లోగిళ్లలో పుట్టి పెరిగిన
ప్రాణ వాయు గొంతును నులిమితే
పచ్చదనం పొగచూరి విషవలయమై
మానవ జాతినే కబళించేయగలదు
- చావలి శేషాద్రి సోమయాజులు,
విజయనగరం జిల్లా.

పరిష్కారం
జీవితం ఒక సమస్య కాదు
మిమ్మల్ని మీరు గౌరవించుకోండి
మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి
భయం ఇంకొంత భయాన్ని సృష్టిస్తుంది
భయం వదిలి భవిష్యత్తు కోసం ఆలోచించండి
మనుష్యుల మనస్తత్వాన్ని తెలుసుకోండి
చావు సమస్యకు పరిష్కారం కాదు
చావు పిరికివాళ్ల ప్రథమ లక్షణం
సమస్య ఎక్కడ పుట్టిందో ఆలోచించండి
వందేళ్ల బతుకు ఒక్క క్షణంలో బూడిదపాలు చేసుకోవద్దు
ఏ సమస్యా పరిష్కరించుకోలేనంత క్లిష్టమైనది కాదు
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది
ప్రతి ఓటమి విజయానికి తొలిమెట్టు అవుతుంది
ప్రతి మనిషి తోటి మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి
అప్పుడే ప్రేమను ప్రేమ ప్రేమిస్తుంది
కారణం ఏదైనా నిరాశతో కుంగిపోకుండా
జీవితంపై మమకారం పెంచుకోండి
- వేగి నూకరాజు, బుచ్చిరాజుపాలెం,
విశాఖపట్నం-530027. సెల్ : 7702141014.