రివ్యూ

గురితప్పిన దేవ‘గన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * బాద్‌షాహో
తారాగణం: అజయ్ దేవగన్,
ఇమ్రాన్ హష్మి, ఇలియానా డిసౌజా, ప్రియాన్షు ఛటర్జీ,
ఈషా గుప్తా, సంజయ్ మిశ్రా తదితరులు
రచన: రజత్ అరోరా
నిర్మాతలు: మిలన్ - భూషణ్ - కిషన్
దర్శకత్వం: మిలన్ లుథెరియా
1975 -ఎమర్జెన్సీ.. 96 గంటలు -600 కి.మీ. -ఒక ఆర్మ్‌డ్ ట్రక్ -బంగారు నిధి.. జైపూర్ నుంచీ ఢిల్లీ ప్రయాణం.. ఈ మాటల్ని చూస్తే చాలు.. కథ మొత్తం అర్థమై ఒక ఫ్రేమ్ ఫిక్సై పోతుంది. ఓవైపు ఉత్కంఠత -మరోవైపు వొళ్లు గగుర్పొడిచే సాహసోపేత పోరాటాలూ.. ఛేజింగ్ సీక్వెన్స్‌లూ.. అదరగొట్టే ఫైట్స్- రొమాన్స్.. ఇలా. కానీ ప్రేక్షకుల ఆలోచనలకు తరచూ ‘బ్రేక్’ వేయటమే ప్రధానోద్దేశంగా కనిపిస్తుంది. ఆ ఊహలకూ ఆలోచనలకూ వ్యతిరేక దిశలో కథనం నడుస్తూ ఇబ్బంది పెడుతుంది. వెరసి అంతా గజిబిజి గందరగోళంగా.. ఏం చూస్తున్నామో ఎందుకు చూస్తున్నామో.. ఏ ప్రయోజనం ఆశించామో అర్థంకాని స్థితిలో పడిపోవటానికి సిద్ధమైనట్టయితే ‘బాద్‌షాహో’ అనొచ్చు. లేదా ‘ఓహో’ అనే ఛాన్స్ కూడా ఇవ్వరు.
కథలోకి వెళ్లే ముందు దర్శకుడి గురించి మాట్లాడుకొందాం. 1999లో రిలీజైన ‘కచ్చే దాగే’ మొదలుకొని ‘ది డర్టీ పిక్చర్’ ‘వన్స్ ఆపానె టైమ్ ఇన్ ముంబై’ లాంటి సినిమాలు చూసిన వారికి దర్శకుడు మిలన్ సత్తా ఏమిటో తెలుసు. కథ చెప్పే విధానం అంటే ఇదేనని కితాబు కూడా ఇచ్చేశారు. ఐతే -ఈ కథకి వచ్చేసరికి ‘1975 ఎమర్జెన్సీ’ నేపథ్యం వెనుక ఉన్న రహస్యం ఏమిటో వీసమెత్తు తెలీదు. కథకీ ఎమర్జెన్సీకీ ఎటువంటి సంబంధం లేకపోయినా కథ సజావుగా నడిచిపోయేది. మరి ఆ ముచ్చట దేనికో?
-గీతాంజలి (ఇలియానా) జైపూర్ సామ్రాజ్యానికి అధినేత్రి. తండ్రి మరణించటంతో రాజ్యానికి ఆమె వారసురాలవుతుంది. నిధి నిక్షేపాలతో కూడిన ఖజానా ఆమె వశం కాకముందే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని రాజస్థాన్ నుంచీ ఢిల్లీకి తరలించేందుకు సెహెర్ సింగ్ (విద్యుత్ జమ్వాల్)ని సేఫ్ గార్డ్‌కి అపాయింట్ చేస్తుంది. అది 1975 ప్రాంతం. ఎమర్జెన్సీతో దేశం అట్టుడికిపోతూన్న తరుణం. అవినీతి రాజకీయ నాయకుడు సంజీవ్ (ప్రియాన్షు ఛటర్జీ) ఆ నిధిని ఏ విధంగానైనా చేజిక్కించుకోవాలని పన్నాగాలు వేస్తూంటాడు. ఇటు ప్రభుత్వం నుంచీ.. అటు సంజీవ్ నుంచీ ఆ నిధిని తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్న గీతాంజలి తన పర్సనల్ అసిస్టెంట్‌గా భవాని (అజయ్ దేవ్‌గన్)ని నియమించి ‘నిధి’ని తరలించే బాధ్యతని అప్పజెబుతుంది. భవాని అసిస్టెంట్లు దేలియా (ఇమ్రాన్ హష్మి), టిక్లా (సంజయ్ మిశ్రా), సంజనా (ఈషా గుప్తా)లతో తన ‘ఆట’ని మొదలుపెడతాడు.
కౌబాయ్ సినిమాల్ని అభిమానించే వారికి ఏదో రకంగా కాస్తంత సంతృప్తిని అందిస్తూందీ సినిమా. ఆసక్తిగొలిపే కథనంలో వేగం లేకపోవటం ప్రధాన కారణమైతే.. కథ అనేకానేక మలుపులు తిరిగినప్పటికీ ‘ఎక్కడ వేసిన కథ’ అక్కడనే ఉండిపోవటంతో - నిరాశ కలుగుతుంది. ‘ట్రెజర్ హంట్’ కథలకి కథనమే ఉత్కంఠ కలిగించే అంశం. ఇదే ఈ సినిమాకి మైనస్ పాయింట్. ఫస్ట్ హాఫ్‌లో కథ చాలా ‘నెమ్మదిగా’ నడుచుకుంటూ వచ్చి ‘ఇంటర్వెల్’ తర్వాత ఏదో బీభత్సం సృష్టించబోతోందని ఆశిస్తే అది ప్రేక్షకుల తప్పే. సినిమా ప్రధానంగా చెప్పదలచుకున్నది ‘ట్రెజర్’ని చేజిక్కించుకోవటం. అలాంటప్పుడు అదే విషయాన్ని సాఫీగా చెప్పొచ్చు. అలా చెప్పకుండా మధ్యలో ‘ఎమర్జెన్సీ’ నేపథ్యాన్ని జొప్పించాల్సిన అవసరం ఏమిటో తెలీదు. రాజస్థాన్ ఎడారి ప్రాంతం అనేప్పటికి ఎంతో కొంత కథని ఊహించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కానీ అలాంటి ‘ఎక్స్‌పెక్టేషన్స్’ గట్రా పెట్టుకోవద్దని మనవి. హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ‘ఓషన్స్ ఎలెవన్’కీ దీనికీ ఏదో అవినాభావ సంబంధం ఉందనీ అనుకోవద్దు. సన్నీ లియోన్ హాఫ్ నెకెడ్ సీన్ గురించి కూడా అంతగా పట్టించుకోవాల్సింది లేదు. రీరికార్డింగ్‌తోపాటు బోలెడన్ని సన్నివేశాలు చిరాకు తెప్పిస్తాయి.
కాకపోతే- సస్పెన్స్ థ్రిల్లర్‌ని ఏదో ఒక మూల ఊహించుకొంటూ కథతోపాటు నడిస్తే - మధ్యమధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు కాస్తంత ఊరటనిస్తాయి.
నటనాపరంగా -అజయ్‌దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మిల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలియానా తన అందచందాలతో మురిపించింది. ఈషా గుప్తా జస్ట్ ఓకే. సంజయ్ మిశ్రా ‘కామిక్’ టైమింగ్‌తో అలరించాడు. మిగతా వారు వారివారి పరిధి మేరకు నటించారు. సంగీతం ఫర్వాలేదు.

-బిఎనే్క