రివ్యూ

స్క్రూ బాగా లూజైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు *పైసా వసూల్

తారాగణం: బాలకృష్ణ, శ్రీయా శరన్, ముస్కాన్ సేథీ, కైరాదత్, కబీర్ బేడి, విక్రమ్‌జీత్, అలోక్ జైన్, పిధ్వి, అలీ సినిమాటోగ్రఫి: ముఖేష్.జి
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖి
నిర్మాత: వి.ఆనంద్‌ప్రసాద్
రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్

వరుస సినిమాలతో బాలయ్య జోరు మామూలుగా లేదు. వంద సినిమాలను పూర్తిచేసిన బాలయ్య.. 101వ సినిమాతో మళ్లీ కొత్తగా మొదలుపెట్టాడా? అన్నంత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నాడు. పూరి సినిమా అనగానే హీరో పాత్ర కొత్తగా, భిన్నంగా వుంటుంది. హీరో చెప్పే డైలాగులు కొత్తగా వుంటాయి. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలకు ఎక్కువ ఆసక్తి. ఇక 100 సినిమాలు చేసిన బాలకృష్ణ 101 సినిమా పూరి జగన్నాథ్‌తో చెయ్యాలనుకున్నాడు. గౌతమిత్ర శాతకర్ణితో కెరీర్‌లో నిలిచిపోయే సినిమా చేసిన బాలయ్య.. వెంటనే ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్న సమయంలో పూరి చెప్పిన కథ నచ్చింది. బాలకృష్ణతో పూరి ఏమేం చేయించాలనుకున్నాడో అన్నీ చేయించేశాడు. కుర్ర హీరోల్లో వుండే చలాకీతనం, ఎనర్జీని తేడాసింగ్ క్యారెక్టర్‌లో టన్నులకొద్దీ నింపేశాడు. ఇక స్పీడ్‌గా సినిమాలు తీయడంలో దిట్ట అయిన పూరి జగన్నాథ్ కూడా బాలయ్యతో చేసిన సినిమాను అంతే స్పీడ్‌గా పూర్తిచేశాడు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరికి బాలయ్య పైసా వసూల్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో మరి. భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీయ, ముస్కాన్, ఖైరాదత్‌లు హీరోయిన్లు. భారీ అంచనాలమధ్య వచ్చిన ఈ సినిమా ఎలా పైసా వసూల్ చేసిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
ఇంటర్నేషనల్ క్రిమినల్ బాబ్ మార్లీ అనేతను తన తమ్ముడి మరణానికి కారణమైన ఇండియన్ రా ఏజెన్సీ మీద పగబట్టి భారతదేశంలో అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతుంటాడు. అతనికి కొందరు రాజకీయ నాయకుల సపోర్టు ఉండటంతో ఇండియన్ రా ఏజెన్సీ పెద్దలు కూడా లీగల్‌గా అతన్ని ఏమీ చేయలేక అడ్డదారిలోనే అతన్ని అంతమొందించాలని ప్లాన్ వేసి, అందుకు అనుగుణమైన వ్యక్తికోసం వెదుకుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఎలాంటి భయం లేకుండా, తెగింపుగా బ్రతికే క్రిమినల్ తేడాసింగ్ (బాలకృష్ణ) వాళ్ల కంటబడతాడు. అతనితో పోలీసులు బాబ్ మార్లీని చంపాలనే డీల్ కుదుర్చుకుంటారు. అలా పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్న తేడాసింగ్ ఏం చేశాడు? బాబ్ మార్లీ తమ్ముడ్ని ఎవరు చంపారు? చివరికి బాబ్ మార్లీ ఎలా అంతమయ్యాడు? అసలు తేడాసింగ్ ఎవరు అన్నది మిగతా కథ.
ఇక బాలకృష్ణ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు. ఇప్పటివరకు చేసిన 100 సినిమాల్లో చూడని బాలకృష్ణని చూస్తారు. తేడాసింగ్ క్యారెక్టర్‌ని పూరి ఎంత డిఫరెంట్‌గా డిజైన్ చేశాడో దానికి తగ్గట్టుగానే బాలకృష్ణ హండ్రెడ్ పర్సెంట్ పెర్‌ఫార్మెన్స్ ఇవ్వగలిగాడు. పూరి ఊహించిన పాత్రను తెరపై దింపేశాడు బాలకృష్ణ. అయితే అతని క్యారెక్టర్‌లోని అత్యుత్సాహం కాస్త కలవరపెడుతుంది. ఇక డాన్సుల్లో, ఫైట్స్‌లో యంగ్ హీరోలకు తాను ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు. సినిమాలో మిగతా క్యారెక్టర్ల గురించి, ఆ క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టుల గురించి కొత్తగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. కేవలం ఇది బాలకృష్ణ వన్‌మెన్ షో అని చెప్పొచ్చు. మిగతా క్యారెక్టర్లు తేడాసింగ్ క్యారెక్టర్‌కి సపోర్టుగా వుంటాయే తప్ప ఆ క్యారెక్టర్లకు అంత ప్రాధాన్యం లేదు. దాదాపు పోకిరి కథ పోలికలతో వున్న కథ ఇది. పోకిరిలో కొన్ని ట్విస్టులకు ఆడియెన్స్ థ్రిల్ అవుతారు. కానీ ఈ సినిమాలో ఏ సందర్భంలోనూ ఆడియన్స్‌ని థ్రిల్ చెయ్యలేకపోయాడు పూరి. టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పుకోవాలంటే ముఖేష్ ఫొటోగ్రఫి బాగుంది. ప్రతి సీన్‌ని రిచ్‌గా కనిపిస్తుంది. అనూప్ చేసిన పాటలన్నీ బాగున్నాయి. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అనూప్ ఆకట్టుకలేకపోయాడు. ఏ సీన్‌లోనూ అతని మ్యూజిక్ సినిమాకి హెల్ప్ అవ్వలేదు. ఫైట్‌మాస్టర్ వెంకట్ ఫైట్స్ అన్నీ డిఫరెంట్‌గా కంపోజ్ చేశాడు. దానికి తగ్గట్టుగానే బాలకృష్ణ ఎంతో ఈజ్‌తో చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎన్ని ప్లస్‌లు ఉంటే మాతం ఏంటి? దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం కథ, కథనం విషయంలోఎలాంటి కొత్తదనం చూపించలేకపోయాడు. తన పాత ఫార్మాట్‌లోనే సినిమా చేయడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పటికే చాలాసార్లు చూసిన కథను మళ్లీ తీసుకుని దానికి కొత్త డైలాగులు రాసుకున్నాడు తప్ప కథ విషయంలో కొత్త మార్పులేవీ పైసా వసూల్‌లో కనిపించవు. ఇందులో అలీ వున్నా పెద్దగా కామెడీ వర్కవుట్ కాలేదు. పృధ్వీలాంటి కమెడియన్‌ని పెట్టుకుని కూడా ఎంటర్‌టైన్ చేయించలేకపోయాడు.
రొటీన్ కథ, కథనం, మాఫియా డాన్, అతన్ని పోలీసు డిపార్టుమెంట్ పట్టుకోలేకపోవడం, ఆ డాన్‌వల్ల హీరోయిన్ ఫ్యామిలీకి సమస్యలు రావడం, ఆ ఫ్యామిలీని రక్షించడానికి హీరో ఎక్కడినుంచో రావడం, విలన్ గ్యాంగ్‌ని ఎదుర్కోవడం అంతా పరమ రొటీన్.. బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ ఓవర్ డోస్ కావడం కూడా ఆడియన్స్‌కి జీర్ణం కాలేదు. ఇలాంటి డైలాగ్స్ రాయడం పూరి జగన్నాథ్‌కి కొత్త కాకపోయినా, చెప్పడం బాలకృష్ణకు కొత్తే. ఇప్పటివరకు బాలకృష్ణను అలాంటి క్యారెక్టర్‌లో చూడలేదు కాబట్టి అభిమానులు మాత్రం బాలకృష్ణ క్యారెక్టర్‌ని, అతను చెప్పే డైలాగ్స్‌ని ఎంజాయ్ చేశారు. ‘మేరా నామ్ తేడా.. తేడాసింగ్, ధిమాక్ తోడా, చాలా తేడా’ అనే డైలాగ్, ‘గొడవల్లో గోల్డ్‌మెడలొచ్చినోడ్ని, మళ్లీ టోర్నమెంట్లు పెట్టొద్దు’, ‘ఒక్కసారి నా స్క్రూ లూజ్ అయితే నేనిలాగే వుంటా’ అన్న డైలాగ్స్ తప్ప సినిమాలో చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఇది పక్కా బాలకృష్ణ ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా అని ఫస్ట్ సీన్ నుంచే ధిమాక్‌లో కొడుతూ ఉంటుంది.

-త్రివేది