వీరాజీయం

రద్దు పద్దులో కోట్లు నష్టం! (వార్త- వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత నవంబర్ 8నాడు కేంద్ర ప్రభుత్వం వెయ్యి, ఐదువందల కరెన్సీ నోట్‌లమీద వేటువేసిన తరువాత- రోడ్లమీద వేసే టోల్‌గేట్ సుంకం ఒక మూడు వారాలు ఎత్తేశారు కేంద్రంవారు. టాక్స్ కట్టాలంటే చెల్లని పైసలే గాని తంతే మరో దమ్మిడీ ఎవరి దగ్గారా లేదుగా.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు- మహారాష్టల్రో కూడా గవర్నమెంట్ మొత్తం 53 టోల్‌గేట్ వసూలు చేసే ప్లాజా సెంటర్స్ టోల్‌గేట్లు ఎత్తేసింది. అన్ని రకాల బస్సులు కార్లు లారీలు గట్రా నవంబరు నెలాఖరుదాకా ఆగకుండా ముంబై పూనా ప్రధాన మార్గంలో అటూ ఇటూ తిరిగేశాయి. కాని కాంట్రాక్టర్ల నోట్లో కరకాయ పడ్డది. వాళ్లకి నో ఇన్‌కమ్. గగ్గోలు పెట్టారు. మొత్తం 144 కోట్ల రూపాయలని నష్టపరిహారంగా మాకు చెల్లించండి మహాప్రభో అని వాళ్ళు నిలదీసారు. మహా ప్రభుత్వం కేంద్రాన్ని మీరు మాకు ఆ పరిహారం సొమ్ములు ఇప్పిస్తే మేము వాళ్లకి పరిహారం చెల్లిస్తాము అన్నది. ‘‘మెహర్బానీ మీదీ, కాంట్రాక్టర్లు మీవాళ్ళు, రోడ్లు మీవే- దెన్ వై?’’- మేము కట్టం అని తూర్పు చూపించారు కేంద్రం వారు. చచ్చినట్లు క్రక్కాల్సిందేగా- అందుకని మహారాష్ట్ర ఏలినవారు మెలిక పెట్టారు కంట్రాక్టర్లకి. రోడ్లు అధ్వాన్నంగా వున్నాయి, వాటి రిపేర్ల ఖర్చు మీదే కావున- మేము రోడ్లలో మరమ్మతులకి అయ్యే ఖర్చులు మినహాయించుకుని మీకు పరిహారం విదిలిస్తాం అన్నారు. కాదు ఒప్పందం పత్రాల ముగింపు పెంచండి అన్నారు కాంట్రాక్టర్లు. అలా చేస్తే చస్తాం, ఇపుడు వున్న ఒప్పందం గడువు తీరాక చెయ్యాలి. దానితో కొత్తగా వచ్చే ‘పాట’ డబ్బు కాగా, కూడా పోతాయి. కోర్టుకి పోతే వడ్డీ సహా కట్టమంటే? ‘కుదేలు’! అంచేత, పరిహారం ఇస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టి తల ఆడించింది.. నోట్ బందీ ఇబ్బందులలో ఇది ఒక మచ్చు మాత్రమే.

వర్షాధార సదుపాయాలతో నడిచే కాలేజీ!
ముంబాయిలో జలప్రళయమా అన్నట్లు కురిసిన వానలకి ఊరు ఊరంతా మునిగి తేలుతోంది కానీ, జిబీటి - సైన్స్ అండ్ కామర్స్ కాలేజీ విద్యార్థులు వర్షాధార సదుపాయాలు, పర్యావరణ మైత్రీ యంత్రాంగం ముందే చేసుకున్నారు. వాళ్ళ కళాశాల భవనం డాబానే వాళ్ళు ఒక ట్యాంకుగా మార్చారు. మరుగుదొడ్లకి బాత్‌రూములకి ఇతర వాడకానికి అదే నీరు- నిజానికి వాన నీరు నేరుగా పట్టుకుంటే చాలా శుభ్రమయిన జలాలు వస్తాయి అంటారు కదా? ఈ విద్యార్థులు రోజుకో ఇరవై వేల లీటర్ల వాననీళ్ళు ఆదా చేశారు. ముంబై నగరంలో తలొక్కింటికి 135 లీటర్ల నీరు వాడకానికి కావాలిట. స్వయంగా ఈ కాలేజీ విద్యార్థులు వరుణదేవుడి ఆగ్రహాన్ని మంచిగా వాడేసుకుంటున్నారు. డాబాలమీదనుంచి పిల్లికూతలు, ఈలలతో అమ్మాయిలను ఆట అట్టించడం కాదు- అక్కడ ఒక సోలార్ విద్యుత్ ప్లాంట్ పెట్టి, అదే సౌరశక్తినుంచి విద్యుచ్ఛక్తిని తయారుచేస్తున్నారు. చెత్త కాగితాలు చిత్తు కాగితాలు ఏరడం ఎంత గౌరవప్రదమయిన కార్యక్రమమో వీళ్ళను చూసి నేర్చుకోవాలి. వారానికోసారి బ్యాచ్ బ్యాచ్‌లుగా వీళ్ళు లోకల్ జిబిటి రైల్వే స్టేషన్‌కి వెళ్లి ఫ్లాట్‌ఫాంమీది ప్లాస్టిక్ సంచులు కాగితాలు ఏరి ప్రయాణికులకు పర్యావరణ మైత్రి గురించి మంచి మాటలు చెబుతారు. ప్రతీ విద్యార్థికి అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఇన్ని కాగితాలు చెత్త ప్రోగు చేయాలి అని టార్గెట్లు వున్నాయి. వీటితో ఎరువులు ఉత్పత్తి చేస్తున్నారు. ప్లాస్టిక్ కాగితం వగైరా చెత్తని అబ్బాయికి ఇచ్చి వాటితో పనికొచ్చే వస్తువులు రీసైక్లింగ్ ద్వారా చేయించుకుంటున్నారు. ‘ఎకొరాక్స్’ అనే సంస్థ పెట్టిన పర్యావరణ మైత్రి పోటీలో ఈ కాలేజీ విద్యార్థులకి ఫస్ట్‌ప్రైజ్ వచ్చింది. పాలిటిక్స్ బయటకు డిగ్రీలతో వెళ్లినాక నేర్చుకుంటారు, టైముంటుంది, కాని సంఘ్ జీవితాన్ని ప్రభావితం చేస్తూ స్వావలంబన నేర్చుకోవడం మా కాలేజీ నేర్పాలన్నదే మా పట్టుదల అని ప్రిన్సిపాల్‌గారు చెబుతున్నాడు. నమ్మలేకపోతున్నారా? సరే!

-వీరాజీ