Others

ప్రగతికి మూలం సృజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించి ముందుకు అడుగులు వేసినపుడే అది వారి ప్రగతికి, దేశ ప్రగతికి దోహదం చేస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించినపుడే కొత్త ఆవిష్కరణలు ఆచరణ రూపం దాలుస్తాయి. కొత్త ఆలోచనల వల్ల నూతన సమాజాలు రూపొందుతాయి. ప్రతిరోజూ విద్యార్థి నూతనంగా కొత్త ఆవిష్కరణలు చేయడం వల్ల కొత్త కొత్త పరిశోధనలు చేయగలుగుతాడు. సాంకేతిక విప్లవాన్ని వికసింపజేయగలుగుతాడు. సామాజికంగా జరుగుతున్న ప్రతి మార్పు వెనుక నూతన ఆలోచనలే పునాదిగా ఉంటాయి. సామాజిక విప్లవాలకైనా, సాంకేతిక విప్లవాలకైనా సృజనాత్మకంగా ఆలోచించడమే పునాది. కారల్ మార్క్స్ సృజనాత్మకంగా ఆలోచించడం వల్లే కార్మికవర్గ సిద్ధాంతం, శ్రమజీవుల రాజ్యాలు అవతరించాయి. రష్యా, చైనా, లాటిన్ అమెరికన్ దేశాల విముక్తి వెనుక సృజనాత్మక ఆలోచనలు, కమ్యూనిస్టు మేనిఫెస్టో ఉన్నాయి.
* గాంధీజీ నూతనంగా ఆలోచించి ప్రపంచానికి అహింసా మార్గం ప్రభోదించాడు.
* బుద్ధుని తన సృజనశక్తి వల్లే ‘బహుజన పితాయ, బహుజన సుఖాయ’ అంటూ సర్వమానవ కల్యాణాన్ని ఆవిష్కరించాడు.
* డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల నుంచి కులం లేని సమాజానికి దారి ఏర్పడింది. పేదలకు ఆసరాగా భారత రాజ్యాంగం అవతరించింది. కులం గోడలను కూల్చే మహత్తర ఆయుధాలను అందించాడు. మనిషిని మనిషి గౌరవించే నవ సమాజానికి పునాదిరాయి వేయగలిగాడు.
* భగత్‌సింగ్ నూతన ఆలోచన వల్లే ఉరితాడును నిర్భయంగా ముద్దాడాడు. సోషలిస్టు సమాజ స్వప్నాలను ఊహించాడు.
* తెలంగాణ కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఫలితంగా ‘దునే్నవానిదే భూమి’ నినాదం విశ్వవ్యాప్తమైంది.
* భావజాల సంఘర్షణ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆలోచనల నుంచి వచ్చి ‘తెలంగాణలో ఏం జరుగుతోంది?’ అనే భావజాలాన్ని మనకు అందించాడు.
* తెలంగాణలోని మేధావులు, అధ్యాపకులు, విద్యార్థులు, అక్షరాస్యులు సృజనాత్మకంగా ఆలోచించడం వల్లే తెలంగాణ రాష్ట్ర సాధన ఒక సాంస్కృతిక ఉద్యమంలా సాగింది.
* రాజకీయ నాయకులు సృజనతో ఆలోచిస్తే సమాజానికి మేలు జరుగుతుంది.
* తెరాస అధినేత కెసిఆర్ సృజనాత్మకంగా ఆలోచించడం వల్లనే, అలా ఉద్యమించడం వల్లనే నూతన రాష్ట్ర అవతరణ జరిగింది.
* తెలంగాణ ప్రజలు సృజనాత్మంగా ఆలోచించడం వల్లే వారి మనోభావాలను అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకుని వారి సంఘటిత ఉద్యమానికి బాసటగా నిలిచాయి.

- చుక్కా రామయ్య