మెయిన్ ఫీచర్

సంపాదనలో ఇంతింతై...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ నేడు కుటుంబ నిర్ణయాల్లోనూ, సంపాదనలోనూ ఆమె పాత్ర గణనీయంగా పెరుగుతోంది. నిర్ణయాలు తీసుకోవటంలోనే కాదు వాటిని అమలుపరచటంలోనూ అతివల హవా కొనసాగుతోంది. సంపాదనలోనూ తామెవ్వరికీ తీసిపోమంటూ పురుషుల కంటే స్ర్తిలే అధికంగా సంపాదిస్తున్నారు. కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, చాలెంజ్‌లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ నివేదికలోనూ ఈ విషయం వెల్లడైంది. గత ఏడాది ఫోర్బ్స్ సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 12 మహిళా సిఇఓల సంపాదన 382 పురుష సిఇఓల వేతనం కంటే అధికంగా ఉందని వెల్లడైంది. ఈ 12మంది మహిళా సిఇఓల సగటు వేతనం 1.38 కోట్లు ఉండగా.. పురుష సిఇఓల వేతనం రూ.1.16కోట్లు మాత్రమే ఉంది. మహిళలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ కెరీర్‌పరంగా ముందుకు దూసుకువెళుతున్నారు. ఓ సర్వే ప్రకారం మనదేశంలో 56శాతం మంది మహిళలు సంపాదిస్తున్నారు. వీరు ఎంత విద్యాధికులైతే వారి సంపాదనలో అంత ఎక్కువ జండర్ పే గ్యాప్ కనిపిస్తోంది. ఏ రంగమైనా కావచ్చు ఆ రంగంలో మహిళలు దూసుకుపోతుంటే జండర్ పే గ్యాప్ పెరుగుతోంది.

బాలీవుడ్ హీరోయిన్ల సంపాదన తక్కువేమీ కాదు..
బాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న ప్రముఖ హీరోయిన్లంతా వారి భర్తల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. భర్తలు స్టార్ హీరోలైనప్పటికీ వారి భార్యల సంపాదనే అధికంగా ఉంది. కరీనాకపూర్, ఐశ్వర్యారాయ్, ఫరాఖాన్, హేమమాలిని వంటి సెలబ్రిటీల సంపాదన వారి భర్తల కంటే అధికమే. హాలీవుడ్‌లో సైతం ఎంజిలినా ఆమె మాజీ భర్త బ్రాడ్‌పిట్ కంటే అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. సారా జెస్సికా పార్కర్ సైతం ఆమె భర్త బ్రోడెరిక్ కంటే ఎక్కువ సంపాదిస్తోంది. అయితే అధిక సంపాదన ఉన్నప్పటికీ కళ్లు నెత్తినెక్కించుకోకుండా సంసారాన్ని సాఫీగా నిర్వహిస్తున్నారు. సంపాదన ఎక్కువైనప్పటికీ ఈ హీరోయిన్లు ఇంట్లో పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమైందని అంటారు మనస్తత్వ నిపుణురాలు రిచా. డబ్బు కంటే కుటుంబ బంధానికే వీరు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వీరి సంసారంలో ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగుతున్నాయంటారు. జీవిత భాగస్వామి స్టార్ హీరో అయినప్పటికీ తమ భార్యల నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించటం వల్ల వీరు కళారంగంలో దూసుకువెళుతున్నారని రిచా అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సానుకూల బంధం వల్ల వీరు డబ్బును కేవలం సంఖ్యగానే పరిగణిస్తారని ఆమె అంటారు. ఏది ఏమైనప్పటికీ కొంతమంది సెలబ్రిటీల సంపాదన వారి భర్తల కంటే అధికంగా ఉన్నదో తెలుసుకుందాం.

చిన్మయి శ్రీపాద
సింగర్ చిన్మయి శ్రీపాద అనేక భాషల్లో మెలోడి పాటలు పాడటంలో దిట్ట. బాలీవుడ్ సినిమాల్లోనూ ఆమె పాటలు పాడతారు. ఇటీవలనే నేషనల్ అవార్డుకు నామినేటేడ్ అయ్యారు. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ నటుడు. ఈ మధ్యనే రాహుల్ ఒక ట్వీట్ చేస్తూ గత ఏడాది తన భార్య చిన్మయి శ్రీపాద తన కంటే అధిక మొత్తంలో చెల్లింపులు జరిపిందని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే చిన్మయి సంపాదనే అధికం అని అర్థమవుతుంది. ఆమె ప్రతిభావంతురాలు అవ్వటం వల్లే అధికంగా సంపాదిస్తుంది. ఖర్చుల విషయంలో ఇద్దరు చర్చించుకుని సమన్వయంగా వ్యవహరిస్తాం అని ఆ ట్వీట్‌లో భర్త వెల్లడించటం గమనార్హం.

కొత్తగా వచ్చినా..
బిపాసుబసు ఇటీవలనే కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లాడింది. బాలీవుడ్‌లో స్ట్రగుల్ పడుతున్న గ్రోవర్ ఇంకా నిలదొక్కుకోలేదు. కాని బిపాసుబసు మోడలింగ్‌లో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోంది. ఆమె తన భర్త కంటే అధికంగా సంపాదిస్తున్నట్లు వెల్లడైంది.

ఇంటిపేరు గౌరవాన్ని ఇచ్చింది
ప్రపంచ సుందరి, బిడ్డకు తల్లయిన ఐశ్వర్యారాయ్ ఇంటిపేరు (బచ్చన్) ఆమె గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది. సంపాదనలో అభిషేక్ బచ్చన్ కంటే ఆమెదే పైచేయి. సినిమాల్లోనే కాదు మోడలింగ్‌లోనూ అత్యధిక పారితోషికం తీసుకుంటుంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఐశ్వర్య సంపాదన రూ.35 కోట్లు ఉండగా.. అభిషేక్ బచ్చన్ సంపాదన రూ.30 కోట్లు. అభిషేక్ బచ్చన్ 1994లో జాతీయ చలనచిత్ర అవార్డు పొందినప్పటికీ ఐశ్వర్యారాయ్‌దే అధిక సంపాదన.

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా..
ఫరాఖాన్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా తన హవా కొనసాగిస్తోంది. ఆమె మంచి కొరియోగ్రాఫర్ కూడా. టీవీల్లో ఆమె షోలకు విపరీతమైన ఆదరణ ఉంది. కొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్టుల్లోనూ ఫరా పనిచేస్తుండటం వల్ల ఆమె సంపాదన భర్త శిరీష్ కుందర్ కంటే అధికమట.

రియాల్టీ షోలతో..
రియాల్టీ షోలతో మనసుదోచుకున్న సన్నీలియోన్ సంపాదన కూడా తక్కువేమి కాదు. ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్‌లో సన్నీ పాల్గొన్నది. బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. దీంతో ఈమె సంపాదన భర్త డానియల్ వెబర్ కంటే అధికం. సన్ని సంపాదించటంలోనే కాదు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటుంది. క్యాన్సర్ పేషెంట్ల కోసం నిధుల సేకరణ, అలాగే జంతు సంరక్షణ కోసం ఆమె సేవలందిస్తుంది.

నవాబు అయినా..
సైఫ్ అలీఖాన్ పటౌడి నవాబు అయినప్పటికీ ఈయన సంపాదన కంటే కరీనాదే పైచేయి. పే చెక్స్‌లో కరీనా అధికంగా తీసుకున్నట్లు వెల్లడైంది. బాలీవుడ్ హీరోయిన్లలో అధిక రెమ్యూనరేషన్ తీసుకునేవారిలో కరీనా స్థానం ఈనాటికీ చెక్కుచెదరలేదట. కుర్బాన్ సినిమా నుంచి ఆమె సంపాదన ఏమాత్రం తగ్గలేదు.
చిత్రం.. భర్త రాహుల్‌తో చిన్మయి శ్రీపాద

- టి.ఆశాలత