మెయిన్ ఫీచర్

ఆత్మవిశ్వాసమే ఆలంబన...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరచేతుల్లేవన్న చింత తప్ప ఈ చెన్నై అమ్మాయి సాధించని ఘనకార్యాల్లేవు! పదిహేనేళ్ళకిందట గ్రెనేడ్ పేలడం వల్ల మాళవిక అయ్యర్ రెండు అరచేతులు కోల్పోయింది. అయినప్పటికీ ఎన్నో అవార్డులు గెలుచుకుంది. దివ్యాంగుల హక్కుల కోసం పోరాటం సాగిస్తోంది. ఐక్యరాజ్య సమితి వేదికల్లో ప్రసంగించింది. దివంగత రాష్టప్రతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్‌తో భేటి అయింది. మొండి చేతులతో అష్టకష్టాలు పడుతూనే మంచి విద్యార్థినిగా, సంఘసేవకురాలిగా పేరుతెచ్చుకుంది. అయితే, వంట చేయలేకపోతున్నానే అన్న బాధ మాత్రం ఆమెను వెంటాడుతూ వచ్చింది. కానీ, ఆ అడ్డంకిని కూడా ఈ మధ్యనే అధిగమించగలిగిందామె. అరగంటలోగా వంట చేసి, ఆ ఘనకార్యాన్ని ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పింది.
‘పేలుడులో అరచేతులు తెగిపోయాయి. ఇక ఈ జీవితంలో వంట చేయలేను అనుకున్నాను. అలా ఒక రోజు బాధపడుతూనే మా అమ్మకు ఫోన్ చేసి, సులభంగా తయారుచేయగలిగే కూర వంటకం గురించి వివరాలు చెప్పమన్నాను. ఆమె చెప్పిన పద్ధతినే పాటిస్తూ కూరగాయలు శుభ్రంగా కడిగి, మసాల సామాన్ల సీసాలు మూతలు తీసి, కొలతల ప్రకారం వాటిని కలిపి 25 నిమిషాల్లో పసందైన కూర వండగలిగాను. అరచేతులు లేకపోయినా అనుకున్నది సాధించడంతో నా ఆనందం అంతా ఇంతా కాదు’ అని చెప్పిందామె. ఈ ట్విట్టర్ అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఇండియన్ చెఫ్ వికాస్ ఖన్నా దృష్టిలో పడింది. వెంటనే అతడు మాళవికకు ఫోన్ చేసి, ఆమెతో కలిసి వంటచేస్తానని వాగ్దానం చేశాడు. దీంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయింది. ఆత్మవిశ్వాసంతో దేనినైనా సాధించవచ్చని నేటి సమాజం ముందు మాళవిక రుజువు చేసింది. శభాష్ మాళవిక!

- కృష్ణ