భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్.సాయినాగశ్రీ, పాయకరావుపేట (వైజాగ్)
ప్ర: గురువుగారూ! నమస్కారం! నా వివాహం మీరు చెప్పిన ప్రకారం చెప్పిన నెలలోనే జరిగింది. (12-04-2017)- మా కుటుంబం మీకు ధన్యవాదాలు తెలుపుతున్నది. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలకు పరిష్కారం తెలుపండి.
సమా:స్ర్తి సంబంధమైన సమస్య కనుక హోమియో లేడీ డాక్టర్‌ను సంప్రదించండి. గృహ వైద్యంగా ప్రతిరోజూ రాత్రి స్వల్పంగా ఉప్పు వేసిన నీళ్ళల్లో కొంచెం పసుపు- ఐదు శెనగ గింజలు వేసి రెండవ రోజు తెల్లవారు జామున పరగడుపున నమిలి తినండి. స్నానం చేసేటపుడు కల్తీలేని పసుపు - వేపనూనె కలిపి ఒంటికి రాసుకొని కొంతసేపుండి ఆ తరువాత స్నానం చేయండి.
ఎమ్.అనూరాధ, పాలకొల్లు (ప.గో.)
ప్ర: వివాహము గురించి- మంచి వరుడు కావాలంటే ఏం చేయాలి?
సమా: ‘పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు’ అనేది పెద్దలు చెప్పిన మాట. ‘మారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్’ అని పాశ్చాత్యుల సామెత- మంచి భర్త రావటానికి పూర్వజన్మ సుకృతం కూడా తోడుకావాలి. అయితే మీ వరకు మీకు మంచి వరుడే లభిస్తాడు. తూర్పు వైపునుండి కొన్ని ఆటంకముల తరువాత స - మ -ప అనే అక్షరాలతో ప్రభుత్వోద్యోగి వరుడుగా లభిస్తాడు. ప్రతిరోజూ రుక్మిణీ కళ్యాణం పారాయణ (తెలుగు భాగవతంలో) చేయండి. శుభం భవతు.
పీసపాటి మార్కండేయ శాస్ర్తీ, ఏలూరు (ప.గో.)
ప్ర: స్వగృహయోగం-
సమా: మీరున్న చోటినుండి తూర్పు దిశలో ప్రభుత్వ సహాయంతో మీకు గృహ నిర్మాణం కాని అపార్ట్‌మెంట్ కాని ఏర్పడే అవకాశం ఉంది.
జయశ్రీ సాయిరాం, పాలకొల్లు (ప.గో.)
ప్ర: రైల్వేలో ఉద్యోగం వస్తుందా?
సమా: మీ జాతకంలో చంద్ర దోషం ఉంది. ప్రతి సోమవారం తేనెలో ముంచి నాలుగు కుడుములు విఘ్నేశ్వరునికి నివేదన చేయండి. మీకు రైల్వేలో కంటే మర్చెంట్ నేవీలోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ. ఆ దిశలో ప్రయత్నించండి. అయితే విఘ్నేశ్వర పూజ మాత్రం మరువవద్దు.
కార్తీక శశాంక్, కాకినాడ (తూ.గో.)
ప్ర: నా మనస్సు ఎప్పుడూ ఏదోలా ఉంటుంది. చదువుమీద శ్రద్ధ చూపలేకపోతున్నాను. కారణం తెలియదు. సలహా ఇవ్వండి.
సమా: మీకు పెద్దగా అనారోగ్యమంటూ ఏమీ లేదు. మీరిచ్చిన సంఖ్య ప్రకారం మీరు ఏదో ప్రేమ వ్యామోహంలో చిక్కుకున్నట్టు కన్పిస్తున్నది. వివాహ ప్రసక్తి ముందుకు వచ్చే అవకాశముంది. భ్రమల్లో పడకండి.
కె.్భస్కర్, సాలూరు (ఆంధ్ర)
ప్ర: ఇల్లాలి పోరుతో విసిగిపోతున్నాను. ఇల్లు విడిచి వెళ్లిపోదామనుకుంటున్నాను. నా కోరిక నెరవేరగలదా?
సమా: ఏదైనా క్రమపద్ధతిలో చేస్తే సమాజం- శాస్త్రం ఆమోదిస్తుంది. కొంతవరకు మీరు కూడా కొంచెం ఛాందసుల్లాగానే కన్పిస్తున్నారు. మూలా నక్షత్ర జాతకులకు రాజీపడే స్వభావం ఉండదు. శ్రీకృష్ణుని పాత్రను బాగా స్టడీ చేయండి. పరిష్కారం దొరుకుతుంది.
తామర చక్రవర్తి, సోమవరం (తూ.గో.)
ప్ర: నా జాతకం ప్రకారం ఏ రత్నధారణ మంచిది?
సమా: ఒకే ఒక రత్నం ధరించటం మంచిది. రాశ్యాధిపతి- నక్షత్రాధిపతి- జాతకంలో బలహీనంగా ఉన్న గ్రహానికి సంబంధించి మూడు రత్నాలు ధరించటం మంచిది.
ఎ.పూర్ణచంద్రరావు, వేపగుంట (వైజాగ్)
ప్ర: నేను ఒకరి ఇంట్లో ద్వాదశాహానికి వెళ్లి అక్కడి పద్ధతులు నచ్చక భోజనం చేయకుండా వచ్చాను. అది పాపమా?
సమా: అపర కర్మల విషయంలో అత్యంత రక్తసంబంధీకుల ఇంట్లో అయితే శవవాహక కర్మ నిర్వహించినా భోజనం చేయాలి. అలా కాక చాలా దూరపు వారైతే భోజనం చేయకపోయినా తప్పులేదు. రక్తసంబంధీకులుకాదు కాని దగ్గరి స్నేహితులైతే కొంచెం స్వీటు ముక్క లేదా శర్కర నోట్లో వేసుకొని రావచ్చు.
బి.విశ్వం, విజయనగరం (ఆంధ్ర)
ప్ర: శర్మగారూ! నా భార్యకు నా మీద బాగా అనుమానం- ఎప్పుడూ ఏదో ఒక నెపంతో వేధిస్తుంది. ఏం చేయమంటారు?
సమా: మొదట మీభార్యకు మీమీద అనుమానం కలగటానికి కారణం బలమైనదేనా? ఆత్మవిమర్శ చేసుకోండి. అందులో కారణం లేకపోతే యుక్తిగా సమయోచితంగా ఉండండి. ఉద్యోగస్తులైతే ఆఫీసునుండి కనీసం ఏదో ఒక నెపంతో పదిసార్లైనా ఫోను చేయండి. ఇంట్లోనే ఉండేవారైతే ఎక్కువసేపు ఇంట్లోనే ఉండండి. మీకు వచ్చే ప్రతి ఫోన్‌ను ఆమెనే ఎత్తమని చెప్పండి. ఫోన్ చేసినవారు ఆడువారైతే అసలు తీరిక లేదని ఆమెతో చెప్పించండి.
నరేంద్రనాథ్, మచిలీపట్నం, కృష్ణా
ప్ర: సంతాన ప్రశ్న
సమా: సంతానం విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ నంబర్లు చెప్పాలని చాలాసార్లు స్పష్టం చేశాను.
బి.ప్రకాశ్‌రావు, బరంపురం (ఒడిస్సా)
ప్ర: గురువుగారూ! నమస్కారం! నాకు మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది. భవిష్యత్తు ఏమిటి?
సమా: ఏ ఉద్యోగం లేనివానికంటే మీరు మేలు కాదా? అయినా ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగం చెడ్డదిగాకాని చిన్నదిగా కాని ఏమీ కన్పించటంలేదు. చేసేది ఏదైనా శ్రద్ధగా చేయండి. భవిష్యత్తు బాగుంటుంది.
కోట కుమార్, మెట్‌పల్లి (తెలంగాణ)
ప్ర: మా నాన్నగారు, నన్నూ, మా తమ్ముణ్ణి కుటుంబంతో సహా ఇంట్లోనుండి వెళ్లగొట్టారు. మళ్లీ రానిస్తారా?
సమా: ఎదిగి కుటుంబాలు కూడా కలిగివున్న మిమ్మల్ని బయటకు పంపించాడంటే మీరు బాధ్యతారహితంగా ఉన్నారనిపిస్తోంది. పైగా మళ్లీ రానిస్తాడా? అని అడుగుతున్నారంటే మీరింకా ఆయన మీదే ఆధారపడాలనుకుంటున్నారు. స్వతంత్ర వ్యక్తిత్వం అలవరచుకోండి.
తన్నీరు షణ్ముఖ సాయిశ్రీ, లక్ష్మీపురం (ప్రకాశం)
ప్ర: నేను చేసే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందా? చదువు కొనసాగుతుందా?
సమా: చదువు చక్కగా కొనసాగుతుంది. ఉద్యోగం పర్మినెంట్ అనేది ఆ సంస్థ యాజమాన్య విధాన ప్రశ్న-
మీకు వర్తించదు.
ఎమ్.మురళి, మార్తాలి, కర్నాటక
ప్ర: ఉద్యోగం - ఏ దిశలో లభిస్తుంది?
సమా: మీరున్న చోటినుండి తూర్పు దిశ యోగం
కోటిగణపతి, పాలకొల్లు (ప.గో.)
ప్ర: సింగపూర్- మలేషియా- కెనడా- నాకు ఏ దేశం యోగిస్తుంది.
సమా: కెనడా యోగ కారకం- ఆ దిశగా ప్రయత్నం చేయండి. శుభం భవతు.
ఎమ్.శివరాం, యశ్వంత్‌పురా (కర్ణాటక)
ప్ర: వివాహం- ఉద్యోగాభివృద్ధి
సమా: వివాహం మీ కారణంగా ఆలస్యం- ఉద్యోగంలో నవంబర్-డిసెంబర్‌లలో కొంత మంచి మార్పు రాగలదు.
సిహెచ్.అప్పలరాజు - రంగరాజువీధి - వైజాగ్
ప్ర: ఎప్పుడూ అనారోగ్యం- ఆర్థిక బాధలు- స్వగృహయోగం
సమా: అనారోగ్యం ఉదరం- కడుపు భాగం- జీర్ణాశయ బలహీనత- గ్యాస్ట్రిక్ సమస్య- ఆర్థిక సమస్యలు స్వయంకృతం- మీకు స్ర్తి మూలకంగా గృహలాభం- వాయవ్య దిశలో యోగం-
ఆంధోనీ మాధ్యూస్ చందర్‌రావు, విజయవాడ, కృష్ణా
ప్ర: శర్మగారూ! మీరు బైబిల్ కొటేషన్లు కూడా చాలా చక్కగా ఇస్తారు. సమయానికి సరియైనవి మాకు కూడా గుర్తుకురావు. అయితే ప్రార్థన ముందు జ్యోతిషం నిలువదని నా నమ్మకం.
సమా: ప్రభువైన ఏసుక్రీస్తుకు యోహాను బాప్తిస్మం ఇచ్చినపుడు ఏమన్నాడో గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పటికి ఇలాగునే కానిమ్ము- అని లేఖనమందున్నది- నేను లేఖనమును నెరవేర్చుటకే వచ్చితిని కాని- మార్చుటకు కాదు అనలేదా? ఆ లేఖనమే జ్యోతిషం తెలుపుతుంది.
ఎమ్.శ్రీకృష్ణ - అంబర్‌పేట, హైదరాబాద్
ప్ర: గురువుగారూ! మీ భవిష్యకాలం రెగ్యులర్‌గా చదువుతాను. వ్యక్తిగత సమస్యలే కాకుండా దేశ కాల మాన పరిస్థితుల గురించిన ప్రశ్నలకు మీ సమాధానాలు నిజం అయ్యాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గురించి సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పండి.
సమా: సామాన్య పౌరుడిగా మనం కోరవలసింది రాష్ట్రంలోనైనా- కేంద్రంలోనైనా సుస్థిరత- కేంద్ర ప్రభుత్వం సమీప భవిష్యత్తులోనే కాదు సుదూర భవిష్యత్తులో కూడా సుస్థిరంగా ఉంటుంది.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ