క్రేజీ రెడ్డి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగునాట మాత్రమేకాక ఇతర పరిశ్రమల ప్రేక్షకుల్నీ విశేషంగా ఆకట్టుకుంటున్న సినిమా అర్జున్‌రెడ్డి. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం మొదటి రోజు మొదటి షోనుండే సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్లపరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. దీంతో ఇతర పరిశ్రమల నిర్మాతలు అర్జున్‌రెడ్డి రీమేక్ హక్కుల కోసం పోటీపడుతున్నారు. ముందుగా తమిళ హక్కుల్ని హీరో ధను ష్ దక్కించుకోగా, కన్నడ హక్కుల్ని ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ దక్కించుకున్నట్టు సమాచారం. రీమేక్‌లో ఎవరు నటిస్తారు, ఏ దర్శకుడు సినిమాను డైరెక్ట్ చేస్తారు? అనేది ఇం కా తెలియలేదు. ఇక సినిమాలో నటించిన విజయ్ దేవరకొండకు ఓవర్‌నైట్‌లో స్టార్ స్టేటస్ దక్కడం, అతని నటనకు ప్రశంసల వర్షం కురుస్తుండటంతో పలువురు అగ్ర హీరోలు అర్జున్ రెడ్డి పాత్రలో నటించాలని తహతహలాడుతున్నారట.