లావోస్ సినిమాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్తేర్, నోరోన్హా, నోయల్ సేన్, శ్రీమంగం, అర్జున్ ఆనంద్ ప్రధాన తారాగణంగా లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందింది. ఇంకా పేరు పెట్టని చిత్రానికి క్రాంతికుమార్ వడ్లమూడి దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- పూర్తి స్క్రిప్ట్‌తో సినిమాను ప్రారంభించామని, ప్రతి చిన్న ఎలిమెంట్‌ను వదలకుండా తెరకెక్కించామని, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందని, కెమెరా పనితనం ప్రేక్షకుల అంచనాలకు అందకుండా సాగుతుందని తెలిపారు. నేటితో ప్యాచ్‌వర్క్‌తో సహా షూటింగ్ అంతా పూర్తిచేశామని, ప్రస్తుతం డబ్బింగ్, రీరికార్డింగ్, కలర్‌గ్రేడింగ్, విజువల్ ఎఫెక్ట్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, నవంబర్‌లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత శ్రీరామ్ కందుకూరి అన్నారు. త్వరలో పేరును కూడా ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:చేతన్ మధురాంతకం, సంగీతం:గీతా పూనిక్, కథ:లా వోస్ మోషన్ పిక్చర్స్, నిర్మాతలు:రామ్ కేతు, కృష్ణమోహన్, శ్రీరామ్ కందుకూరి, నరేన్ లెబాకు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:క్రాంతికుమార్ వడ్లమూడి.