మంచి సినిమాలే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో పరిశ్రమకు వచ్చినట్టు చెప్పారు వివై బ్యానర్ అధినేత సత్యనారాయణ బొక్క. బ్యానర్ లోగోను దాసరి కుమారుడు అరుణ్‌కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సమర్పకుడు సత్యనారాయణ మాట్లాడుతూ ఏదో ఒకటో రెండో సినిమాలు చేయాలన్న తలంపుతో బ్యానర్‌ను తేలేదు. వరుసగా చిత్రాలను నిర్మించి వివై కంబైన్స్ గుర్తింపు పొందాలన్న ప్యాషనేట్‌తో పరిశ్రమకు వచ్చామని చెప్పారు. అలాగని ఏవేవో సినిమాలు చేసేది లేదని, పిల్లల పెద్దలు కలిసి చూడగలిగే బంధాలు అనుబంధాలకు అర్థంచెప్పే సినిమాలు నిర్మించే ఉద్దేశంతో పరిశ్రమకు వచ్చామని చెప్పారు. మంచి స్క్రిప్ట్ అందించమని దర్శకుడు భానుచందర్ చౌదరిని కోరానట్టు సత్యనారాయణ చెప్పారు. దర్శకుడు భానుచందర్ చౌదరి మాట్లాడుతూ అభిరుచి కలిగిన నిర్మాతలు సినీ పరిశ్రమకు రావడం అవసరం. వివై కంబైన్స్ అధినేత సత్యనారాయణ మంచి స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమని అడిగారన్నారు. టైంబౌండ్ పెట్టకపోవడంతో ఎనిమిది నెలలు స్క్రిప్ట్‌మీదే కష్టపడినట్టు చెప్పారు. అర్ధనారి తరువాత ఇలాంటి ప్యాషనేట్‌తోవున్న నిర్మాణంలో నా తదుపరి చిత్రం ఉండటం సతోషంగా ఉందన్నారు. త్వరలోనే చిత్రాన్ని ప్రారంభిస్తామని, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అప్పుడే ప్రకటిస్తామని తెలిపారు. దాసరి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ మంచి బ్యానర్ లాంఛ్ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని అంటూ, బ్యానర్‌నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకుల మెప్పు పొంది విజయాలు సాధించాలని కోరుకుంటున్నానన్నారు. నిర్మాతలు, దర్శకులకు మంచి పేరు వచ్చి గొప్ప నిర్మాణ సంస్థగా పేరు గడించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిర్మాత హితేష్ బొక్క, భాను తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.