15న సరసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం 3సరసుడు2. శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకాలపై పాండీరాజ్ దర్శకత్వంలో టి.రాజేందర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో శింబు మాట్లాడుతూ- హీరో హీరోయిన్లమధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు రియలిస్టిక్‌గా వుంటాయని, యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు రూపొందించారని తెలిపారు. కురళరసన్ అందించిన ఆడియో ఇప్పటికే సూపర్‌హిట్ అయిందని, ఈనెల 15న అత్యధిక థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామని తెలిపారు. యూత్‌కు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే కథ ఇదని, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మల నటన సినిమాకు హైలెట్‌గా వుంటుందని ఆయన అన్నారు. సినిమాలో ప్రత్యకంగా సత్యం రాజేష్ చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిపారు. తమిళంలో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్ అయిందని, సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, ఒక్కొక్కపాట ఓ వెరైటీగా వుంటుందని నిర్మాత టి.రాజేందర్ అన్నారు. ఈనెల 15న థియేటర్‌లోకి సరసుడు వచ్చి అందరికీ ఆనందాన్నిస్తాడని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం:పాండీరాజ్.