ఉత్తర తెలంగాణ

సాహితీ పురస్కారాలు బాధ్యతను పెంచుతాయ (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ పురస్కారాలు కవులు, రచయితల బాధ్యతను పెంచుతాయని భావించే ప్రముఖ కవయిత్రి డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి రంగారెడ్డి జిల్లాకు చెందినవారు! వృత్తిరీత్యా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేసిన ఆమె రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలుచుకున్నారు. ‘లేఖాసాహిత్యం’పై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పట్టా పొందారు. ‘కావ్యావతారికలలో సాహిత్య విమర్శ’పై పరిశోధన అనుభవమూ ఆమెకుంది. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఆమె ప్రసంగాలు చోటు చేసుకున్నాయి. ఎన్‌ఎస్‌ఎస్ వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొని రాష్ట్ర ఉత్తమ ప్రోగ్రాం అధికారి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుండి అందుకున్నారు. అనేక ప్రముఖ సాహితీ పత్రికల్లో ఆమె రచనలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖకు సహాయ కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. త్వరలో.. మాతృశతకం.. సీతోక్తులు కవితా సంకలనం వెలువరించనున్నారు. సాహిత్య సభలంటే అమితంగా ఇష్టపడే ఆమె పలు అవధాన కార్యక్రమాల్లో పృచ్ఛకురాలిగా పాల్గొన్నారు. మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు వెలువరించిన ‘ఒక విజేత’ గ్రంథంలో సీతాలక్ష్మి గారి రచన చోటు చేసుకుంది. పద్యరచనలో ఆసక్తిని కనబరిచే ఆమెతో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు ఆమె మాటల్లోనే..

ఆ మీ దృష్టిలో వచన కవిత్వం అంటే ఏమిటి?
భావాన్ని సులువుగా చెప్పగలిగే, వ్యక్తం చేసే కవితా ప్రకియ. కవి భావోద్వేగాన్ని తేలికగా చెప్పే ప్రక్రియ.
ఆ మీరు ఎన్నో ఏట రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు?
నా 30వ ఏట రచనా వ్యాసంగాన్ని ప్రారంభించాను.
ఆ మీకు రచనల పట్ల ప్రేరణ ఎలా లభించింది?
నేను శంషాబాద్ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా ఉన్నప్పుడు ఒక దోమ కుట్టింది. చురుక్కుమన్న బాధలో అలవోకగా ఆటవెలది పద్యం నానోట పలికింది. అదీ 1990 సంవత్సరంలో అనుకుంటా. ఉద్యోగ నిర్వహణ, సంసారబాధ్యతల వల్ల రచనలకు దూరంగా ఉన్నాను. తరువాత 1998లో మాడుగుల నాగఫణి శర్మ గారి ద్విశతావధానం, సహస్రావధానంలో, ద్విసహస్రావధానాలలో, మేడసాని మోహన్ గారి పంచ సహస్రావధానంలో పృచ్ఛకురాలిగా పాల్గొని ‘దత్తపది’ అంశం ఇచ్చాను. అయితే నేను కూడా నేను ఇచ్చిన పదాలపైనే పద్యాలు వ్రాశాను. అప్పటి నుండి నాకు ప్రేరణ కలిగి కవిత్వం, పద్యాలు వ్రాయడం తిరిగి ప్రారంభించాను.
ఆ ఇప్పుడు వస్తున్న వచన కవిత్వంపై మీ అభిప్రాయం?
వచన కవిత్వాలు బాగానే వస్తున్నాయి. కవుల భావ స్పందన బాగానే ఉంది. సమకాలీన సమాజంపై అవగాహనతో కవిత్వం బాగా వెలువడుతోందని నా భావన.
ఆ అనుకున్నన్ని పద్యకావ్యాలు నేడు రాకపోవడానికి కారణం?
కవులు తాము అనుకున్న భావాన్ని పద్యంలో బంధించడం కష్టమని భావించొచ్చు. ఛందస్సు పైన పట్టు తక్కువగా ఉందేమోనని నా భావన. పద్యకావ్యాలు రాకపోవడానికి అనాసక్తి కారణం కావచ్చు. భావ ప్రకటన సులభంగా కవిత్వంలో చెప్పుకోగలమనే భావన వల్ల పద్యకావ్యాలు రాశిలో తక్కువేమో అన్పిస్తుంది.
ఆ మీకు నచ్చిన కవులు, రచయితలు?
నాకు నచ్చిన కవి వేమన. సాంఘిక దురాచారాలను ఆనాడే తూర్పారబట్టి ప్రజలకు చేరువగా, సులభంగా, అర్థమయ్యే భాషలో, చక్కగా, తేటతేటగా ఆటవెలది పద్యాల్లో రచించాడు. వేమన నాకు ఆదర్శప్రాయుడు. నేను ఆ బాటలోనే ఆటవెలది పద్యాలు ఎక్కువగా వ్రాశాను. కవితలు వ్రాశాను.
ఆ మీ పరిశోధన గ్రంథం గురించి
రెండు మాటలు చెబుతారా?
వ్యక్తిగతంగా ఉత్తర ప్రత్యుత్తరాలతో ప్రారంభమైన లేఖలు క్రమక్రమంగా సాహిత్యంలో చోటు చేసుకోవడమే కాక ‘లేఖాసాహిత్యం’ గణనీయమైన స్థానాన్ని సంపాదించుకొని ఒక ప్రక్రియగా కొనసాగుతున్నది. నా పరిశోధనాంశం ‘తెలుగులో లేఖాసాహిత్యం’ విశాలమైన పరిధిని కలిగి ఉండడమే కాక లేఖలో స్పృశించిన అంశాలు చాలా ఎక్కువ. సమకాలీన సాంఘిక చరిత్రకు అద్దం పడుతున్నాయన్న భ్రమ కలిగింది. సాంఘీకోద్యమాలు, సాంప్రదాయ విలువల పునరుద్ధరణ, రాజకీయ, ఆర్థిక విషయాల ప్రస్తావన, పరదేశీయుల సాహిత్యం, వారి విమర్శలు మొదలగునవి ఎన్నో విషయాలు, అనువాద లేఖలు కూడా వచ్చాయి. అందువలన విశాలమైన పరిధి గల లేఖాసాహిత్యాన్ని సౌలభ్యం కోసం నేను పరిమితం చేసుకొని అన్ని రంగాలను తనలో కలుపుకున్న లేఖలు పరిశీలించడం కంటే సాహిత్య ప్రాధాన్యత కలిగిన లేఖలు మాత్రమే పరిశీలించాను.
ఆ మారుతున్న సమాజంలో ఇంకా స్ర్తివాద కవిత్వం అసరమని భావిస్తున్నారా?
సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. కాలానుగుణంగా వేష, భాషల్లో కూడా పెనుమార్పులు వచ్చాయి. అయినా మనుషుల మనసుల్లో మాత్రం పెద్ద మార్పు రాలేదనిపిస్తుంది. స్ర్తిపట్ల ఒక న్యూనతాభావం, అబల అనే భావం. స్ర్తిల పట్ల అమానుషత్వం, అమానవీయ సంఘటనలు జరుగుతుండడం రోజు టివి, రేడియోల్లో, పత్రికల్లో చూస్తునే ఉన్నాం. అందువల్ల వారికి భరోసా ఇవ్వడం, చైతన్యం కలిగించేందుకు, ప్రోత్సాహం కలిగించేందుకు ధైర్యం నూరిపోసేందుకు స్ర్తివాద సాహిత్యం అవసరమేనని నా భావన.
ఆ పురుషులను ద్వేషించడం ద్వారా స్ర్తివాద కవిత్వ సృజన జరగాలని
భావిస్తున్నారా?
ఇది తప్పండి. నేను దీనికి సహకరించను. స్ర్తిలు, పురుషులు సమానమే. స్ర్తిపట్ల ఉన్న వివక్ష భావం వల్లనే పుట్టుక నుండి చావు వరకు ఇంకా అణచివేతకు గురి అయినందువలన తనను సమాజంలో ఇంకా చాతగాని దానిలాగా చూడడం వల్లనే స్ర్తివాదం బలపడింది కానీ, తనకు జరిగిన అన్యాయాలకు ఎదిరించడం కోసమే స్ర్తివాదం బయలుదేరింది కాని పురుషులను ద్వేషించడం వల్లకాదు అనేది నా భావన.
ఆ మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే
ఏం చేయాలి?
ఇంకా చాలా విస్తృతంగా పరిశోధన జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, సంస్థలు కూడా వీటికోసం కృషి చేయాలి.

ఆ సాహిత్య పురస్కారాలపై మీ అభిప్రాయం?
కవులకు ఇచ్చే పురస్కారాలు కవులను చైతన్యపరిచేందుకు, ప్రోత్సహించేందుకు పనికివస్తాయని నా భావన. కవుల్లో, రచయితల్లో ఇంకా బాధ్యత పెరిగి మంచి సాహిత్యం వస్తుంది.

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
ప్రాచీన సాహిత్యాన్ని, ప్రస్తుత సాహిత్యాన్ని అవగాహన చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమాజాన్ని, పరిస్థితులను గమనిస్తూ రచనలు చేయాలి. రాశి కోసం కాక వాసికోసం రాయాలి. మంచి రచన ఒకటి అయినా సమాజహితంగా ప్రజల మనస్తత్వంపై చెరగని ముద్ర వేసేట్లు ఉండాలి.
డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి
ప్లాట్.నం.30, ఫేజ్-1
హస్తినాపురం సెంట్రల్
నాగార్జున నగర్ రోడ్, వైశాలినగర్ (పో)
హైదరాబాద్-79
సెల్.నం.9490367383

- దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544