నెల్లూరు

గురుభ్యోనమః (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి జీవితాన్ని మలచే
మహనీయులలో
మూడవస్థానములో నిను నిలిపినా
రక్తసంబంధీకుడు కాని వ్యక్తిగా
మొదటిస్థానం మీది కాక యింకెవరిది?
అయినా వాళ్లు అక్షరం దిద్దించినా
అందులోని మర్మాన్ని తెలిపేది మీరు
అదుపుతప్పని ఆవేశంతో
అదిలించి బెదిరించి లాలించి
మమ్ముల మనుషులుగా మార్చేది మీరు
రక్తాన్ని పంచి ప్రాణమిస్తుంది తల్లి
జ్ఞానాన్ని పెంచి బతుకునిస్తారు మీరు
కన్నతల్లి ఇలలో కనిపించే దైవమైతే
కనకుండానే సంస్కరించే మీరు కారా

దేవుడు
శిష్యుడు గురువును మించితే
గర్వపడతారు మీరు
ఇసుమంత స్వార్థమైనా ఉన్నదా అందులో
బలపం పట్టిచ్చిన బంధువు గురువు
బతుకుబాటకు మార్గదర్శి గురువు
తల్లిదండ్రులకు మించిన దైవం గురువు
నవ్యనాగరితల మోజులోపడి
లాభాపేక్షల కోసం బాధ్యతల మరచి
మొక్కుబడిగా ‘బడు’లను మార్చకండి
మహోన్నతమైన వృత్తికి మచ్చతేకండి
సర్వేపల్లిగారి
అడుగుజాడలలో నడవండి
మా తుదిశ్వాస వీడే వరకు
మా మనసులలో మీరుండాలనే మా ఆశ
మీ ఆశయాలే మా ఊపిరులుగా
మేము బతకాలనే మా ఆకాంక్ష..!
- శింగరాజు శ్రీనివాసరావు
చరవాణి : 9052048706

ఆచార్యదేవోభవ
గురువుమీద గురి వుంటే
విజయమే నీది కాదా విద్యార్థి
అమ్మ కన్న మిన్నరా ఆ గురువు
దేవుడు కన్నా గొప్పవాడు నీ గురువు
గురువు మాట మరువబోకు
ఎప్పటికీ
గురువు బాట విడవబోకు
ఎన్నటికీ
నీ భవిష్యత్తుకు బాటవేసే
నిస్వార్థపు జీవిరా ఆ గురుదేవుడు
గురువేరా కనపించే నీ దేవుడు
కనిపించే నీ దేవున్ని ఒక్కసారి అడుగు
తప్పటడుగు పడితే అప్పుడడుగు
నీవు కార్మికుడైనా, కలెక్టరైనా
ఆ చల్లని దేవుని దీవెనరా
ఆ బాటను ఎన్నడు మరువకురా
ఆ మాటను ఎన్నడు విడవకురా
ఆ దేవున్ని ఎన్నడూ మరువకురా
- హిమజ్ఞాన
చరవాణి : 9966236894

పైసా
డబ్బుల్లేకుండా బతకడమెలాగ
డబ్బు లేనప్పుడు
ఎండిపోయిన ఇంద్రధనస్సులా
వుంటుంది బతుకు
ఒక నిండు జీవితాన్ని నిర్మించుకోవడానికి
వైద్యశాలలో తెగిపడుతున్న శ్వాసల్ని
మరలా అతికించుకోవడానికి
బతకడానికి అనుభవం లేకున్నా
ధైర్యంగా బతికిపోవడానికి డబ్బుకావాలి
మెలకువతో బతుకు కరచాలనం

చేయగానే
అందరికీ డబ్బు గురించి శోధన

మొదలవుతుంది
పాల ప్యాకెట్టుతో మొదలై
చివరికంతా మరణించారని
తెలుసుకున్నాక కూడా
డబ్బు అవసరం వెంటాడుతూనే వుంటుంది

డబ్బు గురించిన సంభాషణలు
నవ్వుతూ మొదలైపోయాక
డబ్బవసరముందని తెలపాల్సి వస్తే
ఒక నిస్సహాయ ఆత్మ విషాదాన్ని

ప్రకటిస్తుంది
మూడున్నర నిమిషాల ప్రేమని
డబ్బు పెట్టి కొనుక్కున్నాక
మట్టి పూతల్ని రాల్చుకున్న ముఖాలు
లాంతర్ల వెలుగుల మధ్య
అద్భుతంగా వేదాంతిస్తూ పోతాయి
కూలిన రాత్రుళ్లనీ
చెరిగిపోయిన పగళ్లనీ
డబ్బుతో నిర్మించలేమేమో గానీ
మనం వెతుక్కుంటున్న ప్రపంచాన్ని
మనదిగా చేసుకోవడానికి డబ్బుకావాలి

డబ్బుతో కవిత్వం నిర్మించలేమేమో గానీ
కవిత్వాన్ని అక్షరంగా మల్చి
పుస్తకంగా ఆవిష్కరించడానికి

డబ్బుకావాలి
డబ్బుల్లేకుండా బతకడమెలాగ?
ఆకలిదప్పికలు లేని వాళ్లెవరయినా ఉంటే
వాళ్లు డబ్బుల్లేకుండా బతికిపోతారు
పోనీ
డబ్బుల్లేకుండా బతికిపోవడమెలాగో
మీకు తెల్సా?
- ఎస్‌కె.ఖాదర్‌షరీఫ్
చరవాణి : 9441938140

కల్పతరువై.....
ఎక్కాలను చక్కగా వల్లె వేయించి
లెక్కలకు బాటలను వేసినారు
చిక్కులు చాటిపోయేలా చేసినారు....

అక్షరాలను దీక్షగా దిద్దించుతూ
పదాలను పొందికగా పలికించారు
జీవన వాక్యాన్ని లౌక్యంగా
రాయించారు...

పాఠాలను పాటవంగా వివరిస్తూ
గణపాఠాన్ని పాటల్లా పాడించారు
గెలుపకై అలుపులేక ఆడించారు...

ప్రశ్నలు జవాబులు బట్టీ పట్టించక
అధ్యాయాల్ని అధ్యయనం
చేయించారు
సాధ్యాసాధ్యాల పయనం
చూపించారు...

శతక పద్యాలతో నీతి సూత్రాలతో
బాల్యం నుండే సద్భావ బీజాలు నాటారు
యవ్వనంలో
ఆశయ రాగాలు మీటారు...

ఉద్యోగమే ధ్యేయంగా
వెంపర్లాడద్దని
విద్యతోపాటు విలువల్ని పెంచినారు
ఆత్మవిశ్వాస వలువల్ని
అందించారు...

సత్యమైన విషయాల సృష్టికర్తగా
నిత్యమైన విశేషాల స్థితిస్ఫూర్తిగా
మూర్త్భీవించిన త్రిమూర్తుల దీప్తిగా
గురువై కల్పతరువై తీర్చిదిద్దారు
అర్థవంత సార్థక జీవితమిచ్చారు
అక్షరాల సాక్షిగా నిక్షిప్తమయ్యారు...

మరువలేని వాత్సల్యం కురిపించిన
ఉపాధ్యాయులారా!
అందుకోండి ప్రణామాలు
ఆజన్మాంతం పరిమళం చిందే
ప్రసూనాలు
మీ ఆశీస్సులే నా తేజస్సుకు
ప్రమాణాలు...
- బొగ్గరపు రాధాకృష్ణమూర్తి, నెల్లూరు
చరవాణి: 9885481939

గురువులకు
నీరాజనాలు
త్రిమూర్తులకు ప్రతిరూపాలైన
గురుదేవులూ! శతసహస్ర
వందనాలు
మీరే మా పాలిటి ఇలవేల్పులు
నవసమాజ రూపశిల్పులు
సభ్యత, సంస్కారాలతో కూడిన
భావి సమాజానికి పునాదులు
అ.. ఆ..లను దిద్దించి,
అజ్ఞానము తొలగించి
బతుకుకు బంగారుబాట
వేసినారు
క్రమశిక్షణ, సత్సీలములను
మాతృభాషలో, బోధించి
ప్రేమతో దరిజేర్చి - శిష్యునిలో
నిగూఢమై - నిద్రాణమైన
మానసిక
జీవచైతన్యాన్ని - జాగృతం చేస్తారు
అక్షరాలనే మీరు లక్షలుగా భావించి
జ్ఞాన జ్యోతిని వెలిగించి
సమత, మమత,
మానవతాభావాలను
చక్కగా బోధించి
లోకకల్యాణాన్ని కాంక్షిస్తారు
బడి అనే ఉద్యానవనంలో
విద్యార్థులనెడి
బహురకాల మొక్కలకు
విద్యయనెడి నీరు పోసి
వికసింపజేసినారు
విజ్ఞాన పరిమళాలు
వెదజల్లినారు
మీ గురుస్థానం
అమూల్యం
మహోతృష్టం
మహిమాన్వితం
అందుకనే శిష్యుల గుండెల్లో
కలకాలం
యశోభూషణులై
విరాజిల్లుతున్న
ఆచార్యులూ!
ఉపాధ్యాయ దినోత్సవం
సందర్భంగా
అందుకోండి మీ శిష్యకోటి
సమర్పించు
ప్రేమామృత నీరాజనాలు..!
- కొడవలూరు ప్రసాదరావు, చరవాణి :
8500757622