రివ్యూ

పోస్టర్.. చిరిగిపోయంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * పోస్టర్ బాయ్స్
తారాగణం: సన్ని డియోల్, బాబీ డియోల్, శ్రేయాస్ తల్పడె, సోనాలీ కులకర్ణి తదితరులు
సంగీతం: తనిష్క్ బాగ్చి
సినిమాటోగ్రఫీ: నిగం బొమ్జన్
ఎడిటింగ్: దేవేంద్ర ముద్దేశ్వర్
నిర్మాత, దర్శకత్వం: శ్రేయాస్ తల్పడె
ఓ పది నిమిషాల స్క్రిప్ట్‌ని పాతిక ఎపిసోడ్లకు సాగదీయటం టీవీ సీరియళ్లలో సాధ్యమవుతుందేమో గానీ.. సినిమాకి పనికిరాదు అనే వారెవరైనా ఉంటే.. ఈ సినిమాని ఉదాహరణగా ప్రకటించవచ్చు. చెప్పిన జోక్‌నే మళ్లీ మళ్లీ చెప్పి ఏడిపించటం కూడా ఈ సినిమాలో హాస్యానికి పరాకాష్ఠ. ఐడియా వరకూ ఓకే. ‘పోస్టర్’ ఆధారం దొరికితే చాలదుగా. దానికి తగ్గ స్క్రిప్ట్ ఉండాలి. కామెడీ ట్రాక్‌తో కథని ముడిపెడితే సరిపోదు. ఇటు జోక్స్.. అటు స్క్రిప్ట్ రెండూ సమాంతరంగా నడుస్తూ వెళ్లాలి. ఇలా - ఈ ‘పోస్టర్’కి అనేకానేక అవరోధాలు అడ్డంకులూ.
స్కూల్ టీచర్ వినయ్ శర్మ (బాబీ డియోల్), అర్జున్ సింగ్ (శ్రేయాస్ తల్పడె), జాగ్వార్ చౌదరి (సన్ని డియోల్) ఒకే ఊరి వాళ్లు. ఒకానొక శుభ సందర్భంలో - జాగ్వార్ చౌదరి సోదరి నిశ్చితార్థం ఆగిపోతుంది. అర్జున్ సింగ్ ఎంగేజ్‌మెంట్ కూడా. వినయ్ శర్మ భార్య పుట్టింటికి వెళ్లి విడాకులకు నోటీసు పంపిస్తుంది. ఉన్నట్టుండి వీళ్లందరూ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఈ ముగ్గురికీ అర్థంకాదు. ఎట్టకేలకు తేలిన అంశం ఏమిటంటే -ఊళ్లో ‘వేసెక్టమీ’ పోస్టర్లు వెలుస్తాయి. పోస్టర్లపై ఆ ముగ్గురూ దర్శనమిస్తారు. దీంతో ఖంగు తినటం వారి వంతవుతుంది. ఊళ్లోనూ ఇళ్లల్లోనూ గొడవలు మొదలవుతాయి. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ఊరి వారంతా వీళ్లని ‘పోస్టర్ బాయ్స్’గా పిలవటం మొదలుపెడతారు. తమ జీవితాల్లో ఇంతటి కల్లోలాన్ని సృష్టించిన ఆ ‘పోస్టర్’ సృష్టికర్త ఎవరో అనే్వషించటానికి ముగ్గురూ బయల్దేరతారు. దీనికి మూల కారకుడైన ఫొటోగ్రాఫర్‌ని పట్టుకొంటారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ గతంలో ఈ ముగ్గురి ఫొటోలను తీసుకొంటుంది రికార్డుల రీత్యా. రికార్డుల మాటేమోగానీ.. చివరాఖరికి ఇలా పోస్టర్లపై కనిపించి జీవితాన్ని కోల్పోయామని వాపోకుండా.. తమ అమాయకత్వాన్ని నిరూపించుకొనే ప్రయత్నం ఏ విధంగా చేశారన్నది క్లైమాక్స్.
2014లో రిలీజైన మరాఠీ చిత్రానికి ఇది రీమేక్. ఇది ఒక యధార్థ సంఘటనకు ఆధారం. స్క్రిప్ట్‌ని ఎంత పక్బందీగా రూపొందించామని చెప్పుకొన్నప్పటికీ.. జోక్ వెంట జోక్‌లు వేసుకొంటూ వెళ్లినప్పటికీ.. స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగటంతో సినిమా ‘సా...గుతూన్నట్టు’ అనిపిస్తుంది. కథ కూడా వీసమెత్తు బయటికి కదలదు. అక్కడ్నుంచీ ఏ దిక్కూ దివాళం ఉండదు.
ఐతే -కాస్తంత కుదురుగా సీట్‌లో కూర్చుని ‘ఆ ముగ్గురి’ ఆవేదనని అర్థం చేసుకొంటే మాత్రం -నిజానికి చక్కటి స్క్రిప్ట్. పోస్టర్ బాయ్స్‌గా సన్ని, బాబీ, శ్రేయాస్ తమ పరిధి మేరకు ఆయా పాత్రల్లో జీవించారు. ఇటు ఉద్విగ్నభరిత సన్నివేశాల్లోనూ.. అటు హాస్య సన్నివేశాల్లోనూ మంచి టైమింగ్‌ని పాటించటమే కాదు.. వారి వేదనని ప్రేక్షకులక్కూడా కలిగేట్టు చేయగలిగారు. బాబీ డియోల్ మొబైల్ రింగ్‌టోన్ ‘సోల్జర్ సోల్జర్ మీఠీ బాఁతే బోల్కర్’ అని రావటం.. అతడి ‘సోల్జర్’ సినిమాని జ్ఞప్తికి తెస్తుంది. ‘ఓయె హోయె ఖుదియా..’ పాట వినసొంపుగా ఉంది. మిగతా పాటలన్నీ సన్నివేశ పరంగా లేకండా అక్కడక్కడ జొప్పించినవిగా అనిపిస్తాయి.

-బిఎనే్క