సబ్ ఫీచర్

పూల మొక్కల్ని ఎలా పెంచుకోవాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా మనం పూల చెట్లను అందం, పరిమళం కోసం పెంచుతుంటాం. ఇంటిముందు ఎక్కువ స్థలం ఉన్నవారు ఓ చిన్న మోస్తరు పూదోటను పెంచితే, ఫ్లాట్స్‌లో నివసించేవారు తమకు లభ్యమయ్యే ప్రదేశంలో పూలకుండీలు పెట్టి పూలను పూయిస్తారు. రకరకాల రంగులతో పూచే ఆ పుష్పాలలో కొన్నింటిని జడలో తురుముకుని మురిసిపోయే స్ర్తిలు, మిగిలిన పూలను ఇదివరకటిలా అలా వాటిని వదిలివేయక తమ ఇంట్లో అలంకరించి, ఇంటికి కొత్త అందాలను చేకూర్చే ప్రయత్నం చేస్తుంటారు. కన్నులకింపైన పూల మొక్కలను ఎంచుకుని పెంచటం ఒక కళ అయితే.. అలా పూచినవాటిని ఫ్లవర్‌వేజ్‌లో చూపరులను ఆకట్టుకునేట్లు అలంకరించటం ఓ కళ. పూలతో ఇంటిని అలంకరించాలనుకోవాలనుకుంటే మొదటగా పూచే మొక్కలను గురించి తెలుసుకోవటం అత్యంత అవసరం. పూచే మొక్కలను గమనించినపుడు, కొన్ని ప్రత్యేకమైన సీజన్‌లో మాత్రమే పుష్పిస్తాయి. మరికొన్ని సంవత్సరానికి రెండుసార్లు, ఇంకొన్ని సంవత్సరం పొడవునా పుష్పిస్తూనే వుంటాయి. అదేవిధంగా పరిసర వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి పూచే మొక్కల పెరుగుదల ఉంటుంది. పూలకోసం మొక్కలను పెంచేముందు అవి పూచే సీజన్లను దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా సీజన్లను దృష్టిలో పెట్టుకుని మొక్కలను పెంచటంవల్ల సంవత్సరం పొడవునా పూలు లభ్యమయ్యే అవకాశం వుంది. ఉదాహరణకు ఎండాకాలంలో పూచే మల్లె, సన్నజాజి, చామంతి, రోజా, సంపెంగ.. వానాకాలంలో పూచే టైగర్ లిల్లీ, వెరోనికా, చలికాలంలో బంతి, డిసెంబర్ పూలు, నందివర్థనం, రోజ్‌మేరీ వంటి పుష్పాలను పెంచటంవల్ల సంవత్సరం పొడవునా పుష్పాలు లభ్యమయ్యే అవకాశం వుంది.