Others

నమ్మినబంటుకు అమ్మలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వాసానికి మారుపేరు శునకం. యజమాని రక్షణ కోసం పరితపించే మూగజీవి అది. అది బాగా ఉన్నంతకాలం ముద్దుగా చూసుకునే యజమానులు అవి అనారోగ్యానికి గురైతే వదిలించుకుంటున్నారు. వీధుల్లో వదిలేస్తున్నారు. అలా వ్యాధులతో వీధుల్లో తిరుగుతున్న శునకాలను చేరదీసి వాటికి చికిత్స అందేలా చేస్తోంది ఓ యువతి. ఇలాంటి జబ్బుపడ్డ కుక్కలకు సేవలందించాలంటే మంచి మనసు ఉండాలి. శృతి దరక్ అలాంటి మనసున్న మనిషి.
కాలేజీ స్టూడెంట్స్ అంటే కబుర్లుతో కాలక్షేపం చేస్తుంటారని అనుకుంటాం. కాని పీజీ విద్యార్థి అయిన శృతిని చూస్తే అది పొరపాటు అనిపిస్తుంది. వీధిలో ఏ కుక్క బాధతో మొరిగినా శృతి మనసు విలవిలలాడుతుంది. అరుపును బట్టి వాటి బాధను అర్థం చేసుకుంటుంది.
పగ్లి నేర్పిన పాఠం..
ఓ రోజు పగ్లి జాతికి చెందిన పప్పిని ఎవరో వీధిలో వదిలేశారు. దానికి శరీరం అంతా గజ్జి. దీంతో యజమానులు దాన్ని వదిలించుకున్నారు. నెల రోజులు అది వీధుల వెంట తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. అది తినలేదు.
నడవలేదు. కనీసం ముఖాన్ని కూడా కదిలించలేని స్థితిలో ఉంది. ఆ పప్పీ వయసు ఎనిమిది నెలలు మాత్రమే. ఎవరో ఈ పప్పీ గురించి శృతికి చెప్పారు. వెంటనే దాన్ని ఇంటికి తీసుకు వచ్చింది. శుభ్రంగా దానికి మందులతో స్నానం చేయించింది. మరణానికి చేరువైన ఆ బుజ్జి కుక్కపిల్ల ఇపుడు కోలుకున్నది. అలా పగ్గి నేర్పిన పాఠమే ఆమెలో సేవాదృక్పధాన్ని తట్టిలేపింది. ఇలా పెంపుడు కుక్కలకు జబ్బుచేస్తే నిర్దాక్షిణ్యంగా వదిలేయటం చూసి శృతికి బాధ కలిగించింది. తాను చదువుకుంటూనే ఇలాంటి జబ్బుపడిన కుక్కలకు సేవ చేయాలని నిశ్చయించుకుంది. వెంటనే ఇందుకోసం ఆన్‌లైన్‌లో నిధుల సేకరణకు ఉపక్రమించింది. శృతి చేస్తున్న మంచి పనికి స్పందన కూడా బాగానే వచ్చింది. ఈ నిధులతో జబ్బుపడిన కుక్కలను చేరదీస్తుంది. చీదరించుకోకుండా వాటికి సేవలు చేస్తుంది. వాటికి వసతి, ఆహారం, మందులు అందిస్తుంది. దాదాపు ఇలాంటి ఇరవై కుక్కలు శృతిదరక్ సేవలకు కోలుకుని చలాకీగా ఆడుకుంటున్నాయి.