పాటల్లో మహానుభావుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న చిత్రం 3మహానుభావుడు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 16న చిత్రంలోని పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- ఆస్ట్రేలియా, ఇటలీ, క్రొయేషియా లాంటి దేశాల్లో, అలాగే పొలాచ్చి, ఫిలింసిటీ, హైదరాబాద్‌లోని పలు అందమైన లొకేషన్‌లలో చిత్రాన్ని పూర్తిచేశామని, విజయదశమి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటలను ఈనెల 16న విడుదల చేయనున్నారు. మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా:నిజార్ షఫి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వంశీ ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.