అందరికీ నచ్చే కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్, నాగశౌర్య, నమిత ప్రసాద్, నందితా రాజ్ ప్రధాన పాత్రలో మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన కథలో రాజకుమారి చిత్రం ఈనెల 15న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా దర్శకుడు మహేష్ సూరపనేని చెప్పిన విశేషాలు.. రోహిత్ పూర్తిస్థాయి విలన్‌గా కనిపిస్తాడు. ఆ తరువాత అతను పాజిటివ్ దృక్పథంతో ఎలా మారాడు అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. నారా రోహిత్ పాత్ర అద్భుతంగా ఉం టుంది. అలాగే నాగశౌర్య, నందితా రాజ్‌లు కూడా కీలకపాత్రలు పోషించారు. ఒక అద్భుతమైన కథను చిన్న చిన్న ట్విస్టులతో రన్ అవుతుంది. అసలు ఈ కథలో రాజకుమారి ఎవరు ఏమిటనేది సినిమా చూసి తెలుసుకోవాలి. చిత్రీకరణ అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా సంగీతం, ఫొటోగ్రఫి హైలెట్‌గా నిలుస్తాయి. ఇప్పటికే పాటలకు మంచి స్పందన రావడంతో ఆనందంగా వుంది. ఇందులో మొత్తం ఏడు సాంగ్స్ ఉంటాయి. ఇళయరాజాతో హీరోయిన్ ఇంట్రడొక్షన్ సాంగ్ కంపోజ్ చేయించాను. మిగిలిన పాటలను విశాల్ చంద్రశేఖర్ అం దించారు. సినిమాపై చాలా నమ్మకం ఉంది. ఈ సినిమా తరువాత రెండు కథలు చర్చల్లో ఉన్నాయి. ఇక నా గురించి చెప్పాలంటే మాది విజయవాడ, ఇంజనీరింగ్ వరకు అక్కడే చదివాను. యు.ఎస్‌లో మాస్టర్ డిగ్రీ చేశాను. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను. తేజా దగ్గర నీకు నాకు డాష్ డాష్ సినిమాకు పనిచేశాను. తరువాత పరుచూరి వెంకటేశ్వరరావు, కోన వెంకట్‌ల దగ్గర పనిచేశాను. గత రెండేళ్లుగా వైజయంతి బ్యానర్‌తో కలిసి ప్రయాణిస్తున్నాను. వారి బ్యానర్‌లో రెండు మూడు యాడ్స్ కూడా చేశాను.