నాడి పట్టేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సొట్టబుగ్గల తాప్సీకి సౌత్‌లో ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా కెరీర్ పరంగా సరైన విజయం మాత్రం దక్కలేదు. ఈమె అందాల ప్రదర్శనకు అవకాశాలైతే క్యూ కట్టాయి కానీ విజయం మాత్రం అందనంత దూరంలో ఆగిపోయింది. దాంతో ఇక్కడ లాభం లేదనుకుని బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడ పింక్, నామ్ షబానా, బేబి లాంటి సినిమాలతో నటిగా మంచి ఇమేజ్ తెచ్చుకుంది. కానీ ఆమె అనుకున్నట్టు హీరోయిన్‌గా మాత్రం క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. దాంతో ఇలా అయితే లాభం లేదనుకుందో ఏమో, తాజాగా జుడువా-2 సినిమాలో వచ్చిన అవకాశాన్ని పట్టేసి క్రేజీ హీరోయిన్‌గా మారేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా బికినీలు, లిప్‌లాక్‌లు అంటూ నానా హంగామా చేసింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌లో తాప్సీ రెచ్చిపోవడం చూసి షాక్ అయ్యారు బాలీవుడ్ జనాలు. మొత్తానికి స్టార్ హీరోయిన్‌గా మారాలంటే ఏం చేయాలో తెలుసుకున్నట్టుంది. అందుకే ఇకపై బికినీలు గట్రా చేయడానికి రెడీ అంటోంది. మరి జుడువా-2లో ఈమె అందాలు ఓ రేంజ్‌లో ఆరబోసిందని బాలీవుడ్ టాక్.