అబ్బాయ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్, నిఖిలా విమల్ జంటగా ప్రజిత్ దర్శకత్వంలో జాహ్నవి ఫిలింస్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన మేడమీది అబ్బాయి చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ- ప్రేక్షకులు సినిమాను చక్కగా ఆదరిస్తున్నారు. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది అన్నారు. హైపర్ ఆది మాట్లాడుతూ- చాలా రోజుల తరువాత నరేష్ సెటిల్డ్ నటన కనబరిచాడు. ఆద్యంతం కామెడీతో నవ్వించే సినిమా ఇది. సోషల్ మీడియాలో ఎలాంటి వ్యక్తులు మోసం చేస్తారో తెలియజేసే సినిమా ఇది. మంచి మెసేజ్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు. అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ- ఇదొక విభిన్నమైన సినిమా. కొత్త కానె్సప్ట్ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అందుకే ఈ సినిమా. స్లోపాయిజన్‌లా సక్సెస్ సాధించింది అన్నారు. నరేష్ మాట్లాడుతూ- ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్ఫూప్‌లు లేకుండా కథలో పాత్రలు, సన్నివేశాలపరంగా వుండే కామెడీని చేశానని, అందరూ అభినందిస్తున్నారు. సైబర్ క్రైమ్ ద్వారా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో తెలియజెప్పిన సినిమా ఇది. నిర్మాత చంద్రశేఖర్ పెట్టుకున్న నమ్మకం నిజమైంది. పరిశ్రమకు మరింతమంది నిర్మాతలు రావాలి అన్నారు.