పవన్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా పాటలని విదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలవడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. దాంతోపాటు భారీ బడ్జెట్‌తో తెరెకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత భారీ ధరకు తీసుకున్నాడట. బాహుబలి తరువాత ఆ రేంజ్‌లో ఎక్కువ మొత్తం పెట్టి తీసుకున్న హక్కులు ఇవే కావడం విశేషం. 2018 జనవరి 10న విడుదలవుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. కీర్తి సురేష్, అను ఇమాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. కుష్బూ, బోమన్ ఇరానీ కీలక పాత్రలో నటిస్తున్నారు.