అరుదైన ఫీట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజంగా తెలుగు పరిశ్రమలో హీరోలు ప్రతిభ వున్న వారైతే దాదాపు అరవై డెబ్భై సంవత్సరాల వయసు వచ్చే వరకు హీరోలుగానే నటించడం దృష్టాంతాలు మనకు తెలుసు. మార్కెట్ విలువను బట్టి హీరోలకు వద్దన్నాగానీ అవకాశాలు వస్తునే వుంటాయి. అలా గత తరంలో ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, నటశేఖర కృష్ణ నటించారు. ఇప్పుడు వస్తున్న తరంలో ఎందరు ఆ స్థాయికి చేరుకుంటారో కాలం చెబుతుంది. హీరోల సంగతి పక్కనపెడితే హీరోయిన్లు దాదాపు పది పదిహేనేళ్ల కెరీర్‌ను కొనసాగించారంటే గ్రేట్‌గానే చెప్పుకోవాలి. కొంతమంది తారలు ఇలా వచ్చి రెండు మూడు చిత్రాల్లో కనిపించి అలా వెళ్లిపోయినవారు ఎందరో వున్నారు. వారందరిదీ ఒక ఎత్తు. పాత తరాన్ని కొత్త తరానికి వారధిగా కొందరు హీరోయిన్లు నటించారు. ఉదాహరణకి అప్పట్లో శ్రీదేవిని చెప్పుకునేవారు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, కృష్ణలకు కూతురిగా, మనవరాలిగా నటించిన శ్రీదేవి తరువాత వారి సరసన హీరో యన్‌గా నటించి మెప్పించడమే కా దు, రికార్డులూ సృష్టించింది. తర్వా త నాగేశ్వరరావు తనయుడు నాగార్జున సరసన కూడా నటించి రికార్డు నెలకొల్పింది. తండ్రీ కొడుకుల సరసన హీరోయిన్‌గా నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అటువంటి అరుదైన రికార్డు తనకు సొంతమైందని అప్ప ట్లో శ్రీదేవి స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. తండ్రి సరసన హీరోయిన్‌గా నటించాక కొడు కు సరసన హీరోయిన్‌గా నటించడం అనేది పాతఫీట్. ఇప్పుడు కొత్తగా కథానాయకలు కొత్త ఫీట్‌ను చేసేశారు. వారిలో కాజల్, లావణ్యత్రిపాఠీ కనిపిస్తున్నారు. వీరిద్దరి అరుదైన ఫీట్ ఏంటం టే? తనయుల సరసన నటించాక, తర్వాత తండ్రుల సరసన హీరోయిన్లుగా నటించడం! సహజంగా సీనియర్ హీరో సరసన నటించాక ఆ హీరోయిన్‌కు యువ హీరోల సరసన అవకాశాలు రావు. కాజల్ కూడా ఖైదీ నెంబర్ 150లో నటించడానికి ముందు ఈ విషయానే్న చాలా ఆలోచించిందట. యువ హీరోల సరసన అవకాశాలు రాకపోతే కెరీర్ ముగిసిపోతుందన్న భయం ఆమె ను వెంటాడింది. అయితే ఆమె ప్రతిభవల్ల మళ్లీ అవకాశాలు యువ హీరోల సరసన వస్తున్నా యి. ఉదాహరణకు నేనేరాజు నేనే మంత్రి చిత్రంలో రా నా సరసన నటించి మెప్పించింది. అప్పట్లో మగధీర చిత్రంలో రామ్‌చరణ్ సరసన నటించిన ఈ అందాల చందమామ చిరంజీవి సరసన కూడా మెప్పించింది. అలాగే లావణ్యత్రిపాఠి సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన నటించింది. ఆ సినిమా విజయవంతం కూడా అయింది. ఆ తర్వాత లావణ్య త్రిపాఠికి అవకాశాలు దాగుడుమూతలాడినా ఇప్పుడు తాజాగా అక్కినేని నాగచైతన్య సరసన నటించిన యుద్ధం శరణం చిత్రం సిద్ధమైంది. ఇలా తండ్రుల సరసన నటించి తర్వాత తనయులకు హీరోయిన్లుగా మెప్పించడం అనేది ప్రస్తుతం అరుదైన ఫీట్‌గా టాలీవుడ్‌లో కనిపిస్తోంది. ఇంకా ఎందరు ఇటువంటి ఫీట్స్ చేసి మెప్పిస్తారో వేచి చూడాల్సిందే!

-శేఖర్