సబ్ ఫీచర్

జాతీయ సమైక్యతా చిహ్నం హిందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ భాష మనుగడలో వుండాలన్నా, దాని ప్రయోగం, వాడకం అత్యంత ఆవశ్యకం. అప్పుడే భాష ప్రకాశిస్తుంది. భారతదేశం విభిన్న భాషలు మాట్లాడేవారికి నిలయం. కానీ మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న భాష హిందీ. తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాత్ వంటి ఎన్నో ప్రాంతీయ భాషలున్నాయి. ప్రతి దేశానికి అంతటికీ ఒక జాతీయ భాష అవసరం వుంటుంది. ప్రపంచం మొత్తంలో కేవలం మన దేశం మాత్రమే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తన భాషను కాదని పరాయి భాషలో పాలన చేస్తున్నది. అందుకే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం దీన్ని గురించి చర్చించి మన దేశానికి జాతీయ భాషగా ‘హిందీ’ని గుర్తించింది. వాదోపవాదాల అనంతరం 1949 సెప్టెంబర్ 14ను హిందీని అధికార భాషగా గుర్తించారు. ఆనాటి నుంచి ఈ రోజును ‘హిందీ దివస్’గా జరుపుకుంటున్నారు. జనవరి 26, 1950లో రాజ్యాంగంలోని 343 (1) అధికరణాన్ని అనుసరించి భారతీయ రాజభాష (అధికార భాష) హిందీ అని, దాని లిపి ‘దేవనాగరి’ అని స్వీకరించారు. ప్రస్తుతం అధికార కార్యకలాపాలు చాలావరకు కేంద్ర స్థాయిలో హిందీలోనే జరుగుతున్నాయి. అయితే అప్పట్లో దేశంలో అధికారిక అవసరాలకు ఆంగ్లమే ప్రాతిపదికగా ఉంటుందని, పదిహేనేళ్లపాటు అదే పరిస్థితి కొనసాగుతుందని, రాజ్యాంగసభ ప్రత్యేక నిబంధన రూపొందించింది. 1965 వరకూ ఆంగ్లాన్ని సహ భాషగా వుంచాలని నిర్ణయించారు. ఈ 75 ఏళ్ల కాలంలో హిందీ పరిపూర్ణంగా ఎదగాలనీ, దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఇలా నిర్ణయించారు. హిందీనే రాష్ట్ర భాషగా ఎంచుకోవడానికి కారణం దేశ ప్రజలందరినీ ఏకం చేసే శక్తి హిందీకి మాత్రం వుంది. మొత్తం భారతీయులలో 60 శాతం మంది ప్రజల మాతృభాష హిందీనే కనుక, కానీ జాతీయ భాషగా హిందీని అంగీకరిస్తే మాతృభాషపై దాని ప్రభావం పడుతుందన్న భయమూ దక్షిణాది రాష్ట్రాలవారిని వెంటాడుతోంది. కానీ దశాబ్దాల క్రితమే కొఠారీ కమిషన్ (1964-66) తమ నివేదికలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రథమ భాషగా ప్రాంతీయ భాషను, ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఆంగ్లాన్ని తప్పక బోధించాలని చెప్పింది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల్లోను ఏదో ఒక స్థాయిలో హిందీ కొనసాగుతోంది. అందుకే జాతీయ సమైక్యతకు త్రిభాషా సూత్రం మనకు ఎంతో అవసరం. హిందీ వ్యాప్తి కొరకు హిందీ ప్రచారసభ, దక్షిణభారత హిందీ ప్రచారసభ లాంటి సంస్థలు దేశంలో విశేష కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా తన వంతుగా కృషి చేస్తున్నప్పటికీ మన దేశంలో హిందీకి సరైన గౌరవం లభించడం లేదు. అధికార భాషగా ఆంగ్లమే చలామణి అవుతున్నది. హిందీ భాషా ప్రాధాన్యతను అందరికీ తెలియజేయడానికి హిందీ దివస్ జరుపుకుంటున్నారు. 490 మిలియన్ల ప్రజలు ఈ భాషను మాట్లాడుతున్నారు. ప్రపంచ భాషల్లో రెండవ స్థానాన్ని పొందగా, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పది భాషల్లో హిందీకి స్థానం దక్కడం ఎంతో గర్వకారణం.
భారత్‌లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్తాన్ రాష్ట్రాల ప్రజల మాతృ భాష హిందీయే. హిందీ సులభంగా నేర్చుకోవచ్చును. అంతేగాక ఫిజీలో వారి అధికారిక భాషలో హిందీని ఒకటిగా చేర్చారు. 18 దేశాలలో, వందల విశ్వవిద్యాలయాలలో హిందీ మాట్లాడేవారు, కోర్సులు వున్నాయి.
త్రిభాషా సూత్రం ఎందుకు?
మన దేశంలో ఎన్నో భాషలు మాట్లాడే ప్రజలు వుండడంవల్ల ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోవడంవలన ప్రజల అవసరాల కోసం మరియు పాలనా సౌలభ్యం కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాలు 1956లో ఏర్పడ్డాయి. ప్రజలు విహారయాత్రలు తదితర పనులపై ఇతర రాష్ట్రాలకు వెళ్లినపుడు అక్కడి భాష వారికి అర్థం కాదు కనుక విధిగా అందరికీ తెలిసిన భాష హిందీ అవసరం కనుక హిందీ, ఇంగ్లీషు భాషలు నేర్చుకుంటే ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది వుండదని త్రిభాషా సూత్రాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందుకే జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపిన హిందీ భాష దోహద పడినందున గాంధీజీ హిందీని జాతీయ భాషగా గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో హిందీ భాష కీలకమైంది. హిందీని నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికివెళ్లినా భాష సమస్య లేకుండా జీవించవచ్చు.
ఉత్తర, దక్షిణాది ప్రజల మధ్య భాష వ్యక్తీకరణకు హిందీ భాష వారధి లాంటిది. అందుకే అన్ని పాఠశాలల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి. మూడవ తరగతి నుంచే హిందీని నేర్పించాలి. హిందీ పండితుల పోస్టుల్ని భర్తీ చేయాలి. అపుడే జాతీయ భాషగా హిందీ తప్పక అన్ని ప్రాంతాల్లో ప్రకాశించగలదని ఆశిద్దాం.

-కె.రామ్మోహన్‌రావు