Others

ఉపాధ్యాయుడు నిపుణుడు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపాధ్యాయునికి మెదడుకు, మేధస్సుకు ఉండే తేడా తెలియాలి. బ్రెయిన్ అండ్ మైండ్ ఈ రెండూ వేరు వేరు. బ్రెయిన్ పెరగదు. మేధస్సు పెరుగుతుంది. ఉపాధ్యాయుడు తన శ్రమవలన, తన సంకల్పంవలన పునశ్చరణ వలన మేధస్సును పెంచుతాడు. అదే విద్యార్థి జ్ఞాన సముపార్జనలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వేలాది కంప్యూటర్‌ల సమూహమే మన మెదడు. దానిలో కేవలం 10 శాతం వరకు మాత్రమే వాడుకుంటున్నాం. ఒక ధాతువును సుత్తితో కొడితే అది వంగుతుంది. కాని విరగదు. అదేవిధంగా ఉపాధ్యాయుడు తన బోధన అనే సుత్తితో విద్యార్థి మెదడును నిత్యం సంఘర్షించే విధంగా చేస్తాడు. ఈ ప్రక్రియ అనేది బిల్డింగ్ ది కల్చర్ ఆఫ్ మైండ్ అంటాం. దీనివల్ల మెదడు కల్చర్‌ను పెంచడం జరుగుతుంది. సున్నితమైన ప్రక్రియవలన విద్యార్థి అచీవ్‌మెంట్ పెరుగుతుంది. బోధన లక్ష్యం విద్యార్థి మేధస్సు కల్చర్‌ను పెంచడం జరగాలి. ఆ బోధన 40 మంది విద్యార్థుల మేధస్సుపై 40 రకాలుగా పడుతుంది. ఇలా విద్యార్థుల మేధస్సులో జరిగే క్రియను ఇంటిలిజెన్స్ అంటారు. కొంత మందిలో తొందరగా మేధస్సు ఏర్పడుతుం ది. కొందరితో చదివిస్తారు. కొందరితో చెప్పిస్తారు. ఇలా చేయడం ద్వారా వచ్చేదాన్ని ఇంద్రియజ్ఞానం అంటారు. కొన్నిసార్లు నవ్విస్తారు, కవ్విస్తారు. కొన్నిసార్లు ప్రేరేపింపజేస్తారు. అందరికీ ఒకే పద్ధతి రానంత మాత్రాన నిరాశపడకూడదు. తన చాతుర్యాన్ని ఉపయోగించి పిల్లలందరిలో కూడా మేధస్సును నిర్మిస్తే అప్పుడు బోధకుడు గురువు అవుతాడు. గురువు అనే వ్యక్తి గొప్ప ఇంజనీర్. ఒక టెక్నిక్ ద్వారా రాకుంటే ఇంకొక టెక్నిక్ ఉపయోగిస్తాడు. విద్యార్థి మేధస్సు నిర్మాణంలో గురువు పాత్ర చాలా సున్నితమైనది. దానికి దీక్ష కావాలి. ఉపాధ్యాయుడు బోధనలో ఏకాగ్రతగా వ్యవహరిస్తే ఏ విద్యార్థిపై ఏ రకమైన బోధన చేయవచ్చుననే పద్ధతులు తెలుస్తాయి. ఉపాధ్యాయుడు నైపుణ్యంగలవాడైతే తరగతి గది అంత పుష్టికరమైన కంప్యూటర్‌గా తయారవుతుంది.
తరగతి కెమిస్ట్రీయే మారింది
తరగతి గది ప్రభావం సమాజంమీద ఎంత తీవ్రంగా పడిందో ఎన్ని ఉద్యమాలకు కారణభూతమైందో మనకు అర్థమైపోతుంది. వెనకటి తరగతి గది ప్రభావం సంపన్నవర్గాల ఉద్యోగులకు కారణభూతమైతే ఈనాడు అణగారిన వర్గాల చైతన్యానికి కారణభూతమవుతోంది. ఆనాడు 20వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవానికి చేయూత ఇస్తే, 21వ శతాబ్దంలో సామాజిక విప్లవానికి, సాంస్కృతిక విప్లవానికి దోహదపడింది. కుటుంబ వ్యవస్థ మారిపోయింది. ఆనాడు ఆడపిల్లలను కుటుంబ భారం అనుకుంటే, ఈనాడు కుటుంబ ఎదుగుదలకే అనగా ఆర్థిక వ్యవస్థ విలాస వస్తువులమీద జరిగితే ఈనాడు ప్రాథమిక అవసరాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. తరగతి గది ప్రభావం ఈనాడు మార్జినలైజ్ సెక్షన్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ఈనాడు చదువు శరణ్యమనుకుంటున్నారు. తరగతి గది కెమిస్ట్రీయే పూర్తిగా మారిపోయింది.

-చుక్కా రామయ్య