బిజినెస్

ఐఫోన్ 8 ధర రూ. 64,000 ఐఫోన్ ఎక్స్ ధర రూ. 89,000

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: యాపిల్ నూతనోత్పత్తుల ప్రేమికులకు శుభవార్త. ఐఫోన్ 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ స్మార్ట్ఫోన్లు దేశీయ మార్కెట్‌లో 64,000 రూపాయల నుంచి లభించనున్నాయి. మంగళవారం రాత్రి అమెరికాలో ఈ కొత్త యాపిల్ ఉత్పత్తులను సంస్థ సిఇఒ టిమ్ కుక్ మార్కెట్‌కు పరిచయం చేసినది తెలిసిందే. ఈ క్రమంలో యాపిల్ ఇండియా వివరాల ప్రకారం ఈ నెల 29 నుంచి ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు యాపిల్ అధీకృత డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. 64జిబి, 256జిబి వేరియంట్లలో లభించే ఈ ఫోన్ల ప్రారంభ ధర 64,000 రూపాయలని ఓ ప్రకటనలో బుధవారం తెలిపింది. సామ్‌సంగ్, ఎల్‌జి తదితర సంస్థలకు మార్కెట్‌లో గట్టి పోటీనిస్తూ ఈ నూతన ఐఫోన్‌లను యాపిల్ తీసుకురాగా, భారతీయ మార్కెట్‌లో అదికూడా ఈ పండగ సీజన్‌లో సాధ్యమైనంత ఎక్కువగా అమ్మకాలను దక్కించుకోవడమే లక్ష్యంగా యాపిల్ ఇండియా ముందుకెళ్తోంది.
ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో మొదటి స్థానంలో ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం సామ్‌సంగ్ ఇప్పటికే తమ గెలాక్సీ సిరీస్‌లో నోట్ 8ను పరిచయం చేసినది తెలిసిందే. దీని ధర 67,900 రూపాయలు. ఈ నెల 21 నుంచి మార్కెట్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 8, 8 ప్లస్ ధరలను 64,000 రూపాయల నుంచే యాపిల్ ప్రకటించడం గమనార్హం. ఇకపోతే ఐఫోన్ పరిచయమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఐఫోన్ ఎక్స్‌ను ప్రత్యేకంగా తెచ్చింది యాపిల్. 64జిబి, 256జిబి సామర్థ్యాల్లో లభించే ఈ ఫోన్ భారతీయ మార్కెట్‌లో 89,000 రూపాయల నుంచి దొరుకుతుందని యాపిల్ ఇండియా తెలిపింది. నవంబర్ 3 నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. ఫేస్ రికగ్నిషన్, సూపర్ రెటీనా డిస్‌ప్లే వంటి అత్యాధునిక సౌకర్యాలు దీని సొంతం. ప్రపంచ టెక్నాలజీ రంగంలో అద్భుతాలు సృష్టిస్తూ మ్యాక్ కంప్యూటర్, ఐప్యాడ్‌లను ఆవిష్కరించిన యాపిల్ సంస్థ.. ఐఫోన్‌ను ముందుకు తీసుకురాగా, గడచిన పదేళ్లలో ఇవి 120 కోట్లకుపైగా అమ్ముడైపోయాయి. ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో రెండో స్థానంలో ఉన్న యాపిల్.. మంగళవారం రాత్రి కూపర్టినోలోగల నూతన యాపిల్ క్యాంపస్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్ వద్ద ఈ కొత్త యాపిల్ ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఐఫోన్‌లతోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 3 ఉత్పత్తులను టిమ్ కుక్ విడుదల చేశారు. యాపిల్ వాచ్ సిరీస్ 3 ఉత్పత్తులు ఈ నెల 22 నుంచి అందుబాటులో ఉంటాయ.
ఐఫోన్ ధరల తగ్గింపు
మరోవైపు తమ కస్టమర్లకు యాపిల్ సంస్థ పండగ కానుకనిచ్చింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్మార్ట్ఫోన్ల ధరలను 8,300 రూపాయల మేర తగ్గించింది. మార్కెట్‌లో సామ్‌సంగ్ నుంచి గట్టి పోటీ ఎదురువుతున్న క్రమంలో దాన్ని అంతే స్థాయలో ఎదుర్కొనేందుకే యాపిల్ ధరల తగ్గింపునకు దిగింది. ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ మార్కెట్ భారతే. అందుకే ఇక్కడ పట్టు సాధించేందుకు అటు సామ్‌సంగ్, ఇటు యాపిల్ రెండూ తీవ్రంగా శ్రమిస్తున్నాయ. పోటాపోటీగా కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తున్నాయ.