బిజినెస్

మూడేళ్లలో 30 కోట్ల ఖాతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: జన్ ధన్ యోజనలో భాగంగా 30 కోట్ల కుటుంబాలకు బ్యాంక్ ఖాతాలు లభించాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన జన్ ధన్ యోజన పథకం.. అందరికీ బ్యాంకింగ్ సేవలు అనే లక్ష్యంతో వచ్చినట్లు గుర్తుచేశారు. బుధవారం ఇక్కడ ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ.. జన్ ధన్ యోజన పథకం రాకముందు దాదాపు 42 శాతం గృహస్తులకు బ్యాంక్ ఖాతాలు లేవని చెప్పారు. అలాంటి వారందరికి ఇప్పుడు జీరో-బ్యాలెన్స్ ఖాతాలు దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకుల్లో ఉన్నాయని, ఇది జన్ ధన్ యోజన పథకం వల్లే సాధ్యమైందని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని గృహస్తులు 99 శాతం బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నారని వివరించారు. ఇందుకు జన్ ధన్ యోజన పథకానికి ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇక జన్ ధన్ యోజన ఖాతాలు జీరో-బ్యాలెన్స్‌వే అయినప్పటికీ, మొదట్లో 77 శాతంగా ఉన్న జీరో-బ్యాలెన్స్ ఖాతాలు.. ప్రస్తుతం 20 శాతానికి తగ్గాయని జైట్లీ ఈ సందర్భంగా అన్నారు. నగదు బదిలీ విధానం విస్తరిస్తే ఈ 20 శాతం ఖాతాల్లోనూ డబ్బులుంటాయని, అప్పుడు జీరో-బ్యాలెన్స్ ఖాతాలే ఉండవని పేర్కొన్నారు. ఇకపోతే గత యుపిఎ ప్రభుత్వం ఆధార్ సంఖ్యను పరిచయం చేసిందని, అయితే దానికి చట్టబద్ధత లేదని, దాన్ని తాము కల్పిస్తున్నామని జైట్లీ చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి ఆధార్‌ను తప్పనిసరి చేయడం అనేది రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్న పరీక్షకు బిజెపి ప్రభుత్వం తట్టుకుని నిలబడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
చిత్రం.. ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌పై మాట్లాడుతున్న జైట్లీ