క్రీడాభూమి

విజయవాడలో రెండు టెస్టులు.. విశాఖపట్నంలో ఐదు వనే్డలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 13: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు బిసిసిఐ రెండు ప్రతిష్ఠాత్మకమైన సిరీస్‌ల నిర్వహణకు అనుమతి ఇచ్చినట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. బుధవారం నగరంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 23నుండి 26వతేదీ వరకు భారత్ ఎ జట్టుతో న్యూజిలాండ్ ఎ జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్, సెప్టెంబర్ 30వతేదీ నుండి అక్టోబర్ 3వతేదీ వరకు రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుందన్నారు. ఈరెండు టెస్ట్ మ్యాచ్‌లు విజయవాడ సమీపంలోని మూలపాడులో దేవినేని వెంకటరమణ, ప్రణీత క్రికెట్ గ్రౌండ్స్‌లో జరుగుతాయన్నారు. విశాఖపట్నంలోని వైఎస్‌ఆర్ ఎసిఎ విడిసిఎ క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 6, 8, 10, 13, 15 తేదీల్లో ఇరు జట్లు వనే్డ మ్యాచ్‌లు ఆడతాయని పేర్కొన్నారు. కాగా, ఈనెల 20వతేదీ విజయవాడకు న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు చేరుకుంటుందని తెలిపారు. మూలపాడు గ్రౌండ్‌కు రెండు అంతర్జాతీయ టెస్టు టెస్టులను నిర్వహిచించే అవకాశం రావడం ఎంతో గర్వకారణమన్నారు. ఇదే మైదానంలో గతంలో భారత్, వెస్టిండీస్ మహిళా జట్ల సిరీస్ నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అంతర్జాతీయ స్థాయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే స్థాయ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. ఏర్పాట్లు దాదాపు పూర్తయనట్టు తెలిపారు. ఆంధ్ర నుండి హనుమ విహారీ, హైదరాబాద్ నుండి మహ్మద్ సిరాజ్‌లు భారత్ ‘ఎ’ జట్టులో ఉన్నారని ఆయన అన్నారు.