క్రీడాభూమి

మెస్సీ డబుల్ జువెంటాస్‌పై బార్సిలోనా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, సెప్టెంబర్ 13: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా జువెంటాస్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా స్టార్ లియోనెల్ మెస్సీ రెండు గోల్స్ చేసి, తన జట్టు 3-0 తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. అయితే, ప్రథమార్ధం ముగియడానికి కొన్ని క్షణాల ముందు మెస్సీ చక్కటి గోల్ చేసి, బార్సిలోనా ఖాతాను తెరిచాడు. అత్యధిక పారితోషికంపై బార్సిలోనాకు వచ్చిన 20 ఏళ్ల ఫ్రెంచ్ ఆటగాడు ఒస్మాన్ డెంబెల్ ఇచ్చిన పాస్‌ను అందుకొని, మెస్సీ విజయవంతంగా గోల్ చేశాడు. ద్వితీయార్ధంలో బార్సిలోనా దాడులకు ఉపక్రమించగా, జువెంటాస్ ఆత్మరక్షణలో పడింది. 56వ నిమిషంలో ఇవాన్ రాకిటిక్ ద్వారా బార్సిలోనాకు గోల్ లభించగా, మరో 10 నిమిషాల తర్వాత మెస్సీ తన రెండో గోల్ చేశాడు. ఆతర్వాత గోల్స్ నమోదు కాలేదు. కాగా, చాంపియన్స్ లీగ్‌లో మెస్సీ 100 గోల్స్ మైలురాయికి చేరువయ్యాడు. ఇతని ఖాతా లో ఇప్పటికి 96 గోల్స్ చేరాయి. ఈ సీజన్‌లో అతను వంద గో ల్స్‌ను సులభంగానే అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది.
బాసెల్‌ను ఓడించిన మాంచెస్టర్ యునైటెడ్
మాంచెస్టర్: చాంపియన్స్ లీగ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ 3-0 తేడాతో బాసెల్‌ను ఓడించింది. గాయపడిన పాల్ పోగ్బా స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా వచ్చిన మరోన్ ఫెలైనీ 35వ నిమిషంలో చేసిన గోల్‌తో మాంచెస్టర్ యునైటెడ్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఆతర్వాత మార్కస్ రాష్‌ఫోర్డ్, రొమెలూ లుకాకూ ద్వారా ఆ జట్టుకు మరో రెండు గోల్స్ లభించాయి. బాసెల్ గోల్స్ చేయలేకపోయంది.
పిఎస్‌జి చేతిలో సెల్టిక్ చిత్తు
గ్లాస్గో: పారిస్ జెయింట్ జర్మెయిన్ (పిఎస్‌జి) చేతిలో సెల్టిక్ చిత్తయింది. ఇటీవలే బార్సిలోనా నుంచి రికార్డు ధరతో పిఎస్‌జికి వెళ్లిన నేమార్‌తోపాటు స్టార్ ఆటగాళ్లు కిలియన్ మాపే, ఎడిసన్ కవానీ కీలక గోల్స్ చేశారు. ఎంఎన్‌సిగా పిలిచే ఈ ముగ్గురూ విజృంభించడంతో పిఎస్‌జి 5-0 తేడాతో తిరుగులేని విజయాన్ని సాధించింది. మిఖయిల్ లస్టింగ్, లీ గ్రిఫిత్స్ చెరొక గోల్ చేశారు.