జాతీయ వార్తలు

తెలుగు నిబంధనకు ఉపరాష్టప్రతి అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: మాతృభాష తెలుగుకు ప్రాముఖ్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అభినందనలు తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తప్పనిసరిగా తెలుగు చదవాలన్న నిబంధనను స్వాగతిస్తూ బుధవారం ఉపరాష్టప్రతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషలతో మాతృభాష తెలుగు ప్రథమంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆమలు చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలుగు భాష రానివారితో ఏ భాషలోనైనా మాట్లాడవచ్చని, మాతృభాష తెలుగు వాడుక భాషగా మాట్లాడటం మన కర్తవ్యమని స్పష్టం చేశారు.