అంతర్జాతీయం

రోహింగ్యాలకు మద్దతుగా నిలవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగోన్, సెప్టెంబర్ 13: మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలకు మద్దతుగా నిలవాలని అల్‌ఖైదా మిలిటెంట్లు ప్రపంచ దేశాల్లోని ముస్లింలకు పిలుపునిచ్చారు. అంతేకాదు మయన్మార్ ప్రభుత్వం నేరాలకు తగిన శిక్ష తప్పనదని కూడా హెచ్చరించరు. మయన్మార్‌లోని తోటి ముస్లింలను ఆర్థిక సాయం, ఆయుధాలు, మిలిటరీ మద్దతుతో ఆదుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు విజ్ఞప్తి చేస్తూ ఈ మిలిటెంట్ గ్రూపు బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘మా సోదర ముస్లింలకు ఎదురైన దుర్భర పరిస్థితికి తగిన శిక్ష లేకుండా పోరాదు’ అని ఆ ప్రకటన పేర్కొన్నట్లు స్వచ్ఛంద సంస్థ ‘సైట్’ తెలిపింది. ‘మా ముస్లిం సోదరులు ఎలాంటి బాధలను చవి చూశారో మయన్మార్ ప్రభుత్వం కూడా అలాంటి బాధలనే చవిచూసేలా చేయాలి’ అని కూడా అల్‌ఖైదా ఆ ప్రకటనలో పేర్కొంది. ‘తమ సోదర ముస్లింలకు సాయపడడం కోసం మయన్మార్‌కు తరలి వెళ్లాలని’ అని అల్‌ఖైదా ఆ ప్రకటనలో పేర్కొంది.