జాతీయ వార్తలు

రోజువారీ రివిజన్‌లో జోక్యం చేసుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: గత జూలైనుంచి పెట్రోలు, డీజిలు ధరలు 7 రూపాయలకు పైగా పెరిగినప్పటికీ పెట్రోలు, డీజిలు ధరల రోజువారీ సవరణలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ సంస్కరణ కొనసాగుతుందని కూడా తేల్చి చెప్పారు. అయితే గత జూలై 3నుంచి నిరంతరంగా పెరుగుతున్న పెట్రో ధరల కారణంగా ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించడానికి పన్నుల్లో కోత విధించే విషయంపై మంత్రి ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. వినియోగదారుల అవసరాలతో పాటు భారీ ఎత్తున చేపడుతున్న వౌలిక సదుపాయాలు, సామాజిక పథకాలకు నిధులను ప్రభుత్వం సమకూర్చుకోవలసిన అవసరముందని ఆయన అన్నారు. దేశంలో పెట్రో అవసరాల్లో 80 శాతానికి పైగా మన దేశం దిగుమతులపైనే ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. అందువల్ల 2002 ఏప్రిల్‌నుంచి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు సమానంగా పెట్రో ఉత్పత్తుల ధరల్లో మార్పులు చేస్తూ వస్తున్నారు. గతంలో ఈ ధరలు ప్రతి 15 రోజులకోసారి మారుతూ ఉండేవి. అయితే గత జూన్ 16నుంచి వీటి ధరలు ప్రతి రోజూ మారుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గితే దాని ప్రయోజనం తక్షణం వినియోగదారులకు లభిస్తుందని, అంతేకాకుండా ధరలు పెరిగినప్పుడు వాటి ధరలు ఒకే సారి భారీగా పెరగకుండా కొద్దికొద్దిగా పెరిగేలా చేస్తుందని ప్రధాన్ చెప్పారు. ‘చమురు కంపెనీల రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. మహా అయితే చమురు కంపెనీల కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపర్చడానికి మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకొంటుంది’ అని బుధవారం ఇక్కడ చమురు కంపెనీల అధినేతల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి చెప్పారు. ధరలు భారీగా పెరిగిన కారణంగా రోజూ ధరల సవరణను ఆపేయాలని ప్రభుత్వం అనుకొంటోందా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రధాన్ ఈ విషయం చెప్పారు.
అమెరికాలో హరికేన్‌లులాంటి కారణాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయని ప్రధాన్ అంటూ, అయితే ఈ ధరలు తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు. వరసగా సంభవించిన హరికేన్ల కారణంగా అమెరికా రిఫైనరీ సామర్థ్యంలో 13 శాతం మూతపడిందని ఆయన చెప్పారు. ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుందా అని అడగ్గా, దానిపై నిర్ణయం తీసుకోవలసింది ఆర్థిక శాఖ అని మంత్రి చెప్తూ, అయితే అభివృద్ధిపరమైన అవసరాలు, వినియోగదారుల ఆకాంక్షలకు మధ్య ప్రభుత్వం సమతౌల్యతను పాటించాల్సిన అవసరం ఉందనేది మాత్రం స్పష్టం అని న్నారు. ‘్భరీ హైవేలు, రోడ్ల ప్రాజెక్టులు, రైల్వే ఆధునీకరణ, విస్తరణ, గ్రామీణ పారిశుద్ధ్యం, తాగునీరు, ప్రాథమిక ఆరోగ్యం, విద్య లాంటి వాటికి భారీగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ నిధుల కేటాయింపులు సైతం గణనీయంగా పెరిగాయి. వీటన్నిటికీ నిధులు ఎక్కడినుంచి తేవాలి?’ అని ప్రధాన్ ప్రశ్నించారు.