రాష్ట్రీయం

సాంకేతిక సప్తగిరులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 13: తిరుపతిలో నిర్మించతలపెట్టిన సైన్సు సిటీలో ఏడు మ్యూజియాలను ఏర్పాటు చేయాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. అవి మరో సప్తగిరులుగా ప్రఖ్యాతి గాంచేలా డిజైన్లు రూపొందించాలని సిఎం ఆకాంక్షించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో పోర్టులు, విమానాశ్రయాలు, పవర్ ప్రాజెక్టులు, గ్యాస్ పైపులైను ఏర్పాటు, ఫైబర్ నెట్ వంటి వౌలిక సదుపాయాల కల్పనపై బుధవారం సమీక్ష నిర్వహించారు. సైన్సు సిటీలో ఇండోర్ రెయిన్ ఫారెస్టు, బయోడైవర్సిటీ మ్యూజియం, ఎవల్యూషన్, ఆంత్రోపాలజీ, ఆర్ట్సు సైన్స్, చిల్డ్రన్, ప్లానిటోరియం, మీడియా మ్యూజియం, ఎయిర్‌స్పేస్, డిఫెన్సు మ్యూజియం, ట్రాన్స్‌పోర్టు మ్యూజియం ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో వౌలిక వసతుల కల్పన శరవేగంగా సాగినప్పుడే అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కర్నూలు జిల్లా గనిశకునాలలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద అల్ట్రా మెగా సోలార్ పార్క్ సహా, అనంతపురం జిల్లా ఎన్‌పి కుంట, తాడిపత్రి, కడప జిల్లాలోని గాలివీడు, మైలవరంలో నెలకొల్పుతున్న అల్ట్రా మెగా సోలార్ పార్కులు పురోగతిని అధికారులు సిఎంకు వివరించారు. గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల్లో అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఎదురు చూస్తున్నామని, విశాఖ విమానాశ్రయంలో కార్గో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన 2,502 ఎకరాలకు గాను 2,210 ఎకరాల భూసేకరణ పూర్తయ్యిందని చెప్పా రు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గన్నవరం, రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో రెండో రన్‌వే ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే రహదారిలో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. అనంతపురంలో ఏర్పాటు చేయదలచిన ఎనర్జీ యూనివర్శిటీ, కాకినాడలో ఏర్పాటు చేయనున్న లాజిస్టిక్ యూనివర్శిటీలపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఎపి ఫైబర్ ప్రాజెక్టు ప్రారంభించాలని స్పష్టం చేశారు. అక్టోబర్ నాటికి లక్ష ఐపిటివి సెట్‌టాప్ బాక్సులు అందుబాటులోకి తెస్తామని, 2018 మార్చి నాటికి 9.40 లక్షల బాక్సులను సిద్ధం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఈ ఏడాది పోర్టులకు పెరిగిన రద్దీ, ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 8 శాతం వృద్ధి నమోదు వివరించారు. రాష్ట్రంలోని విమానాశ్రయాలకు ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు.
చిత్రం.. వజ్రాకృతిలో ఉన్న అసెంబ్లీ డిజైన్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి బాబు