రాష్ట్రీయం

తెలంగాణ, ఆంధ్రకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: వర్షాకాలం తుది దశకు చేరింది. వర్షాలతో కృష్ణా బేసిన్ జలాశయాలు నిండుతాయనుకున్న భ్రమలు పటాపంచలయ్యాయి. అరకొరగా వచ్చిన 30 టిఎంసి నీటి కోసం తెలుగు రాష్ట్రాలు మంచినీటి అవసరాల కోసం పంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్ పరిస్థితి. ఇక ఆశంతా అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే తుపాన్లపైనే. కృష్ణా బేసిన్ ఎగువ రాష్ట్రాల్లో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు-3వ దశలో భాగంగా ఆయకట్టు విస్తీర్ణాన్ని విస్తరించేందుకు కర్నాటక రాష్ట్రం శ్రీకారం చుట్టడంతో రానున్న రోజుల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల ఆయకట్టు ప్రమాదంలో పడింది. ఈ ఏడాదికి ఒకటే ఇలా జరిగిందనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆల్మట్టి, నారాయణ్‌పూర్ ప్రాజెక్టుల కింద కొత్తగా అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజి-3 కింద 13.26 లక్షల ఎకరాల ఆయకట్టును విస్తరించేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. పై నుంచి వరద నీటి ప్రవాహం రాని పక్షంలో ఎడారి అంటే ఎలా ఉంటుందో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను చూస్తే తెలుస్తుంది. కనీసం మంచి నీటికి కూడా నీటి లభ్యత లేదు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 30 మున్సిపాలిటీలు, వందల సంఖ్యలో గ్రామ పంచాయితీలు మంచినీటి కోసం నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లపై ఆధారపడి ఉన్నాయి. దీని కోసం కనీసం 70 టిఎంసి నీరు అవసరం. కాని ఈసారి ఇంతవరకు పట్టుమని 30 టిఎంసి నీరు కూడా రాలేదు. ఈ ఏడాది ఆల్మట్టి, నారాయణ్‌పూర్ నుంచి జూరాల మీదుగా కేవలం 25 టిఎంసి నీరు వచ్చింది. మిగిలిన ఐదు టిఎంసి నీరు స్ధానిక వర్షాల వల్ల శ్రీశైలంకు చేరింది. ఆల్మట్టి కెపాసిటీ 128 టిఎంసి అయితే, ఈసారి 188 టిఎంసి నీరు చేరింది. దాదాపు 50 టిఎంసి నీటిని తన రాష్ట్ర పరిధిలోని ఆయకట్టుకు కర్నాటక విడుదల చేసింది. కృష్ణా జలాల ట్రిబ్యునల్-2 తుది కేటాయింపులను ఖరారు చేయకుండానే, కర్నాటక ప్రభుత్వం తన ప్రణాళికను అమలు చేయడం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు శాపంగా మారింది. 13లక్షల కొత్త ఆయకట్టుకు కనీసం 130 టిఎంసి నీటిని వినియోగించుకునేందుకు కర్నాటక ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బెల్గావి, బాగల్‌కోట్ జిల్లాల్లో లిఫ్ట్ స్కీంల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ లిఫ్ట్ స్కీంల కింద 1.3 లక్షల ఎకరాల ఆయకట్టును సాగు చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆయకట్టు కోసం మరో ఐదు టిఎంసి నీటిని వినియోగించుకోనున్నారు. అప్పర్ కృష్ణా బేసిన్-3 అమలుకు పర్యావరణ అనుమతులు లభించాల్సి ఉంది. దీనికి సంబంధించి విధి విధానాలను కర్నాటక పూర్తి చేసింది.
నాగార్జునసాగర్ కింద తెలంగాణలో 6.6 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ఏడాది ఖరీఫ్‌కు నీరు ఇవ్వలేదు. సాగర్‌లోకి కేవలం 5 టిఎంసి నీరు మాత్రమే వచ్చింది.
ప్రస్తుతం శ్రీశైలంలో బుధవారానికి 49.58 టిఎంసి నీరు చేరింది. నీటి మట్టం 830 అడుగులు ఉంది. నాగార్జునసాగర్‌లో 116.10 టిఎంసినీరు ఉంది. నీటి మట్టం 500.50 అడుగులు ఉంది. శ్రీశైలంకు 37772 క్యూసెక్కులు నీరు చేరుతుండగా, కరెంటు ఉత్పత్తి చేసి దిగువకు 13952 క్యూసెక్కుల నీటిని తెలంగాణ వదులుతోంది.