రాష్ట్రీయం

పత్తి రైతుకు ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణలో పత్తిపంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. బుధవారం జరిగిన మంత్రివర్గ బృందం సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను మార్కెటింగ్ మంత్రి టి. హరీష్‌రావు ప్రకటించారు. 2017-18 సంవత్సరానికి పత్తి (లాంగ్‌స్టెపుల్) ఎంఎస్‌పి క్వింటాల్‌కు 4,320 రూపాయలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఈ ధర 4,160 రూపాయలుగా ఉండేది. దేశంలో పత్తిపంట విస్తీర్ణంలో మహారాష్ట్ర 42.03 లక్షల హెక్టార్లతో మొదటిస్థానంలో ఉండగా, 26.33 లక్షల హెక్టార్లతో గుజరాత్ రెండోస్థానంలో, 18.61 లక్షల హెక్టార్లతో తెలంగాణ మూడోస్థానంలో ఉన్నదని హరీష్‌రావు తెలిపారు. 5.64 లక్షల హెక్టార్లతో ఆంధ్రప్రదేశ్ ఆరోస్థానంలో నిలుస్తోందన్నారు. దేశం మొత్తంలో పత్తి పంట విస్తీర్ణం 120.98 లక్షల హెక్టార్లుగా ఉందని, ప్రపంచంలో అత్యధికంగా పత్తి ఉత్పత్తిచేసే దేశంగా భారత్‌కు పేరువచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌లో సాగైన మొత్తం విస్తీర్ణం 37.39 లక్షల హెక్టార్లుకాగా, కేవలం పత్తి ఒక్కటే 49.77 శాతం విస్తీర్ణంలో (18.61 లక్షల హెక్టార్లు) ఉందన్నారు. ఈ పంట నల్లగొండ, నాగర్‌కర్నూలు, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఉందని మంత్రి వివరించారు.
142 కొనుగోలు కేంద్రాలు
పత్తి కొనుగోలుకు ఈ ఏడాది రాష్టవ్య్రాప్తంగా 143 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ఏడాది కేవలం 92 కేంద్రాలే ఉండటంతో రైతులు పత్తి అమ్మేందుకు ఇక్కట్లను ఎదుర్కొన్నారని, అందువల్ల రైతులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచామన్నారు. వారానికి ఆరురోజుల పాటు ఈ కేంద్రాలు పనిచేస్తాయని, రైతులు పెద్దపెద్ద క్యూలైన్లలో నిలబడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తక్షణమే పరిష్కరించేందుకు రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులను డిప్యూట్ చేశామన్నారు. ఇలా ఉండగా పత్తికొనుగోలు కేంద్రాలు కాకుండా రైతుల నుండి పత్తికొనుగోలుకోసం 301 జిన్నింగ్ మిల్లులు కూడా పనిచేస్తున్నాయని మంత్రి వివరించారు. పత్తి విక్రయించేందుకు రైతుల పేరుతో మధ్యదళారులు మార్కెట్లోకి రాకుండా చూసేందుకు బార్‌కోడ్ కలిగిన గుర్తింపు కార్డులనురైతులకు ఇచ్చామని మంత్రి తెలిపారు. రైతు సమగ్ర సర్వే సమాచారం ప్రకారమే గుర్తింపు కార్డులు మార్కెటింగ్ శాఖద్వారా జారీ చేస్తున్నామన్నారు. ఒకవేళ బార్‌కోడ్ కలిగిన గుర్తింపుకార్డు రైతుకు లభించని పక్షంలో సంబంధిత ఎఇఓ (వ్యవసాయ విస్తరణ అధికారి) సదరు రైతు పట్టేదారా, కౌలురైతా తెలియచేస్తూ సర్ట్ఫికెట్ ఇస్తారని వివరించారు. అవసరమైతే కొత్తకార్డులను ప్రింట్ చేసేందుకు జిల్లా కలెక్టర్లకు అవసరమైన నిధులు ఇచ్చామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. గుర్తింపు కార్డులపై రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయని వివరించారు. పత్తికొనుగోలుకు సంబంధించి భారత పత్తి సంస్థ (సిసిఐ) అవసరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు.
పత్తికొనుగోలు కేంద్రాల గురించి రైతుల్లో అవగాహన కల్పించేందుకు, చైతన్యం చేసేందుకు పోస్టర్లు, కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని హరీష్‌రావు తెలిపారు. కొనుగోలుకు సంబంధించి పర్యవేక్షణ చేసేందుకు జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ఒక కమిటీ, రాష్టస్థ్రాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా మరొక కమిటీని నియమించామన్నారు.