రాష్ట్రీయం

ప్రియుడే.. హంతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని చాందిని హత్య సంచలనం సృష్టించింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ (17) హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. ఆమె స్కూల్‌మేట్, ప్రియుడిగా భావిస్తున్న సాయికిరణ్‌రెడ్డి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలంటూ చాందిని ఒత్తిడి చేయడం వల్లే సాయికిరణ్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బుధవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య వివరాలు వెల్లడిం చారు. మియాపూర్‌వాసి కిషోర్ జైన్ కుమార్తె చాందిని (17) బాచుపల్లిలోని సిల్వర్ ఓక్స్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈనెల 9న కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన చాందిని, సాయంత్రం తన స్నేహితుల ఇంటికి వెళ్లొస్తానంటూ వెళ్లింది. తిరిగి రాలేదు. 10న చాందిని సోదరి నివేదిత జైన్ (20) మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్, కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే స్కూల్ మేట్ సాయికిరణ్ రెడ్డి మాత్రం మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి చాందిని గురించి తనకేమి తెలియదని చెప్పాడు. తరువాతి రోజు సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల్లో బాలిక మృతదేహం పడివున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. మృతురాలు చాందినిగా గుర్తించారు. చాందిని స్కూల్‌మేట్ సాయికిరణ్‌తో నాలుగేళ్ల పరిచయం ప్రేమగా మారింది. అయితే చాందిని తనను కాదని, మరో ఇద్దరితో సన్నిహితంగా ఉంటుందని, ఎలాగైనా వదులుకోవాలని సాయికిరణ్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. ఈక్రమంలో చాందిని తరచూ ఫోన్ చేస్తూ పెళ్లికి ఒత్తిడి తెచ్చింది. దీంతో పక్కా ప్లాన్‌తోనే చాందినిని అమీన్‌పుర గుట్టల్లోకి తీసుకెళ్లాడు. ఇద్దరిమధ్య గొడవ పెరగడంతో చాందినిని గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. సిసి కెమెరాలు ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపామని, అయితే చాందినిపై అత్యాచారం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని, ప్రియుడే హంతకుడని అనుమానంతో విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు.
ఉరితీయండి: తల్లిదండ్రులు
చాందిని, సాయికిరణ్‌ది ప్రేమకాదని, ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమేనని చాందిని తల్లిదండ్రులు తెలిపారు. సాయికిరణ్, చాందిని క్లాస్‌మేట్స్ అని టెన్త్ వరకు ఒకే స్కూల్‌లో చదువుకున్నారని, మూడేళ్ల క్రితం చివరిసారిగా సాయికిరణ్‌ను చూశామన్నారు. తమ కూతురిని పక్కా ప్లాన్‌తోనే సాయికిరణ్, అతని స్నేహితులు కలిసి హత్య చేశారని ఆరోపించారు. హంతకులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
పర్యవేక్షణ కొరవడుతోంది: కమిషనర్ శాండిల్య
విద్యార్థులపట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడుతోందని, సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా, ఫేస్‌బుక్ వంటివి విద్యార్థులపై చెడు స్వభావం చూపుతున్నాయని సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య అన్నారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫేస్‌బుక్ చూడటం, సందేశాలు పంపడం వంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండేలా చూడాలని సూచించారు.