Others

మన్ పసంద్ ఫర్నీచర్‌తో కనువిందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరిలోనూ మనదో స్టైల్ అనిపించుకోవాలని ఆరాటపడేవారి ఇంటికి తగ్గ ఫర్నీచర్ డిజైన్స్ ఎన్నో మార్కెట్లో లభిస్తున్నాయి. గార్డెన్, హాల్, డ్రాయింగ్ హాల్, వంటిల్లు- ఇలా అన్ని రకాల రూముల్లో సరికొత్త డిజైన్స్ వెల్లివిరుస్తున్నాయి. గది సైజును బట్టి, అభిరుచిని బట్టి, బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో విభిన్న రూపాల్లో అన్ని రకాల ఫర్నిచర్ లభ్యమవుతోంది. గృహ నిర్మాణంలో వాస్తుతో సమానంగా ఇంటీరియర్ డిజైన్‌కూ ప్రాముఖ్యతను ఇస్తారు. బెడ్‌రూం నుంచి.. బాత్రూం వరకూ ఇంట్లో ప్రతి అంశం ఆకట్టుకోవలసిందే. ఇపుడంతా ప్లాన్ ప్రకారం ఫర్నీచర్‌ను ఏర్పాటుచేసుకుంటున్నారు. ఎక్కువగా ప్లాస్టిక్, చెక్క, కేన్ ఫర్నీచర్ ఐటెమ్స్‌కే ప్రాధాన్యత పెరుగుతోంది. కార్నర్ టేబుల్స్, సెంటర్ టేబుల్స్ వంటివి చాలా రకాలుగా తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సిందే. చాలా రకాల ఫర్నీచర్ ఐటెమ్స్ మల్టిబుల్ యూజర్స్‌గా ఉపయోగపడుతున్నాయి. కుర్చీలు, సోఫాలు, టేబుల్స్, బెడ్స్, నైట్ స్టాండ్స్, క్యాబినెట్ కాంటెంపరరీ ఫర్నీచర్ అందుబాటులో ఉన్నాయి. రిలాక్స్ అవ్వటానికి అవసరమయ్యే ప్రతి వస్తువుకూ లివింగ్ రూంలో స్థానం కల్పించాలి. గది అందం ద్విగుణీకృతం కావాలంటే అలంకరణ సాదాసీదాగా అంటే సింపుల్‌గా ఉండాలి. ప్రత్యేకంగా లభించే ఫర్నీచర్‌తో అలంకరించాలి. గది చిన్నగా ఉంటే భారీ స్థాయిలో ఫర్నీచర్‌ను తేకూడదు. మన క్రియేటివిటీకి ఈ ఫర్నీచర్ డిజైనూ తోడైతే ఇంటికి అందమూ హుందాతనం వాటంతటవే వచ్చేయవూ...

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి