తెలంగాణ

సర్వీస్ రూల్స్ ఖరారు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరిస్తున్నామని, సర్వీసు రూల్స్ సైతం త్వరలో ఖరారు చేసి టీచర్లకు పదోన్నతులు కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. లాంగ్వేజి పండిట్లు, పిఇటిలకు కూడా స్కూల్ అసిస్టెంట్లుగా చేసి సర్వీసు రూల్స్ కిందకు తెస్తామని అన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి జూనియర్ లెక్చరర్లుగా మారేందుకు ఉన్న ‘్ఛనల్’ను మారుస్తామని అన్నారు. గత ప్రభుత్వం దానిని రద్దు చేసిందని, తాము మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు సర్వీసులో ఉండి చదువుకునే అవకాశాన్ని కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఇది కూడా గతంలో ఉంటే దానిని మధ్యలో ఆపేశారని, ఈ ప్రభుత్వం ఆ అవకాశాన్ని మళ్లీ పునరుద్ధరిస్తుందని చెప్పారు. ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం తీర్చే బాధ్యతను తీసుకుందని, పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించడంపై టీచర్లు దృష్టి పెట్టాలని డిప్యుటీ సిఎం పేర్కొన్నారు. విద్యా ప్రమాణాల పెంపుదలకు పునరంకితం కావాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత రాష్ట్రంలో ఎక్కడా జరగలేదని, పెద్దపల్లి జిల్లాలో అలాంటి ప్రయత్నం చేస్తే మానుకోవాలని కలెక్టర్‌కు సూచించామని చెప్పారు.