పశ్చిమగోదావరి

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 21: ఒకప్పుడు జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎక్కడేం జరుగుతోంది, ఎక్కడ ఏ సమస్యలున్నాయి, వాటికి పరిష్కారాలు, స్ధానికంగా ఉండే ఇబ్బందులు ఇలాంటి అంశాలపై డిడిఆర్‌సి వంటి వేదికలపై విస్తృతమైన చర్చలు జరుగుతుండేవి. అయితే టిడిపి అధికారంలోకి వచ్చిన అనంతరం డిడిఆర్‌సికి మంగళం పాడి ఇన్‌ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలోనే వ్యవహారాలు సాగించాలని నిర్ణయించారు. అయితే జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇన్‌ఛార్జి మంత్రులు మారినా జిల్లావ్యాప్తంగా ఇలాంటి సమన్వయ వేదిక ఇప్పటిదాకా నిర్వహించలేదంటే ఆశ్చర్యం కాదు. అయితే దీనివెనుక అనేక కారణాలు ఉన్నప్పటికీ ఎన్నికల వేడి సెగ తగులుతున్న నేపధ్యంలో తాజాగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు కన్పిస్తోంది. శుక్రవారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దానిలోభాగంగా జిల్లాస్ధాయి ప్రజాప్రతినిధుల, అధికారుల సమన్వయ సమావేశాన్ని ఆయన అధ్యక్షతన కలెక్టరేట్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపుగా టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సమావేశం జరగడం దాదాపుగా ఇది తొలిసారి అంటే ఆతిశయోక్తి కాదు. ఏదీఏమైనా ఇన్నాళ్లకైనా ఒక జిల్లాస్ధాయి సమస్యల వేదికకు తెరతీసిన నేపధ్యంలో పలు నియోజకవర్గాల సమస్యలు, అయా శాఖల పరిధిలో జరుగుతున్న వ్యవహారాలతోపాటు స్ధానికంగా ఉండే సమస్యలు, ఇబ్బందులు కూడా ఈసందర్భంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి సమావేశాలు ఉమ్మడిగా జరగని నేపధ్యంలో అయా నియోజకవర్గాల పరిధిలో ఏ శాఖ ఎటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది, అవి ఎవరికి అందుతున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాల్లో ఆరా దాదాపుగా కొరవడిందనే చెప్పాలి. చివరకు కొన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య కొద్దిపాటి సమన్వయం కూడా లేకుండా పోవటం పలుమార్లు ప్రత్యక్షంగానే బయటపడింది. అయితే శుక్రవారంనాటి జిల్లాస్ధాయి సమన్వయ సమావేశం ఇలాంటి సమస్యలకు ఒక సమాధానంగా నిలుస్తుందని కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రధాన కార్యక్రమంగా చూసుకుంటే దాని తర్వాత ఏ అంశానికి అదే స్దాయి ప్రాధాన్యత ఇచ్చారన్నది ఇప్పటికీ స్పష్టం కావాల్సి ఉంది. బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా పశ్చిమను ప్రకటించినప్పటికీ పలుప్రాంతాల నుంచి విమర్శల వర్షం ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది. దీనిలోనే పలు కుంభకోణాలు, దుర్వినియోగం వ్యవహారాలు కూడా వెలుగుచూడటం తెల్సిందే. వీటిపై జిల్లాస్ధాయిలో సమీక్షించి నిర్ణయం తీసుకున్న పరిస్దితి లేదనే చెప్పాలి. ఈవిధంగా పలు కీలకాంశాలను సమన్వయ సమావేశం సందర్భంగా ప్రజాప్రతినిధులు లేవనెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. జడ్పీ సమావేశాలు కొంతమేరకు ఇలాంటి సమన్వయానికి తావిస్తున్నప్పటికీ నిర్ణయాధికారం ఉన్న ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షతన ఈ భేటీలు జరిగితే తక్షణ పరిష్కారాలు లభిస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతోంది.
ఇక మరోవైపు ఇన్‌ఛార్జి మంత్రి రాక అధికారపార్టీపరంగా కూడా శుక్రవారం కీలకంగా నిలవనుంది. ప్రధానంగా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి గత కొంతకాలంగా వర్గాల మధ్య కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకదశలో తారాస్ధాయికి చేరుకున్న నేపధ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి వర్గాల మధ్య కొంత సమన్వయానికి కృషి చేసినప్పటికీ అంతగా ఫలితం లభించలేదు. చివరకు ఈ సారి జిల్లా స్థాయి పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని చింతలపూడిలో నిర్వహించి ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ విధంగానే శుక్రవారం ఇన్‌ఛార్జి మంత్రి వస్తున్న నేపధ్యంలో చింతలపూడిలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగా అక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో ఈ సమావేశాన్ని జిల్లాకేంద్రమైన ఏలూరులో నిర్వహించాలని నిర్ణయించారు. దీనితో పార్టీ పరంగా వర్గవిభేదాలు పతాక శీర్షికలకు ఎక్కకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా జిల్లా స్థాయి పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏలూరులో నిర్వహించి మధ్యాహ్నం నుంచి చింతలపూడిలో సభ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.