పశ్చిమగోదావరి

రాజకీయ పార్టీల ‘జోష్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 21: భీమవరం నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు జోష్‌గా ఉన్నాయి. ఎవరికివారు తమ సత్తాను చాటుకుంటున్నారు. నియోజకవర్గంలో ఒకేసారి అధికార తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించగా అదే రోజు వైఎస్సార్ కుటుంబం పేరుతో వైసిపి ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాన్ని బూత్ స్థాయి నుంచి ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ రెండు ప్రధాన పార్టీలు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రత్యేక పంథాను తమ ప్రచారంలో అనుసరిస్తున్నాయి. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలన్న ఆలోచనలో టిడిపి, వైసిపి తమ వ్యూహాలకు పదునుపెట్టారు. భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో డప్పులు, భారీ ఎత్తున ఫ్లెక్సీలు, భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి అవరోధాలు లేకుండానే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు ఎక్కడ కార్యక్రమం ఉన్నా అక్కడకు చేరుకుని ఈ ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. అన్ని సామాజిక వర్గాలను కలుస్తున్నామని పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ మరింత పుంజుకుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబం పేరుతో ఇంటింటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులందరినీ కలిసి వైఎస్సార్ కుటుంబంలో చేరుస్తున్నారు. ఈ కార్యక్రమాలకు నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన బూత్ కమిటీల ఇన్‌చార్జిలు తమ పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరిగాయా అని ప్రశ్నించుకుంటూ ప్రతేక స్టైల్‌లో కార్యకర్తలు, నాయకులు వెళ్తున్నారు. ఈ పార్టీ కూడా అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తోంది. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ నాయకులు గ్రంధి శ్రీనివాసే గెలుస్తారని ఆ పార్టీ కార్యకర్తలు చాలా ధీమాగా చెబుతున్నారు. మొత్తం మీద ఈ రెండు రాజకీయ పార్టీలు భీమవరం నియోజకవర్గంలో మంచి జోష్‌తో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాయి.
భీమవరం ఆర్టీసీ బస్టాండ్‌కు 4జి సేవలు
* ఎంపి నిధులతో క్వాడ్‌జెన్, బిఎస్‌ఎన్‌ఎల్ సంయుక్తంగా ఏర్పాటు* ప్రారంభించిన ఎంపి సీతారామలక్ష్మి

భీమవరం, సెప్టెంబర్ 21: భీమవరం ఆర్టీసీ బస్టాండ్‌లో ఇక నుంచి ప్రయాణికులకు 4జి సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాజ్యసభ సభ్యురాలు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి 4జి సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎంపి నిధులు కేటాయించారు. మూడేళ్లపాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ రోజు 4 ఎంబిపిఎస్ స్పీడుతో 4జి పనిచేస్తోంది. అంతేకాకుండా అరగంట పాటు అంటే 400 ఎంబిని వినియోగించుకోవచ్చు. ఎపిఎస్ ఆర్టీసి సహకారంతో క్వాడ్‌జెన్, బిఎస్‌ఎన్‌ఎల్ సంయుక్తంగా ఈ సేవలను ఆర్టీసి ప్రయాణికులు, విద్యార్థులు, ల్యాప్‌టాప్, స్మార్ట్ఫోన్ తదితర వినియోగదారులకు గురువారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి 4జి సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, పార్టీ నియోజకవర్గ మాజీ కన్వీనర్, డిఎన్నార్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), సీనియర్ నాయకులు మెంటే పార్థసారధి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఎన్నో ఆధునిక పద్ధతులను రాష్ట్ర పరిపాలనలోకి తీసుకువచ్చారన్నారు. అదే విధంగా అన్ని శాఖలకు ఈ సేవలను విస్తరించామని గుర్తుచేశారు. అదే మాదిరిగా క్వాడ్‌జెన్, బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థలకు చెందిన వారు తనను కలిసినప్పుడు ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఉన్న 5జి సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. దీని వల్ల ప్రతీ రోజు ఎంతోమందికి మేలు జరుగుతుందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ కెఎస్‌వి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఖాతాదారుల సంఖ్య క్రమేణా పెరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో మరిన్ని పథకాలను వినియోగదారుల కోసం తీసుకురానున్నట్టు చెప్పారు. క్వాడ్‌జెన్ జనరల్ మేనేజర్ పివి సుబ్బారావు మాట్లాడుతూ దాదాపుగా 150 దేశాల్లో తమ సంస్థ ద్వారా అనేక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. భీమవరానికి కూడా ఒక ప్రాజెక్టు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపి తోట సీతారామలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు తోట భోగయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, లంచి శ్రీనివాసరావు (చిన్ని), మాజీ ఎఎంసి చైర్మన్ రామలింగరాజు, వబిలిశెట్టి కనకరాజు, వడ్డి సుబ్బారావు, పళ్ళ ఏసుబాబు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్.నాగనర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.