అంతర్జాతీయం

అంగారకుడిపై నీరు నిజం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 18: అంగారక గ్రహం ఉపరితలంపై ఒక దశలో నీటి ప్రవాహం జరిగిందన్న అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ అరుణ తార ఉపరితలం ఘనీభవ దశలో ఉన్నప్పటికీ కూడా నీటి ప్రవాహం జరిగి ఉండవచ్చునని శాస్తవ్రేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంగారక గ్రహానికి సంబంధించి ఎప్పుడూ కూడా మిశ్రమ సంకేతాలే వ్యక్తమవుతూ వస్తాయని దీని ప్రాచీన కాలంలోనూ అదేరకమైన పరిస్థితి కొనసాగి ఉండవచ్చునని శాస్తవ్రేత్తలు స్పష్టం చేశారు. దీని ఉపరితలంపై నీటి ప్రవాహం కారణంగా ఏర్పడ్డ లోయ ప్రాంతాలు, సెలయేటి తీరాలను లోతుగా పరిశీలిస్తే కచ్చితంగా ఉధృతరీతిలోనే నీటి ప్రవాహం జరిగివుంటుందని చెప్పవచ్చునని బ్రౌన్ యూనివర్శిటీకి చెందిన శాస్తవ్రేత్తల బృందం స్పష్టం చేసింది. ఈ గ్రహానికి సంబంధించి తొలి దశ వాతావరణ పరిస్థితుల గురించి కూడా తాము అధ్యయనం చేశామని తెలిపారు. ఈ గ్రహ ఉపరితల భౌగోళిక స్వరూపం ఇటు శీతల, అటు ఉష్ణ దశల మధ్యే సాగుతూ వచ్చిందని, అదేవిధంగా అతి శీతల మంచుమయ వాతావరణం కూడా ఈ గ్రహ తొలి దశలో కొనసాగిందని వెల్లడించారు. నీటి ప్రవాహం అన్నది ఉష్ణోగ్రత తీవ్ర దశలో ఉన్నప్పుడు పేరుకుపోయిన మంచు కరిగిపోవడం వల్ల జరిగి వుండవచ్చునని శాస్తవ్రేత్తలు వెల్లడించింది. ఇలా కరిగిన నీరు స్వల్ప పరిమాణంలోనే ఉన్నప్పటికీ ఏటేటా దాని స్థాయి పెరిగి ఈ గ్రహానికి ప్రస్తుత రూపం వచ్చివుండవచ్చునని కూడా ఈ బృందం తెలిపింది. ఇందుకు ఉదాహరణగా అంటార్కిటికా హిమ ఖండంలో ఏర్పడ్డ లోయ ప్రాంతాలను శాస్తవ్రేత్తల బృందం ఉదహరించింది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగానే ఉన్నప్పటికీ వార్షిక ఉష్ణోగ్రత కారణంగా కొన్ని రకాల సెలయేళ్లు ప్రవహిస్తూనే ఉంటాయని బ్రౌన్ యూనివర్శిటీ శాస్తవ్రేత్త హార్ష్‌లే పోలెంబే తెలిపారు.